యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా ఖండమునకు చెందినా దేశం, ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా, దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు. 1971 లో ఈ దేశము ఏడు ఏమిరట్ల (1. అభూ దాభి, 2. అజ్మన్, 3. దుబాయ్, 4. ఫుజిరా, 5. రసల్ ఖైమా, 6. షార్జా, 7.ఉమ్మాల్ ఖ్వాయిస్న్ ) సమైక్యగ ఏర్పడినది వీటిలో అభూ దాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. సంయుక్త ఏమిరట్ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి అధ్యక్షుడిగా పర్యవెక్షింపబడును. ఇస్లాం మతం యు.ఎ.ఇ. యొక్క అధికారిక మతంగా ఉంది, ఆంగ్లం కూడా విస్తారంగా వాడబడుతుంది. అరబిక్ అధికారిక భాష.

الإمارات العربية المتحدة
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
United Arab Emirates
Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క చిహ్నం
నినాదం
"---"
జాతీయగీతం
ఇషి బిలాడీ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క స్థానం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క స్థానం
రాజధానిఅబు దాబి
22°47′N 54°37′E / 22.783°N 54.617°E / 22.783; 54.617
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు అరబిక్
ప్రజానామము ఎమిరేట్స్
ప్రభుత్వం సమాఖ్య రాజ్యాంగ రాచరికం
 -  అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహయాన్
 -  ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డిసెంబర్ 2 1971 
విస్తీర్ణం
 -  మొత్తం 83,600 కి.మీ² (116 వ)
32,278 చ.మై 
 -  జలాలు (%) అతితక్కువ
జనాభా
 -  2005 అంచనా 4,496,000 (116 వ)
 -  2005 జన గణన 4,104,695 
 -  జన సాంద్రత 64 /కి.మీ² (143 వ)
139 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $ 9 129.3 బిలియన్ (55 వ)
 -  తలసరి $29,142 బిలియన్ (24 వ)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $164 బిలియన్ (40 వ)
 -  తలసరి $33,397 బిలియన్ (21 వ)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) తగ్గుదల 0.839 (high) (49 వ)
కరెన్సీ యుఎఇ దిర్హామ్ (యునైటెడ్ అరబ్ దిర్హామ్)
కాలాంశం GMT+4 (UTC+4)
 -  వేసవి (DST)  (UTC+4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ యు.ఎ.ఇ
కాలింగ్ కోడ్ +971

1970 కాలంలో దుబాయి, ఆబుధాబి, షార్జా, ఆజ్మాన్, ఉమ్మాల్ ఖ్వాయిస్, ఫుజిరా, రాస్ అల్ ఖైమాలు వేర్వేరు జెండాలు, వేర్వేరు విధానాలతో విభిన్న తెగలకు చెందిన రాజులు పరిపాలిస్తున్న వేర్వేరు దేశాలు.ఈ రాజ్యాలన్నీ కూడా కీలకమైన అరేబియా సముద్ర తీరంలో ఉన్నాయి. అన్ని దేశాలకూ రేవు కేంద్రాలు ఉన్నాయి. కొందరి వద్ద చమురు సంపాదన ఉండగా మరికొందరి వద్ద లేదు. 1971లో రాస్ అల్ ఖైమా మినహా మిగిలిన దేశాలన్నీ కలిసి సమైక్యంగా సమాఖ్య రూపంలో ఉండడానికి తీర్మానం చేసుకొన్నాయి (మరుసటి సంవత్సరం రాస్ అల్ ఖైమా కూడా చేరింది). ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాల వరకు ఒక ఎమిరేట్ నుంచి మరో ఎమిరేట్‌కు వెళ్ళడానికి పాస్‌పోర్టు అవసరమయ్యేది.

యు.ఎ.ఇ. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్నది, ప్రపంచంలోనే పదిహేడవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు కలిగి ఉంది. షేక్ జాయెద్ యు.ఎ.ఇ. యొక్క మొదటి అధ్యక్షుడు పాలకుడు ఎమిరేట్స్ అభివృద్ధి పర్యవేక్షించారు, చమురు ఆదాయాలతో ఆరోగ్య, విద్య అభివ్రుద్ది పరిచారు.

ఆర్ధికరంగం మార్చు

 
బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణం.

