మాలి : ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 18 వ కులం.

చరిత్ర

మార్చు

తెలుగు రాష్ట్రాలలో ఒక చోట ఎస్టీగా, ఇంకోచోట బీసీగా, మరోచోట ఓసీగా చలామణి అవుతున్నారు. జ్యోతీరావ్ ఫులే వారసులు `మాలీ' కులస్తులు. అదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాలలో మాలీలను ఎస్టీలుగా గుర్తించారు. కరీంనగర్‌లో మాత్రం వీరు ఓసీలు. మిగిలిన అన్ని జిల్లాల్లో బీసీలు. తేనిగోళ్లు, బారె, బరై, మరార్‌, తంబోలి వంటి పేర్లతో కూడా వీరిని పిలుస్తారు. రాష్ట్రంలో మాలీల మొత్తం జనాభా దాదాపు 6 లక్షలు కాగా, ఇందులో ఆదిలాబాద్ లోనే మూడు లక్షల మంది ఉన్నారు.

వృత్తి

మార్చు

అనాదిగా తోటమాలీలుగా ఉన్న వీరు భూమి, నీరు ఏ మాత్రం అందుబాటులో ఉన్నా... కొత్తిమీర, మెంతి, పాల కూరలతోపాటు, ఉల్లిగ డ్డలు, ఆవాలు వంటివి పండిస్తారు. బావుల వద్ద, చిన్న చిన్న మడుగు దగ్గర కూడా వీరు ఇదే విధంగా శ్రమిస్తారు. మోట బావుల ద్వారా కూరగాయల తోటలు సాగుచేసి జీవనం గడుపుతారు. పురు షులు పొలాల్లో పూలు, కూరగాయలను పండిస్తే, మహిళలు వాటిని అమ్ముకువస్తారు. ఉల్లిపాయలు ఎక్కువగా పండిస్తారు కనుక వీరిని`ఉల్లిగడ్డల బారో'లు అని గిరిజన ప్రాంతాలలో పిలుస్తుంటారు.

