మాలకొండ

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామం

మాలకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వోలేటివారిపాలెం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఎస్.టి.డి.కోడ్=08598. ఇది.మాలకొండ, అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మాలకొండ
గ్రామం
పటం
మాలకొండ is located in ఆంధ్రప్రదేశ్
మాలకొండ
మాలకొండ
అక్షాంశ రేఖాంశాలు: 15°7′4.800″N 79°38′27.600″E / 15.11800000°N 79.64100000°E / 15.11800000; 79.64100000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలంవోలేటివారిపాలెం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523116

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహ స్వామివారి ఆలయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వోలేటివారిపాలెమ మండలం లోని ఒక పుణ్యక్షేత్రం పేరు మాలకొండ. ఇక్కడ ఉన్న కొండపై, మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామి కొలువై ఉన్నందున ఈ ఊరికి మాలకొండ అని పేరు వచ్చింది. ఈ స్వామిని మాలకొండ స్వామిగా పిలుస్తారు. ఈ ఆలయం శనివారంనాడు మాత్రమే తెరిచెదరు. ఇక్కడకు ప్రతి శనివారం, వివిధ ప్రాంతాలనుంచి భక్తులు విచ్చేస్తూంటారు. ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. భక్తుల సహకారంతో కొండపైకి మెట్ల నిర్మాణం జరిగింది. ఈ కొండపైకి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. ఈ కొండపై ఉన్న రెండు పెద్ద బండ రాళ్ల మధ్య దారి చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ దారిలోనే దేవాలయం వద్దకు వెళ్లవలసి ఉంటుంది. చిన్నవారు, పెద్దవారు, సన్నవారు, లావువారు ఇరువైపుల ఉన్న ఈ బండరాళ్లను ఇరుకుగా రాసుకుంటూ వెళ్తారు. ప్రతి సంవత్సరం శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహస్వామి జయంత్సోవం సందర్భంగా వేడుకలను అత్యంత వైభవంగా ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివస్తారు. పురాతన, పవిత్ర పుణ్య క్షేత్రమైన మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన ఆరు నృసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణానికి నైరుతి దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్య క్షేత్రం వెలసి యున్నది. లక్ష్మీదేవి సమేతుడైన నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా, భక్తుల కోర్కెలు తీర్చే వరాల నరసింహస్వామిగా పేరు గాంచాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మాలకొండ&oldid=3992105" నుండి వెలికితీశారు