యు.ఎ.ఇ. జి.సి.సి.లో రెండవ బృహత్తర ఆర్థికశక్తిగా గుర్తించబడుతుంది.[1]2012లో యు.ఎ.ఇ. జి.డి.పి 377 బిలియన్ల అమెరికన్ డాలర్లు (1.38 ట్రిలియన్ ఎ.ఇ.డి).[2] 1971 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యు.ఎ.ఇ. ఎకనమీ 231 రెంట్లు అభివృద్ధి (2013 నాటికి 1.45 ట్రిలియన్ ఎ.ఇ.డి) చెందింది. అయిల్ రహిత వాణిజ్యం 1.2 ట్రిలియన్ ఎ.ఇ.డి. 1981-2012 మద్య కాలంలో ఇది 28 రెంట్లు అభివృద్ధి చెందింది. [1] వరల్డ్ బ్యాంక్ ప్రచురించిన " డీయింగ్ బిజినెస్ 2016 రిపోర్ట్) యు.ఎ.ఇ.ని వాణిజ్య ఆధారిత ఆర్ధికరంగం , రెగ్యులేటరీ ఎంవిరాన్మెంట్‌లలో 31వ స్థానంలో ఉందని వర్గీకరించింది.[3]

ఆయిల్ మార్చు

జి.సి.సి.లో యు.ఎ.ఇ. వైవిధ్యమైన ఆర్ధికవిధానం కలిగి ఉంది. యు.ఎ.ఇ. ఆర్ధికం అధికంగా ఆయిల్ ఆధారితమై ఉంటుంది. దుబాయి మినహా మిగిలిన యు.ఎ.ఇ. ఆయిల్ రెవెన్యూ మీద ఆధారపడి ఉంది. పెట్రోలియం , సహజవాయువు ఆర్ధికరంగంలో కేంద్రస్థానం (ప్రత్యేకంగా అబుదాబి ) వహిస్తున్నాయి. 2009 లో యు.ఎ.ఇ. ఆర్ధికరంగం 85% ఆయిల్ మీద ఆధారపడింది.[4] అబుదాబి , ఇతర యు.ఎ.ఇ. ఎమిరేట్స్ సంప్రదాయ ఆర్ధిక విధానాలను అనుసరిస్తున్నా ఆయిల్ రిజర్వ్ తక్కువగా ఉన్న దుబాయి మాత్రం వైవిధ్యమైన ఆర్ధిక విధానం అనుసరిస్తుంది.[5] 2011లో యు.ఎ.ఇ. ఎగుమతులలో 77%నికి ఆయిల్ భాగస్వామ్యం వహించింది.[6] విజయవంతంగా అమలుచేసిన అర్ధికవైవిధ్య విధానాల కారణంగా ఆయిల్ ఎగుమతులు 25% నికి చేరుకున్నాయి. [7] 2007-2010 మద్య కాలంలో దుబాయి గణనీయంగా ఆర్ధికసంక్షోభంతో ఎదుర్కొని అబుదాబి ఆయిల్ సంపదతో సంక్షోభం నుండి విడుదల చేయబడింది.[8] దుబాయి నిర్వహిస్తున్న బ్యాలెంస్డ్ బడ్జెట్ ఆర్ధికాభివృద్ధికి సహకరిస్తుంది.[9]

పర్యాటకం మార్చు

పర్యాటకం యు.ఎ.ఇ. మొత్తంలో అభివృద్ధి చెందుతూ ఉంది. మిడిల్ ఈస్ట్ దేశాలలో దుబాయి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది.[10] " మాస్టర్ కార్డ్ గ్లోబల్ డిస్టినేషన్ సిటీస్ ఇండెక్స్ " ఆధారంగా దుబాయి ప్రంపంచంలోని ప్రబల పర్యాటక గమ్యాలలో 6వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. [11] యు.ఎ.ఇ. పర్యాటక ఆదాయంలో దుబాయి 66%, అబుదాబి 16%భాగస్వామ్యం వహిస్తున్నాయి.2013 లో దుబాయి 10 మిలియన్ల పర్యాటకులకు స్వాగతం చెప్పింది. ఈ ప్రాంతంలో అత్యంత ఆధునిక ఇంఫ్రాస్ట్రక్చర్ కలిగిన దేశంగా యు.ఎ.ఇ. గుర్తించబడుతుంది. [12] 1980 నుండి యు.ఎ.ఇ. ఇంఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి పలు బిలియన్ల డాలర్లను వ్యయం చేస్తుంది. ఈ అభివృద్ధి దుబాయి , అబుదాబిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఉత్తర ఎమిరేట్స్ ప్రాంతంలో రెసిడెంషియల్ , కమర్షియల్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.[13]

