మామిడిలో తలమార్పిడి

తలమార్పిడి అనునది మొక్కలలో ఒక ప్రత్యుత్పత్తి విధానము. ఇది ప్రాచీన కాలం నుండి ఉన్నదని తెలుస్తుంది. నెల్లూరు జిల్లా సోమశిలలో ఉన్న ఒక పురాతన శివాలయంలో ఉండే పురాతన మామిడిచెట్టు నాలుగు కొమ్మలతో వివిధ రుచులు గల నాలుగు రకాల మామిడి కాయలు కాసేదని పెద్దలు చెప్తుండేవారు. అంటే దీనిని బట్టి పూర్వమే మన పెద్దలు ఈ తలమార్పిడి విధానాన్ని అవలంబించారని చెప్పవచ్చు.

మామిడిలో తలమార్పిడి

విధానము

మార్చు
  1. తలమార్పిడి చేయదలచుకున్న చెట్లను కాపు సమయంలోనే గమనించి, కాయలు కోసిన తర్వాత జూలై మాసంలో నేల నుంచి 4-5 అడుగుల ఎత్తున అన్ని కొమ్మల్ని రంపంతో కోసి తొలగించాలి.
  2. 10 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్, 6 గ్రాములు కార్బరిల్ పొడిని లీటరు నీళ్లలో కలిపి ఆద్రావణాన్ని కోసిన కొమ్మల భాగాలకు పూయాలి. కొమ్మలకు అన్నివైపుల చిరుకొమ్మలు పుట్టుకొస్తాయి.
  3. కోసిన ప్రతికొమ్మకు దృఢంగా ఉన్న 5-6 చిరు కొమ్మలు ఉంచి మిగిలినవి తొలగించాలి. ఈ విధంగా చెట్టుకు సుమారు 20 నుంచి 25 చిరుకొమ్మలు ఉండేలా చూడాలి.
  4. కొత్తగా పుట్టిన చిగుళ్లపై చీడపీడలు, తెగుళ్లు ఆశించకుండా 2 మి.లీ. క్వినాల్ ఫాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రొటోఫాస్, ఒక గ్రాము కార్బండజిం లేదా 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు
  5. నీటికి చొప్పున కలిపి 2 వారాల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాలి. కొత్తగా పుట్టిన చిరు కాడలు పెన్సిల్ మందంతో ఉన్నప్పుడు (ఒకటిన్నర నుంచి రెండు నెలల వయసు ఉన్నప్పుడు) అంటు కట్టేందుకు అనువుగా ఉంటాయి.
  6. అంటు కట్టేందుకు 10 రోజుల ముందుగా ఎన్నిక చేసుకున్న రకం చెట్టుపైనున్న 3-4 నెలల వయస్సున్న కొమ్మలకు, తొడిమల్ని ఉంచి ఆకు భాగాన్ని కత్తిరించాలి. ఈ విధంగా ఆకుల్ని కత్తిరించిన 8-10 రోజులకు
  7. తొడిమలు పసుపు రంగుకు మారి సులువుగా పడిపోతాయి. దీనివల్ల కొమ్మ చివరనున్న మొగ్గ తొందరగా చిగురుగా మారేందుకు సిద్ధంగా ఉంటుంది. దీన్నే ప్రీక్యూరింగ్ అంటారు.
  8. ఈ దశలో రెమ్మల్ని చివర నుంచి 10-15 సెం.మీ. పొడవు ఉండేలా కత్తిరించి అంటు కట్టేందుకు వాడాలి. వీటినే సయాను కొమ్మలంటారు.
  9. మార్పు చేయదలచుకొన్న చెట్టుపై అంటు కట్టేందుకు తయారుగా ఉన్న చిరుకొమ్మలపై ఈ సయాను కొమ్మలతో సాఫ్ట్ వుడ్ లేదా వినీరు పద్ధతిలో అంటు కట్టాలి.
  10. అంటుకట్టడం సెప్టెంబరు చివరిలోపు పూర్తి చేయాలి. పైవిధంగా అంటు కట్టినప్పుడు తలమార్పిడి చేసిన చెట్టు పై కొమ్మకు 4-5 చొప్పున కనీసం 20 నుంచి 25 అంట్లు ఉంటాయి.
  11. ఇందులో 80 శాతం విజయవంతమైనా, అవసరమైనన్ని సయాన్ కొమ్మలు (కొత్తరకం రెమ్మలు) వృద్ధి చెందుతాయి. కలిసిపోయిన అంట్లకు చుట్టిన పాలిథీన్ పేపరును కట్టిన ఆరు వారాల్లో తొలగించాలి.
  12. అంటుకట్టిన భాగం కింద పెరిగే చిగుళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. అంటు కట్టిన సంవత్సరం తర్వాత దృఢంగా ఏపుగా పెరిగిన కొమ్మల్ని ఉంచి చెట్టు గుబురు కాకుండా మిగిలిన కొమ్మల్ని తొలగించాలి.
  13. అంటుకట్టిన 3 సంవత్సరాలకే కొమ్మలు బాగా వృద్ధి చెంది తలమార్పిడి చేసిన చెట్లు ఎన్నుకొన్న రకం కాయలు కాయడం ఆరంభిస్తుంది.
  14. ఎరువులు, నీటిపారుదల, సస్యరక్షణ చర్యలు తోటల్లో ఉన్న ఇతర చెట్లకు చేసినట్లే తలమార్పిడి చేసిన వాటికి కూడా చేసి మంచి దిగుబడి సాధించవచ్చు.

గ్యాలరీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు

మామిడిలో తలమార్పిడి - ప్రయోజనాలు (ఈనాడు పత్రిక రైతేరాజు విభాగంలో 2012 జూన్ 27)