మికా సింగ్
మికా సింగ్ ఒక ప్రముఖ సంగీత కారుడు. ఇతడు పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన గళాన్ని వినిపించాడు. సుప్రసిద్ద పంజాబీ గాయకుడు దలేర్ మెహంది ఇతని పెద్దన్న. వీరిద్దరూ కలిసి కొన్ని గీతాలలో కూడా కనిపించారు.
మికా సింగ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | అమ్రిక్ సింగ్ |
జననం | [1][2] దుర్గాపూర్ | 1977 జూన్ 10
మూలం | దుర్గాపూర్ |
సంగీత శైలి | Pop, Bhangra, Rap |
వృత్తి | గాయకుడు, సంగీతకారుడు |
క్రియాశీల కాలం | 1998-ఇప్పటివరకు |
వెబ్‌సైటు | www.mikasingh.in |
నేపధ్యము
మార్చుఅమ్రిక్ సింగ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు అజ్మీర్ సింగ్ చందన్, బల్బీర్ కౌర్. ఇతను పెరిగినది మాత్రము బీహార్ లోని పాట్నా నగరం. ఇతని పెద్దన్న దలేర్ మెహంది తోబాటు అక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఆరుగురు అన్నదమ్ములలో ఇతను చివరివాడు. తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు.
బయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Mika Singhకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- అధికారిక వెబ్‌సైటు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మికా సింగ్ పేజీ
- మికా సింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన పాట - సావన్ మే లగ్ గయీ ఆగ్ - వీక్షించండి
- మికా సింగ్ పాటలు వినండి
- ఝలక్ దిఖ్ లాజా లో మాధురీ దీక్షిత్‌తో మికా సింగ్
- Mika Singh Discography
- మికా సింగ్ తో ముఖాముఖి
- యోయో హనీసింగ్ తో మికా సింగ్ ముఖాముఖి
- షారుక్ ఖాన్ తో మికా సింగ్
- సింగపూర్ లో 2012 ఐఫా పురస్కారాల వేదికపై మికా సింగ్ ప్రదర్శన
- ముంబాయి లో ప్రదర్శన ఇస్తున్న మికా సింగ్
మూలాలు
మార్చు- ↑ "Mika Singh, happy birthday: The singer turns 36 - Bollywoodlife.com". www.bollywoodlife.com. 10 June 2013.
- ↑ "Mika Singh Archives".