సమస్యలు మార్చు

ప్రభుత్వ నిర్మాణసంస్థ " దుబాయి వరల్డ్ " లో చెల్లిపులు జాప్యం జరిగిన సమయంలో ఆస్తుల వులువలు నాటకీయంగా పతనం అయ్యాయి. ఆర్ధికరగం అధికంగా విదేశీశ్రామిక శక్తిమీద ఆధారపడి ఉంది. ఎమిరైటైజేషన్ ప్రభావం పౌల్ డైయ్యర్ , నటాషా రిడ్జ్(దుబాయి స్కూల్ ఆఫ్ గవర్నమెంటు),ఇంగో ఫర్స్‌టెన్‌లెంచర్, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), కాసిం రాండరీ (బ్రిటిష్ యూనివర్శిటీ ఆఫ్ దుబాయి) , పౌల్ నాగ్లింగర్(ఎఫ్.హెచ్.వెన్) లలో మాత్రమే కనిపిస్తుంది.[14] యు.ఎ.ఇ. చట్టం యూనియన్ల ఉనికిని అనుమతించదు. [15] ప్రభుత్వం " కలెక్టివ్ బార్గెయినింగ్ " , రైట్ టు స్ట్రైక్ " లను గుర్తించదు. " మినిస్టరీ ఆఫ్ లేబర్ "కు శ్రామికులను తిరిగి పనిచేమని ఆదేశించడానికి అధికారం ఉంది.స్ట్రైక్ చేసే వలస శ్రామికుల వర్క్ పర్మిట్ రద్దుచేసి దేశం వెలుపలకు పంపివేయబడుతుంటారు.[15] paర్యవసానంగా శ్రామికుల చట్టాలలో చాలాస్వల్పంగా వివక్ష ఉంది. ప్రభుత్వరంగ ఉపాధినియామకంలో " గల్ఫ్ దేశాల అరేబియన్లకు " ముఖ్యత్వం ఇవ్వబడుతుంది. మిగిలిన వారికి ఎమిరేట్ ఎయిర్ లైంస్, దుబాయి ప్రాపర్టీస్ మొదలైన సంస్థలలో ఉపాధి కల్పించబడుతుంది.[16]

గణాంకాలు మార్చు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
1963 95,000—    
1968 1,80,226+13.66%
1975 5,57,887+17.52%
1980 10,42,099+13.31%
1985 13,79,303+5.77%
1995 24,11,041+5.74%
1999 29,38,000+5.07%
2005 41,06,427+5.74%
2010 82,64,070+15.01%
2011 89,25,096+8.00%
2012 92,05,651+3.14%
2013 93,46,129[19]+1.53%
Sources:[17][18]

యు.ఎ.ఇ. గణాంకాలు అత్యంత వైవిధ్యంగా ఉంటాయి. 2010లో యు.ఎ.ఇ. జనసంఖ్య 82,64,070.[17] వీరిలో యు.ఎ.ఇ ప్రజలు 13% మాత్రమే ఉన్నారు.[20] ప్రజలలో అత్యధిక సంఖ్యలో బహిష్కృత ప్రజలు ఉన్నారు. [21] దేశం వలస రేట్ 21.71. ఇది అంతర్జాతీయంగా ప్రపంచ గరిష్ఠంగా ఉంది.[22] యు.ఎ.ఇ.ఫెడరల్ చట్టం అనుసరించి యు.ఎ.ఇ.లో 20 సంవత్సరాలకంటే అధికంగా నివసించిన వారు యు.ఎ.ఇ. పౌరసత్వం కొరకు అభ్యర్థించవచ్చు. అయితే అభ్యర్థి నేరస్థునిగా ఉండకూడదు, ధారాళంగా అరబిక్ భాష మాట్లాడకలిగి ఉండాలి.[23] అయినప్పటికీ ప్రస్తుతం పౌరసత్వం లభించడం సులువైన విషయం కాదు. దేశంలో నివసిస్తున్న ప్రజలలో అత్యధికులు స్థాయిరహిత వ్యక్తులుగా గుర్తించబడుతున్నారు. దేశంలో 1.4 మిలియన్ల ఎమిరేటీ ప్రజలు ఉన్నారు.[24]

