మిండానౌ లోరికీట్

మిండానౌ లోరికీట్ లేదా మౌంట్ అపో లోరికీట్(ట్రైకోగ్లోస్సస్ జాన్ స్టోనియా), లేదా ఫ్రెంచ్ లో లోరికీట్ డె జాన్ స్టోన్ అనీ స్పానిష్ లో లోరి డె మిండానౌ అని పిలిచే ఈ చిలుక సిట్టాసిడే కుటుంబములోని ఒక జాతి. వీటిలో ఇంచుమించు ఒకే రకంగా ఉండే రెండు ఉపజాతులు ఉన్నాయి. రెండూ ఫిలిప్పీన్సు లోని మిండానౌ ప్రాంతానికి ప్రత్యేకమైనవి.

Mindanao lorikeet
At London Zoo, England
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
T. johnstoniae
Binomial name
Trichoglossus johnstoniae
Hartert, 1903

వీటి సహజసిద్ధ ఆవాసాలు సమశీతోష్ణ, ఉష్ణ మండల చిత్తడి పొగమంచు అడవులు. వీటి ప్రజాతి ఆవాసాలు కోల్పోవడము వలన ప్రమాదంలో పడింది.

వివరణ

మార్చు

మిండానౌ లోరికీట్ అనేది షుమారు 20 సెం.మీ. పొడవు ఉంటుంది. ముందు పక్క ఆకుపచ్చ రంగు పై పసుపు అడ్డ గీతలు ఉంటాయి. ముఖం ఎర్రగా ఉండి, ముదురు ఊదా రంగు పట్టీ తల చుట్టూ ఉంటుంది. రెక్కల కింది భాగంలో పసుపు రంగు మచ్చలు ఉంటాయి. కాళ్ళు ఆకుపచ్చ, బూడిద రంగు కలిసిన రంగులో ఉంటాయి. ముక్కు నారింజ రంగులో ఉంటుంది. కంటి చుట్టూ ముదురు బూడిద రంగు ఉండి, కనుపాప ఎరుపు రంగులో ఉంటుంది. బాహ్యంగా ఆడవి, మగవి ఒకే రకంగా ఉంటాయి. పిల్లలు లేత ఎరుపు రంగు ముఖం కలిగి, తల చుట్టూ ఊదా పట్టీకి బదులు, కళ్ళ వెనుక ఊదా రంగు ఉంటుంది. కమ్టి చుట్టూ వలయం లేత బూడిద రంగులో ఉంటుంది. కనుపాపలు ఊదా రంగులో ఉంటాయి. ముక్కు ముదురు ఊదా రంగులో ఉంటుంది.[2]

వర్గీకరణ

మార్చు

There are two poorly differentiated subspecies:[2]

  • Trichoglossus j. johnstoniae - central and southeast Mindanao
  • Trichoglossus j. pistra - western Mindanao

మూలాలు

మార్చు
  1. BirdLife International (2012). "Trichoglossus johnstoniae". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
  2. 2.0 2.1 Forshaw (2006). plate 13.

చూపగలిగిన పాఠాలు

మార్చు