మామిడాల యశస్విని రెడ్డి

యశస్విని రెడ్డి చరిత్ర

యశస్విని రెడ్డి మామిడాల తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023 శాసనసభ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2]

మామిడాల యశస్వినీ రెడ్డి
మామిడాల యశస్విని రెడ్డి


పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు
నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1997
దిండిచింతలపల్లి గ్రామం,వంగూరు మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి హనుమండ్ల రాజారామ్ మోహన్ రెడ్డి
బంధువులు హనుమాండ్ల రాజేందర్ రెడ్డి, హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
సంతానం మాన్వి రెడ్డి
నివాసం హైదరాబాద్

జననం, విద్యాభ్యాసం

మార్చు

మామిడాల యశస్వినీ రెడ్డి 1997లో తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, దిండిచింతలపల్లి గ్రామం తిరుపతి రెడ్డి, మాధవి దంపతులకు హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె 2018లో శ్రేయాస్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజి నుండి బీటెక్ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

యశస్విని రెడ్డికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారంలో స్థిరపడిన తెలంగాణ రాష్ట్రం పాలకుర్తికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, రాజేందర్ రెడ్డిల కుమారుడు హనుమండ్ల రాజారామ్ మోహన్ రెడ్డితో 2019లో వివాహం జరిగింది. ఝాన్సీరెడ్డి 2023లో పాలకుర్తి నియోజకవర్గం నుండి టికెట్ ఆశించగా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ రెడ్డికి బదులు ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఇచ్చింది.

యశస్విని రెడ్డి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 47634 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి[3], 26 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టింది.[4][5][6]

మూలాలు

మార్చు
  1. News18 తెలుగు (3 December 2023). "పాలకుర్తిలో ఎర్రబెల్లికి షాక్ ఇచ్చిన 25 ఏళ్ల యువతి.. ఎవరీ యశస్విని రెడ్డి?". Archived from the original on 3 December 2023. Retrieved 3 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (4 December 2023). "తొలి అడుగులోనే సంచలన గెలుపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Eenadu (4 December 2023). "వయసు 30 ఏళ్లలోపే.. తొలి ఎన్నికలోనే సత్తా చూపించారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  5. The Hindu (8 December 2023). "New wave, new wins" (in Indian English). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  6. TV9 Telugu (3 December 2023). "అనూహ్య తీర్పు ఇచ్చిన ఓటర్లు.. సంచలనం సృష్టించిన యువనేతలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)