మా నాన్న చిరంజీవి

మా నాన్న చిరంజీవి 2010 లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. లాఫింగ్ లార్డ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పిఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో మురళి కృష్ణ నిర్మించడు. హేమచంద్ర స్వరపరిచిన ఈ సినిమాలో జగపతి బాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2006 అమెరికన్ చిత్రం ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్కు రీమేక్.[1][2]

మా నాన్న చిరంజీవి
(2010 తెలుగు సినిమా)
TeluguFilm Maa Naanna Chiranjeevi.jpg
దర్శకత్వం అరుణ్ ప్రసాద్
నిర్మాణం మురళీ కృష్ణ
తారాగణం జగపతి బాబు, ఆలీ, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ
సంగీతం హేమచంద్ర
సంభాషణలు కెళ్ళ శ్రీకర్
ఛాయాగ్రహణం భరణీ ధరన్
కూర్పు బసవ పెద్ది రెడ్డి
నిర్మాణ సంస్థ లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేదీ 1 జనవరి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

కొమ్మాలపాటి చిరంజీవులు ( జగపతి బాబు ) పదవ తరగతి పాసైన భూస్వామి, అతను ధనవంతు డైనప్పటికీ తన రైతు జీవనశైలితో సంతోషంగా ఉంటాడు. అతను నగరానికి చెందిన నీలిమను పెళ్ళి చేసుకుంటాడు. ఆమె తన ధనవంతులైన స్నేహితులు ప్రారంభించిన ఫ్లాప్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి తన సంపద మొత్తాన్ని నాశనం చేస్తుంది. వారికి ఒక కుమారుడు విశ్వనాథ్ (మాస్టర్ అతులిత్) ఉన్నాడు. అతను తండ్రిని ఆరాధిస్తాడు. నగరంలో మంచి భవిష్యత్తు ఉంటుందని నీలిమ చిరంజీవులును వదలి నగరానికి ఎవ్ళ్ళిపోయినపుడు. విశ్వనాథ్ తండ్రితో కలిసి ఉండటానికే ఇష్టపడతాడు. చిరంజీవులు తన కొడుకును ఉన్నత ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో విద్యాభ్యాసం చేయాలని నిర్ణయించుకోవడంతో, తండ్రి, కొడుకు కూడా హైదరాబాద్‌లో అడుగుపెడతారు. చిరంజీవులు తన కొడుకు స్కూలు ఫీజుల కోసం పడే తంటాలు, అవి తన కొడుక్కు తెలీకుండా ఉండడం కోసం పడే తంటాలే మిగతా సినిమా అంతా.

తారాగణంసవరించు

పాటలుసవరించు

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."మేమే నిలబడ్డాం"భాస్కరభట్లహేమచంద్ర4:42
2."ఏమో ఎప్పుడెలా"రామజోగయ్య శాస్త్రిశంకర్ మహదేవన్4:48
3."మై హీరో"భాస్కరభట్లనిఖిల్ డి సౌజా, శరత్ చంద్ర, రమ్య4:22
4."Theme Music"వాయిద్యాలుMusic Bit0:37
5."Theme Music-II"వాయిద్యాలుMusic Bit0:35
Total length:15:04

మూలాలుసవరించు

  1. "Heading". 123telugu.com.
  2. "Heading-2". greatandhra.com.