మామిడి వెంకటార్యులు
కొత్త వాడుకరుల చిట్టామామిడి వెంకటార్యులు తొలి తెలుగు నిఘంటు కర్త. ఈయన ఆంధ్ర దీపిక పేరుతో రాసిన నిఘంటువు తెలుగు భాషా చరిత్రలో ఒక నూతన ఒరవడికి నాందిపలికింది.ఈయన సంస్కృతంలో రచించిన శబ్దార్థ కల్పతరువు మొదటిగా అచ్చయిన సంస్కృత నిఘంటువు.ఈయన "ఆంధ్ర లక్షణం", "పర్యాయ పదాల రత్నమాల", "శకట రేఫ లక్షణం", "విశేష లబ్ద చింతామణి", " తెలుగు వ్యాకరణం" వంటి గ్రంథాలను రచించారు. తెలుగు వ్యాకరణంలో దంత్య తాలవ్యాలను వెంకటార్యులే మొదట ప్రవేశపెట్టారు. వేదాలు, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు.యాజ్ఞవల్కుని పరాసర సంహితను తెలుగులోకి అనువదించారు.
మామిడి వెంకటార్యులు MAMIDI VENKATARYULU | |
---|---|
జననం | మామిడి వెంకటార్యులు 1764 మార్చి 16 బందరు , కృష్ణాజిల్లా |
నివాస ప్రాంతం | బందరు |
వృత్తి | సాహితీ వేత్త, రచయిత |
ప్రసిద్ధి | రచయిత , తొలి తెలుగు నిఘంటు కర్త. |
మతం | హిందూ |
తండ్రి | వెంకన్న |
తల్లి | విజయలక్ష్మీ |
జీవిత విశేషాలు
మార్చుఈయన 1764 మార్చి 16 న బందరు పరాసుపేటలోని విజయలక్ష్మీ, వెంకన్న లకు జన్మించారు.బందరులో దుకాణదారునిగా ఉన్న వెంకటార్యులు ఒక పండితునిగా, తెలుగుభాషా ఉధ్దారకునిగా ప్రశంసలందుకున్నారు. వెంకటార్యులు వ్రాసిన "ఆంధ్ర దీపిక" ప్రతిని ఈస్టు ఇండియా కంపెనీ వారు వెయ్యి వరహాలకు కొనుగోలు చేశారు. వీరి పాండిత్యాన్ని చూసిన విక్టోరియా రాణి బందరు వచ్చినపుడు వీరిని టౌన్ హాలులో "పండిత రాయలు" బిరుదునిచ్చి సత్కరించారు. ఈ టౌను హాలును ఇప్పటికీ విక్టోరియా రాణి హాలుగా పిలుస్తారు. తెలుగు భాషకు వీరు చేసిన సేవకు సి.పి బ్రౌన్ మెచ్చి సువర్ణ కంకణం తొడిగారు. బందరు సాహితీ వేత్తలు ఈయనకు "బాల అమర్" అని బిరుదునిచ్చారు. అమరుడు ఎలా మొదట సంస్కృత నిఘంటువు వ్రాసాడో అలానే ఈయన కూడా బాల్యంలో తెలుగు నిఘంటువు వ్రాయడంలో ఆ బిరుదునిచ్చారు.1965 లో కేంద్ర ప్రభుత్వం వీరి రచనలను అచ్చు వేయడానికి నిధులు కేటాయించింది. వీరి "ఆంధ్ర దీపిక"ను చూసిన అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ దాని ప్రచురణకు నిధులు అందించారు. ఇలా సాహిత్య సేవలోనే కాకుండా భాషా సేవలో బందరుకు పేరు తెచ్చిన ప్రముఖుడీయన.