సామాజిక జీవితం

మార్చు

బారో అన్న పదానికి వెట్టిచాకిరీ మనుషులు అని అర్థం. వీరు ఎక్కువగా మహారాష్ర్ట సరిహద్దు ప్రాం తాలలో జీవిస్తారు కనుక. ఇప్పటికీ వీరి ఇళ్లలో మరాఠీ మాట్లాడుతుంటారు. మహారాష్ర్ఠతో వీరికి సత్సంబంధాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీవంటి ప్రాంతాలకు వీరు పూలను విక్రయిస్తుంటారు. మాలీ కుల స్తులు గిరిజన ప్రాంతంలో తరతరాలుగాఅడవి బిడ్డలతో సమానంగా పోడువ్యవసాయం చేస్తున్నారు. అయితే....1/70 చట్టం ప్రకారం వీరికి భూమిపై హక్కులేదు. ఫలితంగా... ఎకరం భూమి కౌలుకు తీసుకుంటే... పది బస్తాల ధాన్యం సంబంధిత గిరిజన రైతుకు చెల్లించాలి. కూర గాయలు, పూలు పండిస్తే, ఎకరాకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకూ ఇస్తుంటారు. అర ఎకరం, ఎకరం సొంత భూమి ఉన్నవారు వీరిలో ఐదు శాతం కూడా ఉండరు. పంట పండించటానికి ఎంత కష్టపడతారో. వాటిని మార్కెట్‌ చేయడానికి అంతకంటే ఎక్కువ శ్రమించాల్సివస్తోంది.పొలం నుంచి మార్కెట్‌కు దాదాపు 20 నుంచి 30 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇదంతా అడవీ ప్రాంతం కావడంతో ఎక్కడా రోడ్డు సౌకర్యం ఉం డదు. మార్కెట్‌కు కూరగాయలు చేరాలంటే ట్రాక్ట ర్లు, డీజిల్‌ ట్రాలీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వర్షాకాలంలో ట్రాక్టర్లు, డీజిల్‌ ట్రాలీలు తిరగే అవకాశం ఉండదు. అప్పుడు ఎడ్లబండ్లే గతి. సాయం త్రంలోపే కూరగాయలను గంపలు, బస్తాలలోకి చేర్చి ఎడ్ల బళ్ళకు ఎక్కిస్తారు. ఇవి తెల్లవారేలోపు మార్కెట్‌ ప్రాంతాలకు చేరుకోవాలి. దీంతో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేస్తారు. వెంట తెచ్చుకున్న జొన్న రొట్టెలు, పెరుగు వంటి చద్దిమూటతో కడుపు నింపుకుని మార్కెట్‌లో అమ్మి ఇళ్ళకు చేరుకుంటారు. కొందరు మహారాష్ర్ట వెళ్ళి కూరగాయలుఇచ్చి మార్పిడి పద్ధతి ద్వారా జొన్న, గోధుమలు తీసుకుంటారు. వాటిని ఇక్కడ విక్రయిస్తుంటారు. చిన్న చిన్న ఇంకుడు గుంటలు తవ్వించే పనిని గత ప్రభుత్వం చేపట్టిన కారణంగా వీరికి కొంత పని దొరికింది, ఇక ఇప్పటి ప్రభుత్వం పనికి ఆహార పథకం ప్రవేశెపెట్టడం కూడా వీరికి బాగా లాభించింది. కూలి రేటు కూడా పెరగడంతో రోజుకి రూ.100 నుంచి రూ.150 వరకూ సంపాదించు కుంటున్నారు. ఇంటిల్లపాదీ పోడు వ్యవసాయంలో నిమగ్న మవడంతో విద్యపట్ల వీరికి శ్రద్ధ తగ్గింది. పైగా చదువుకున్న వారు అటు ఉద్యోగం రాక ఇటు పశువుల కొట్టాల్లో పేడ తీయలేక రెంటికీ చెడ్డ రెవడులవుతున్నారు. దీంతో చాలామంది తల్లిం డ్రులు తమ పిల్లలను చదువులకు పంపించడం లేదు. దానికి బదులు ఇంటిపనులు, పొలం పనులు అప్పగిస్తున్నారు. ఆడపిల్లలను సైతం పశువుల కాపరులుగా పంపిస్తుంటారు. దీంతో సంతకాలకు వీరు పూర్తిగా దూరం. ఇక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేసేవారి సంఖ్య చాలా తక్కువ. మరోవైపు ఈ కులస్తులలో బాల్యవివాహాలు సర్వసాధారణం. అయితే ఈ కులానికి చెందిన వారిలో కొందరు టీచర్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరి స్ఫూర్తితో ఇప్పుడిప్పుడే కొందరు చదువు పట్ల మొగ్గు చూపుతున్నారు.

సమస్యలు

మార్చు

2001లో ఆదిలాబాద్‌ జిల్లా వెంపల్లి గ్రామపంచాయతీలో కుల ధృవీకరణ పత్రం మం జూరు దగ్గర వచ్చిన వివాదం కారణంగా వీరిని బీసీ జాబితా నుంచి తొలగించారు. వీరు పోరాటం చేసి కోర్టును ఆశ్రయించిన ఫలితంగా 2004లో తిరిగి వీరిని బీసీ జాబితాలో చేచ్చారు. ఆ మూడేళ్లలో రిజర్వేషన్‌ సౌకర్యం కోల్పోవడంతో దాని ప్రాధాన్యం వీరికి తెలిసొచ్చింది. ప్రాథమిక పాఠ శాల విద్యార్థులకు ఉచితం పుస్తకాలు అందకపోవడంతో డబ్బు చెల్లించి కొనుక్కోవలసి వచ్చేది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు దూరమయ్యాయి. ఈ సంఘ టన గుణపాఠంగా తీసుకొని తమ ఇంటిపేర్లు, గోత్రం ఉన్న వారు కొన్ని జిల్లాలలో ఎస్టీలుగా ఉన్నకారణంగా తమనీ ఎస్టీలలో చేర్చాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. మాలీ కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తూ....భూములు సాగు చేసుకుంటున్న మాలీ కులస్తుల భూములకు పట్టాలు ఇవ్వాలని, పూర్తి సబ్సిడీ ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.మాలీలలో అనేకమంది ఇప్పటికీ చెరువులలో చేపలు పట్టి జీవిస్తున్నారు.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మాలి&oldid=3879812" నుండి వెలికితీశారు