మారుతీ శతకం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హనుమంతుడుసవరించు
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. ఈయన రామాయణంలో సుందరాకాండలో కీలక పాత్ర పోషించాడు.
కవి పరిచయంసవరించు
ఈ శతకమును రచించినది శ్రీకాకులం జిల్లా కుద్దిగం వాస్తవ్యులు శ్రీ పంతుల సూర్య ప్రకాశరావు గారు. ఈయన కవి శేఖర బిరుదాంకితుడు, గ్రేడ్ 1 తెలుగు పండితుదు, భాషాప్రవీణ. తెలుగు భాషపై మక్కువతో ఎన్నో శతకాలు, పద్యాలు, భక్తి గీతాలు, నాటికలు రచించారు. అవి సత్య సాయి బాబా శతకం, సూర్య శతకం, బాల రామాయణం మొదలైనవి. ఈయన రేడియోలో కూడా పని ఛేశారు. ఇప్పుడు వున్న అతి తక్కువ తెలుగు భాషా కవులలో వీరు ఒకరు. ఈయన తెలుగు ఉపాధ్యాయుడుగా ప్రభుత్వ పాఠశాలలలో, కలాశాలలలో సేవ చేసి పదవీ విరవ్వీ వ్ిర్ చేసారు.
మారుతీ శతకంసవరించు
అంకితంసవరించు
హనుమా ! యీ శతకంబును గొనుమా ! సద్భక్తితోడగోరి, యొసహితిన్ వినుమా నీ గుణ గణములు ననుమానములేక, బ్రోవుమంజని తనయా
అంకిత మొసగితి నీకును, సంకటహర! నన్నునెపుడు సాకుము! దయతో లెంకనుగా, నన్నేలుము పంకజ గర్భేంద్రవినుత ! పావననామా!
పంతుల సూర్యప్రకాశము సంతసమున నీకునొసగు శతకంబును, ధీ మంతులు చదివియుఁ బొగడిన స్వావంతము నానందమగును, సద్గుణ సాంద్రా
శతకముఁ జదివిన భక్తుల కతులిత సౌఖ్యంబు, బలము గౌరవమెపుడున్ సతతము కౌతుకమును వా క్చతురత్వ మొసంగుమయ్య ! కరుణను, హనుమా !