పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం
పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం, జనగామ జిల్లా లోని 3 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.
పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం చరిత్రసవరించు
శ్రీశైలం, శ్రీ కాళహస్తి, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలించిన ఏరియా త్రిలింగ దేశం. కాలగమనంలో "తెలంగాణ"గా మారింది.1948 సెప్టెంబరు 17 హైదరాబాద్ (తెలంగాణ) కొత్త రాష్ట్రంగా ఏర్పడింది.1952 రాష్ట్రంలో (M.L.A) సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.ఈ ప్రాంతం అప్పుడు నల్లగొండ జిల్లా పరిదిలో ఇప్పగూడెం నియోజకవర్గం1952-57 వరకు (ముందు పాత), చెన్నూర్ 1957-2004 (తరువాత పాత, 2009 పాలకుర్తి నియోజకవర్గం (వరంగల్ జిల్లా) సాయుదపోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఉంది. అప్పుడు PDF పార్టీ (పీపుల్స్ డెమెక్ట్రిట్ ప్రంట్) నుండి ఓట్లు ది: 27.03.1952 M.L.A గా విఠల్ రావు గెలిచాడు. కోదాటి నారాయణ రావు మీద.విఠల్ రావుకు ఓట్లు15000 రాగా. నారాయణరావు కు10,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1952 ఏప్రిల్ 6 న హైదరాబాద్ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది .వరంగల్ జిల్లా 1953 అక్టోబరు 1న ఆవిర్భవించింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రీక ఎన్నికలు వచ్చాయి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు
ఎన్నికైన శాసనసభ్యులుసవరించు
స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గారు (వడ్డెకొత్తపల్లి, (కొడకండ్ల) 1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. S.V.K ప్రసాద్ (ఆంధ్ర) MLA గా గెలిచారు. 1962లో MLA స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డెకొత్తపల్లి) పై గెలిచారు..1962 నుండి 1967 వరకు MLA గా పనిచేసారు, 1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు. నల్లా నరసింహులు (కమ్యూనిస్ట్ పార్టీ) ను ఓడించి 1967-1972 వరకు MLA గా పనిచేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు.1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు.యెతిరాజారావు గారు హైకోర్టు వెళ్లారు.ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు వెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు. 1975లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటిగా 6సార్లు MLA గా గెలిచారు 2 సార్లు మంత్రిగా అయ్యారు. నెమురుగోమ్ముల సుధాకర్ రావు, పాలకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం MLA గా,1999 - 2004,
యతిరాజారావు కుటుంబ సభ్యులు1962- 2004 వరకు MLAలుగా గెలిచారు.2004లో దుగ్యాల శ్రీనివాస రావు (వర్దన్నపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామం). సుధాకర్ రావు పై శ్రీ దుగ్యాల శ్రీనివాసరావు MLA గా గెలిచారు...
2009లో 2014 లో, (2014 – 2019 పదవి కాలం) ఇప్పటి వరకు 2 సార్లు ఎర్రబెల్లి దయాకర్ రావు (వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరి గ్రామం) పాలకుర్తి నియోజకవర్గం MLA గా గెలిచారు.
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి దుగ్యాల శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్.ప్రవీణ్ రావు, లోక్‌సత్తా తరఫున ఆర్.సుజాత పోటీచేశారు.[2]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2018 100 పాలకుర్తి జనరల్ ఎర్రబెల్లి దయాకర్ రావు పు టిఆర్ఎస్ 117504 జంగా రాఘవరెడ్డి పు భారతీయ జాతీయ కాంగ్రెస్ 117504 2014 100 పాలకుర్తి జనరల్ ఎర్రబెల్లి దయాకర్ రావు పు తె.దే.పా 57799 దుగ్యాల శ్రీనివాస రావు పు భారతీయ జాతీయ కాంగ్రెస్ 53486 2009 100 పాలకుర్తి జనరల్ ఎర్రబెల్లి దయాకర్ రావు పు తె.దే.పా 65280 దుగ్యాల శ్రీనివాస రావు పు భారతీయ జాతీయ కాంగ్రెస్ 62617