కేరళలోని తిరువాన్కూరు ఒక గొప్ప రాచరిక వ్వవస్థ. ఆరాజ్యం లోని అనంతపద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరుననే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చినది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్‌కోర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది.

ఈ రాజు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఉన్న విశాల వైవిధ్యమైన గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామంలతో తయారు చేసారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాల్సిఉంటుంది. ఆదిశేషుని పై పవళించినట్లు ఉన్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.

ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి ఉన్నదని నమ్మకం. అయితే ఈ గదులను కొన్ని వందల సంవత్సరాలుగా తెరిచిన దాఖాలాలు లేవు. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినా, ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.

మూలాలు

మార్చు
  • ఈనాడు దిన పత్రిక
  • ఆంధ్ర జ్యోతి దిన పత్రిక 27.12.2013 (కరెంట్ అపైర్స్) "కరెంట్ అఫైర్స్ | ఆంధ్రజ్యోతి". web.archive.org. 2013-12-28. Archived from the original on 2013-12-28. Retrieved 2023-05-09.