రామాయణం (సినిమా)
తెలుగు సినిమా
(బాల రామాయణం నుండి దారిమార్పు చెందింది)
రామాయణం లేదా బాల రామాయణం 1996 లో అందరూ పిల్లలతో నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా. ఇది గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి గారిచే నిర్మించబడినది. ఇందులో జూనియర్ ఎన్.టి.ఆర్ రామునిగా నటించాడు. ఈ చిత్రం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాలల సినిమా గా ఎంపికచేయబడినది.[1]
రామాయణం (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గుణశేఖర్ |
---|---|
నిర్మాణం | ఎమ్.ఎస్.రెడ్డి |
చిత్రానువాదం | మల్లెమాల సుందర రామిరెడ్డి |
తారాగణం | జూనియర్ ఎన్టీయార్, స్మిత |
సంగీతం | మాధవపెద్ది సురేష్ ఎల్.వైద్యనాథన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్, కె.ఎస్.చిత్ర, జేసుదాసు, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి |
గీతరచన | మల్లెమాల సుందర రామిరెడ్డి, ఉండేల భుజంగరాయశర్మ (పద్యాలు) |
సంభాషణలు | ఎమ్.వి.ఎస్.హనుమంతరావు |
ఛాయాగ్రహణం | శేఖర్ వి. జోసఫ్ |
కూర్పు | బి.బి.రెడ్డి |
నిర్మాణ సంస్థ | శబ్దాలయ ధియేటర్స్ |
అవార్డులు | భారత జాతీయ చలనచిత్ర పురస్కారం |
భాష | తెలుగు |
పాత్రధారులు
మార్చు- జూనియర్ ఎన్.టి.ఆర్ : రాముడు
- స్మితా మాధవ్ : సీత
- స్వాతి బాలినేని : రావణుడు
- నారాయణం నిఖిల్ : లక్ష్మణుడు
- శ్వేతా రావు : ఊర్మిళ
- సుంధర ఎస్. రంగన్ : కైకేయి
- చిరంజీవి సమ్మెట : భరతుడు
- సునయన : శబరి
పాటలు-పద్యాలు
మార్చు- అది శుభోదయ వేళ అది మహోదయ వేళ - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- విరిసీ విరియని మల్లియలు , గానం. కె ఎస్ చిత్ర
- కౌసల్యా సుప్రజా రామా (శ్లోకం) - గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- జటా కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ (శివతాండవ స్తోత్రం)
- సీతారాముల కళ్యాణం సకల శుభములకు సోపానం
- రామయ్య రాజౌతాడంట మనకింక ప్రతిరోజు పండగేనంట
- ఆ సూర్యభగవానుడు ఆదేశమిచ్చినా (పద్యం) బి. సాయి కార్తీకేయ
- ఎంత మంచివాడివయ్యా రామయ్య సామి
- శ్రీహరీ ఎంత మాట నీవంటివమ్మా (పద్యం)
- అదిగో మొదలయ్యింది వారధి రామాయణానికది సాతధి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- అండబాయని జంటగా అడావి కన్నుల పంటగా , గానం. జేసుదాసు, కె ఎస్ చిత్ర
- బుడి బుడి అడుగులు వేయకముందే
- వందే శ్రీరఘువంశ రత్నతిలకం (పద్యం)
- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం (ఆంజనేయ దండకం)
- గడువు లోపలతా (పద్యం)
- వినుమో రాఘవా నిజ శత్రువగు నన్ను ద్వేషించక (పద్యం)
- ఆగుమాగుము తల్లీ నీ అనుగు భర్తా రామభద్రుడు
- నను తల్లిగా శ్రీరాముని జనకునిగా ఎంచి
- పౌలస్య బ్రహ్మగా ప్రజల నాల్కలమీద నర్తన, గానం. బి. సాయి కార్తీకేయ
- ధర్మ సంస్థాపనార్థం శ్రీరాముడై అవరాతమెత్తిన హరి
- పురజనుల సంబరం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- రామాయణము , గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ .
పురస్కారాలు
మార్చుసంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1998 | గుణశేఖర్[2] | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాలల సినిమా | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ "Archived copy". Archived from the original on 13 డిసెంబరు 2011. Retrieved 4 మార్చి 2015.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-09-28. Retrieved 2013-12-28.