మార్క్ జూకర్‌బర్గ్

మార్క్ ఎలియట్ జూకర్‌బర్గ్ (English: Mark Elliot Zuckerberg; జననం: మే 14, 1984) ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, అంతర్జాల వ్యవస్థాపకుడు. అతను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సృష్టికర్తగా సుపరిచితుడు. ఇప్పుడు దానికి తను ప్రధాన కార్యనిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దానిని జూకర్బెర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు తన సహా విద్యార్థులు అయిన డస్టిన్ మోస్కోవిత్జ్, ఎడ్వర్డో సవేరిన్, క్రిస్ హుఘ్స్తో కలిసి 2004 లో ఒక ప్రైవేట్ సంస్థగా సహ-స్థాపించాడు. జుకెర్బెర్గ్ ని 2010లో "పర్సన్ అఫ్ ది ఇయర్"గా టైమ్ మ్యాగజైన్ ఎన్నుకుంది. తన వ్యక్తిగత సంపద $ 17.5 బిలియన్ తో ప్రపంచంలోని బిలియనీర్లలో అతి చిన్న వయస్కునిగా అంచనా వేశారు.

మార్క్ జూకర్‌బర్గ్
Mark Zuckerberg CEO Facebook
జననం
మార్క్ ఎలియట్ జూకర్‌బర్గ్

(1984-05-14) 1984 మే 14 (వయసు 40)
వృత్తిఫేస్‌బుక్ కు ప్రధాన కార్యనిర్వాహకుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

జూకెర్‌బర్గ్ 1984లో కరెన్ అను ఒక మానసిక వైద్యురాలుకి, ఎడ్వర్డ్ జుకెర్బెర్గ్ అను ఒక దంత వైద్యుడుకి వైట్ ప్లెయిన్స్, న్యూయార్క్ లో జన్మించాడు. అతను, తన ముగ్గురు సోదరీమణులు.. రాండీ, డోన, అరిఎల్లె, డాబ్స్ ఫెర్రీ, న్యూయార్కులో పెరిగారు. యూదునిగా పెరిగిన జూకెర్‌బర్గ్, 13 సంవత్సరాల వయస్సులో బార్ మిత్వాహ్ గా మారటం జరిగినది; అప్పటినుండి అతను తనని తాను ఒక నాస్తికుడుగా చెప్పుకునేవాడు.

సాఫ్ట్‌వేర్ డెవెలపర్

మార్చు

ఫేస్‌బుక్

మార్చు