సంప్రదాయం మార్చు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలు సంప్రదాయంగా వైవిధ్యం కలిగి ఉన్నారు. సి.ఐ.ఎ. గణాంకాల ఆధారంగా 19% నివాసులు ఎమిరేటీ ప్రజలు, 23% ఇతర అరేబియన్లు (ఈజిప్షియన్లు, జోర్డానియన్లు, ఇరానియన్లు), 50% దక్షిణాసియన్లు, 8% ఇతర బహిష్కృత ప్రజలు, పశ్చిమదేశ ప్రజలు, తూర్పు ఆసియన్లు ఉన్నారు. [7] మొత్తం జనసంఖ్యలో ఎమెరేటీ ప్రజలు 16.5% ఉన్నారు. వీరిలో దక్షిణాసియన్లు (బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు, శ్రీలంకన్ ప్రజలు, భారతీయులు) అధికంగా ఉన్నారు. వీరు మొత్తం ఆసియన్లలో 58.4% ఉన్నారు. ఇతర ఆసియన్లలో ఫిలిప్పైనీయులు, ఇరానీయులు ఉన్నారు.[25] పశ్చిమ దేశాలకు చెందిన బహిష్కృతులు 8.4% ఉన్నారు.[26]దుబాయి, షార్జా, అజ్మన్ లలో 37% భరతీయ, పాకిస్థాన్ బహిష్కృతులు ఉన్నారని 2014 యూరోమానిటర్ ఇంటర్నేషనల్ తెలియజేస్తుంది. మూడు ఎమిరేట్‌లలో ఉన్న విదేశీప్రజలలో భారతీయులు (25%), పాకిస్థానీయులు 12%, ఎమిరెటీ (9%), బంగ్లాదేశీయులు (7%), ఫిలిప్పైనీయులు (5%) ఉన్నారు.[27] దుబాయి వంటి బహుళసంస్కృతికి చెందిన నగరాలలో యురేపియన్ల సంఖ్య అధికరిస్తుంది.[28] పశ్చిమ దేశస్థులలో ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా ప్రజలు 5,00,000 మంది ఉన్నారు.[26][29] బ్రిటిష్ దేశస్థులు 1,00,000 కంటే అధికంగా నివసిస్తున్నారు. [30] మిగిలిన ప్రజలు అరబ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.[7][31] యునైటెడ్ ఎమిరేట్‌లో ప్రజలు 88% నగరాలలో నివసిస్తున్నారు.[32] 2012 గణాంకాలను అనుసరించి ఆయుఃప్రమాణం 76.7 సంవత్సరాలు. ఇతర అరబ్ దేశాలు అన్నింటికంటే ఇది అధికం.[33][34] స్త్రీ పురుష నిష్పత్తి 2:2 ఉంది. లింగ వివక్ష అత్యధికంగా ఉంది. ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది.మొదటి స్థానంలో కతర్ ఉంది.[35]

మతం మార్చు

Religions in UAE (Pew Research)[36][37]
Religion Percent
Muslim
  
77%
Catholic
  
10%
Hindu
  
4%
Buddhist
  
2%
Protestant
  
1%
Orthodox
  
1%
Other
  
1%
None
  
1%

యు.ఎ.ఇ.లో అధికార భాషగా ఇస్లాం భాష ఉంది. ప్రభుత్వం ఇతర మతాలపట్ల సహనం వహిస్తూ ఇతర మతసంబంధిత కార్యక్రమాలలో అరుదుగా మాత్రమే జోక్యం చేసుకుంటుంది.[38] అలాగే ముస్లిమేతరులు ముస్లిం సంబంధిత కార్యలలో జోక్యం చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఇతర మతాలు ఏరూపంలోనైనా విస్తరించడం నిషేధించబడుతుంది. దేశం మొత్తంలో 31 చర్చీలు, ఒక హిందూ ఆలయం (బుర్ దుబాయి) [39] ఒక సిక్కు గురుద్వార్ (జెబెల్ అలీ), బౌద్ధ ఆలయం (అల్ గర్హౌడ్) ఉన్నాయి. 2005 గణాంకాలను అనుసరించి మొత్తం జనసంఖ్యలో ముస్లిములు 76%, 9% క్రైస్తవులు, 15% ఇతరమతస్థులు (ప్రధానంగా హిందువులు) ఉన్నారు.[40] తాత్కాలిక పర్యాటకులు, ఉద్యోగులు గణాంకాలలో చేర్చబడరు. బహైలు, డ్రుజే ప్రజలు ముస్లిములుగా భావించబడుతుంటారు.[40] ఎమిరేటీ ప్రజలలో 85% సున్నీ ముస్లిములు, షియా ముస్లిములు 15% ఉన్నారు. వీరు అధికంగా షార్జా, దుబాయిలో కేంద్రీకృతమై ఉన్నారు. [40] ఒమనీ వలస ప్రజలు ఇబాదీకి చెందిన వారై ఉన్నారు. సుఫీ ఇజం కూడా ఉనికిలో ఉంది.[41]

