మిక్కీ జగ్తియాని

ముఖేష్ వధుమల్ "మిక్కీ" జగ్తియాని (1952 ఆగష్టు 15 - 2023 మే 26) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన దుబాయ్ ఆధారిత ల్యాండ్‌మార్క్ గ్రూప్ ఛైర్మన్, యజమాని.[1]

మిక్కీ జగ్తియాని
జననం
ముఖేష్ వధుమల్ జగ్తియాని

(1952-08-15)1952 ఆగస్టు 15
కువైట్ సిటీ, కువైట్
మరణం2023 మే 26(2023-05-26) (వయసు 70)
జాతీయతభారతీయుడు
వృత్తిల్యాండ్‌మార్క్ గ్రూప్ ఛైర్మన్, యజమాని
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ల్యాండ్‌మార్క్ రిటైల్ దుకాణాలు
జీవిత భాగస్వామిరేణుకా జగ్తియాని
పిల్లలు3

ప్రారంభ జీవితం

మార్చు

మిక్కీ జగ్తియాని సింధీ కుటుంబానికి చెందినవాడు.[2] ఆయన భారతదేశంలోని చెన్నై, ముంబై నగరాలతో పాటు, లెబనాన్ రాజధాని బీరూట్‌ (Beirut)లోని పాఠశాలలో చదువు కొనసాగింది. ఆ తరువాత, ఆయన లండన్‌కు వెళ్ళి, అక్కడ అకౌంటింగ్ స్కూల్‌లో చేరాడు.[3]

కెరీర్

మార్చు

బహ్రెయిన్‌కు తిరిగి వచ్చిన మిక్కీ జగ్తియాని బేబీషాప్ అనే తన మరణించిన సోదరుడి బేబీ ఉత్పత్తుల దుకాణం స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన తరువాత, ఆయన ఆరు కొత్త దుకాణాలను ప్రారంభించడం ద్వారా తన వ్యాపారం విస్తరించడం ప్రారంభించాడు. గల్ఫ్ యుద్ధం సంభవించినప్పుడు, ఆయన దుబాయ్‌కి వెళ్లి అక్కడ ల్యాండ్‌మార్క్ గ్రూప్‌ను స్థాపించాడు. ఆయన స్థాపించిన ల్యాండ్‌మార్క్ గ్రూప్ మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియాలలో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, బడ్జెట్ హోటళ్లలోకి విస్తరించింది.[4] ఇది దాదాపు 45,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, మధ్యప్రాచ్యం, భారతదేశం అంతటా 1000 కంటే ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది.[5][6]

2008లో, ఆయన డెబెన్‌హామ్స్‌లోని యూకె హై-స్ట్రీట్ రిటైలర్ ని 6% వాటాను కొనుగోలు చేసాడు. దీంతో, ఆయన ఫోర్బ్స్ (Forbes) బిలియనీర్ల జాబితాలోకి చేరాడు.[3] ఆయన US$ 2 బిలియన్ల నికర విలువతో 16వ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచాడు.[7] 2014లో, ఆయన US$5 బిలియన్ల ఆస్తులతో కుటుంబ కార్యాలయాన్ని ప్రారంభించాడు.[8] మే 2023లో, ఫోర్బ్స్ అతని నికర విలువ US$5.2 బిలియన్లుగా పేర్కొన్నది.[4]

ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌

మార్చు

భారత సంతతికి చెందిన మిక్కి జగ్తియాని ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ను స్థాపించాడు. అయితే, ఆయన 2023లో మరణించడంతో కంపెనీ ఛైర్‌ ఉమెన్‌ అండ్‌ సీఈఓగా భార్య రేణుకా జగ్తియాని బాధ్యతలు చేపట్టింది. ఈ సంస్థలో 50వేలకు పైగా ఉద్యోగస్థులు ఉన్నారు. కాగా, ఆమె ముగ్గురు పిల్లలు ల్యాండ్‌ మార్క్‌ గ్రూప్‌ ఆఫ్‌ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.

రేణుకా జగిత్యాని ఫోర్బ్స్ న్యూ బిలియనీర్స్ 2024లో 4.8 బిలియన్ల నికర విలువతో కొనసాగుతోంది.[9]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన వివాహం రేణుకా జగ్తియానిని చేసుకున్నాడు.[10] యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో స్థిరపడిన వారికి ముగ్గురు పిల్లలు ఆర్తి, నిషా, రాహుల్‌ ఉన్నారు.

ఆయన 2023 మే 26న 70 సంవత్సరాల వయసులో మరణించాడు.[11]

మూలాలు

మార్చు
  1. "جانیے دبئی کے 10 امیر ترین شخص کون ہیں اور وہ کتنی دولت کے مالک ہیں | KHALEEJ URDU | UAE NEWS URDU | DUBAI NEWS URDU | GULF NEWS URDU" (in ఉర్దూ). 22 November 2020. Retrieved 27 May 2023.
  2. Palijo, Waseem (8 January 2019). "Most billionaires in India today once resided in Pakistan's Sindh". Daily Times. Archived from the original on 7 May 2020. Retrieved 7 May 2020.
  3. 3.0 3.1 "CEOs Without College Degrees". Business Week. 5 April 2009. Archived from the original on 31 May 2009.
  4. 4.0 4.1 "Forbes profile: Micky Jagtiani". Forbes. Retrieved 26 May 2023.
  5. "The Expat 50; The region's most influential expatriates; 19# Mukesh Jagtiani". arabianbusiness.com. Archived from the original on 20 May 2010. Retrieved 26 May 2023.
  6. "دنیا کے امیر ترین اور کامیاب مگر کالج بدر افراد - حصہ دوئم". Hamariweb.com Articles (in అమెరికన్ ఇంగ్లీష్). 10 November 2013. Retrieved 27 May 2023.
  7. "Mukesh Ambani richest Indian in Forbes list". Indian Express. 13 November 2008.
  8. Reeba Zachariah, Boby Kurian, JM Financial top gun quits to launch family office of Micky Jagtiani, Indiatimes.com, 5 April 2014
  9. "ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ మహిళ.. ఎవరీ రేణుకా జగ్తియాని? | Who is Renuka Jagtiani - Sakshi". web.archive.org. 2024-04-05. Archived from the original on 2024-04-05. Retrieved 2024-04-05. {{cite web}}: no-break space character in |title= at position 50 (help)CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Forbes profile: Micky Jagtiani". Forbes. Retrieved 26 May 2023.
  11. "Dubai's Landmark Group owner Micky Jagtiani passes away at age 70". Arabian Business. 26 May 2023. Retrieved 26 May 2023.