మార్గా ఫాల్స్టిచ్

జర్మన్ రసాయన శాస్త్రవేత్త

మార్గా ఫాల్స్టిచ్ (1915 జూన్ 161998 ఫిబ్రవరి 1) జర్మన్ రసాయన శాస్త్రవేత్త. ఆమె 44 సంవత్సరాలుగా "స్కాట్ ఎజి" (గాజు, గాజు-సిరామిక్స్ తయారుచేసే అంతర్జాతీయ సంస్థ) లో తన సేవలనందిస్తుంది. ఆమె పనిచేసిన కాలంలో 300 రకాలకు పైగా దృశాశాస్త్రానికి సంబంధించిన గాజు పదార్థాలను రూపొందించింది. ఆమె పేరుతో 40 రకాల గాజు పదార్థాల పేటెంట్లు నమోదు కాబడినవి. ఆమె "స్కాట్ ఎజి" లో మొదటి మహిళా ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది.

మార్గా ఫాల్స్టిచ్
జననం(1915-06-16)1915 జూన్ 16
వేమర్, తురింజియా, జెర్మన్ రాజ్యం
మరణం1998 ఫిబ్రవరి 1(1998-02-01) (వయసు 82)
మైంజ్, జర్మనీ
నివాసంజర్మనీ
పౌరసత్వంజర్మన్
జాతీయతజర్మన్
రంగములురసాయన శాస్త్రము, గాజు తయారీ, దృశాశాస్త్రము
వృత్తిసంస్థలుస్కాట్ ఎ.జి

జీవిత విశేషాలు మార్చు

ఆమె 1915 లో "వైమార్" లో జన్మించింది. వారి కుటుంబం 1922లో "జెనా" ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఆమె పాఠశాల విద్యను అభ్యసిందింది. 1935లో ఆమె హైస్కూలు లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత, "స్కాట్ ఎజి" సంస్థలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గా శిక్షణ పొందింది. ఆ సంస్థ ఐరోపాలో దృశాశాస్త్రానికి సంబంధించిన గాజు రకాలను రూపొందించడంలో ప్రత్యేక సాంకేతక పరిజ్ఞానం కలిగినది. అక్కడ పనిచేసే ప్రారంభ సంవత్సరాలలో ఆమె "పలుచని ఫిల్ములు" అభివృద్ధి కోసం పనిచేసింది. ఆ పరిశోధన ప్రస్తుతం "సన్ గ్లాస్", పరావర్తనం చెందించని కటకాల తయారీకి ఉపయోగపడుతుంది.

ఆమె తన సామర్థ్యంతో గ్రాడ్యుయేట్ అసిస్టేంట్ నుండి టెక్నీషియన్‌గా, సైంటిఫిక్ అసిస్టెంట్‌గా, చివరకు శాస్త్రవేత్తగా స్థాయిని పెంచుకుంది. ఆమెకు కాబోయే భర్త రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన తర్వాత ఆమె తన దృష్టిని వృత్తి జీవితంపై మరల్చింది. 1942 లో ఆమె "స్కాట్ ఎజి"లో తన సేవలను కొనసాగిస్తూనే రసాయన శాస్త్రాన్ని అభ్యసించించింది. కాని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మారిన పరిమాణాల దృష్ట్యా చదువును కొనసాగించలేకపోయింది. "జెనా" ప్రాంతం సోవియట్ ఆక్రమిత జోన్ లో ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ గాజు తయారీ సాంకేతిక పరిజ్ఞాన సౌకర్యం ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దేశాల కూటమి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ ప్రాంతం నుండి బదిలీ చేయాలని అనుకుంది. అందువలన 41మంది నిపుణులు, మేనేజర్లు "స్కాట్ ఎజి" నుండి పశ్చిమ ప్రాంతానికి రప్పించబడ్డారు. అందులో ఆమె కూడా ఉంది.

1949లో "లాండ్‌షట్" లో నూతన పరిశోధనా ప్రయోగశాలను "స్కాట్ ఎజి" నుండి వచ్చిన ప్రజల కోసం, పరిశోధనలను కొనసాగించేందుకు నెలకొల్పబడినది. అయినప్పటికీ 1948లో "జెనా" లో ఉన్న గాజు పరిశ్రమ కైవశం చేసుకొనబడింది. 1949లో జర్మనీ విభజన జరిగినది. అందువలన కొత్త పరిశ్రమను "స్కాట్ ఎజి నుండి వచ్చిన 41మంది గాజు తయారీదారుల" కోసం "మైంజ్" లో నెలకొల్పారు.

"మైంజ్" ప్రాంతం శివారు ప్రాంతమైన "న్యూస్టాడ్" (కొత్త నగరం) వద్ద ఈ పరిశ్రమ 1952లో ప్రారంభించబడినది. ఇచట మార్గా ఫాల్స్టిచ్ తన పరిశోధనలను కొనసాగించి వివిధ రకాల గాజు పదార్థాల అభివృద్ధి కోసం కృషి చేసింది. ఆమె ప్రత్యేకంగా సూక్ష్మదర్శిని, దూరదర్శిని వంటి పరికరాలలో ఉపయోగించే కటకాలను రూపొందించుటకు కృషి చేసింది.

ఆమె SF 64 వంటి అతితేలికైన కటకాలను ఆవిష్కరించి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దీనికి గానూ 1973లో గౌరవింపబడింది. 1979లో ఆమె "స్కాట్ ఎజి" లో తన 44 సంవత్సరాల సేవల అనంతరం పదవీ విరమణ చేసింది. తదనంతరం ఆమె వివిధ ప్రాంతాలను సందర్శించి "గాజు తయారీ సదస్సుల" లో ఉపన్యాసాలను ఇచ్చేది. ఆమె 1998 ఫిబ్రవరి 1న తన 82వ యేట మరణించింది.

2018 జూన్ 16న గూగుల్ డూడుల్ ఆమెను గౌరవించింది.

మూలాలు మార్చు

  • "Von Jena nach Mainz – und zurück. Schott-Geschichte zwischen Kaltem Krieg und deutscher Wiedervereinigung" [From Jena to Mainz and back: The story of Schott between the Cold War and German reunification] (PDF) (in జర్మన్). Mainz: Schott Glaswerke [Schott Glassworks]. 1995. Archived from the original (PDF) on 6 డిసెంబర్ 2008. Retrieved 19 January 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  • "Germany's Female Inventors". Deutsche Welle. Retrieved 19 January 2014.