పెద్ద నగరాలు మార్చు

భాషలు మార్చు

అరబిక్ భాష యునైటెడ్ ఎమిరేట్స్‌లో అధికార భాషగా ఉంది.స్థానిక ఎమిరేట్ ప్రజలలో గల్ఫ్ అరబిక్ మాండలికం వాడుకలో ఉంది. [42]1971 వరకు ఈప్రాంతం బ్రిటిష్ ఆక్రమణలో ఉంది. అందువలన ఇంగ్లీష్ ప్రధాన భాషగా వాడుకలో ఉంది. అత్యధికంగా ప్రాంతీయ ఉద్యోగాల నియామకానికి ఇంగ్లీష్ తెలిసి ఉండడం ప్రధాన అర్హతగా ఉంది.విదేశీ ప్రజలలో పలు విదేశీ భాషలు వాడుకలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "UAE's economy growth momentum set to pick up". Khaleej Times. 27 December 2013. Archived from the original on 4 జనవరి 2014. Retrieved 2 ఏప్రిల్ 2022.
  2. "GDP to hit $474.2b in 2018". Khaleej Times. 4 July 2013. Archived from the original on 6 జనవరి 2014. Retrieved 5 January 2014.
  3. "Ranking of Economies". World Bank Group. Archived from the original on 4 జూన్ 2011. Retrieved 26 నవంబరు 2016.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WTO Trade Statistic 2009 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; bbc.co.uk అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; lse.ac.uk అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. 7.0 7.1 7.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; WorldFactbook అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. "Speaking of Water". Archived from the original on 2011-05-14. Retrieved 2016-11-26.
  9. Fitch, Asa (4 January 2015). "Dubai Unveils Balanced Budget for 2015". The Wall Street Journal. Retrieved 12 February 2015.
  10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; tdb అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. "Dubai Ranks Fifth Among Top Global Destinations For Travellers". Gulf Business. Archived from the original on 2015-10-17. Retrieved 2016-11-26.
  12. "Infrastructure in the United Arab Emirates (UAE)". The Prospect Group.
  13. "UAE yearbook 2009". Slideshare.net.
  14. "The Seismic Activities of Dubai Property Bubble and Inevitable Consequences". Asian Tribune. 9 November 2009.
  15. 15.0 15.1 "United Arab Emirates". ITUC.
  16. Krane, Jim (2009). City of Gold: Dubai and the Dream of Capitalism. New York, NY: St. Martin's Press. pp. 267–270. ISBN 978-0-312-53574-2.
  17. 17.0 17.1 "UAE National Bureau of Statistics" (PDF). Archived from the original (PDF) on 2013-10-08. Retrieved 2016-11-24.
  18. "United Arab Emirates". World Gazetteer. Archived from the original on 27 నవంబరు 2013. Retrieved 24 నవంబరు 2016.
  19. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; PopulationWorldBank అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  20. "Population leaps to 8.19 million". The National. Abu Dhabi. 30 May 2010.
  21. Andrzej Kapiszewski (22 May 2006). "Arab versus Asian migrant workers in the GCC countries" (PDF). UN Department of Economic and Social Affairs.
  22. "Net migration rate". Cia.gov. Archived from the original on 2016-03-08. Retrieved 2016-11-24.
  23. Camille Paldi (13 July 2010) UAE Islamic Finance Archived 2013-02-26 at the Wayback Machine. I Love The UAE. Retrieved 27 September 2013.
  24. Habboush, Mahmoud. (10 October 2013) Call to naturalise some expats stirs anxiety in the UAE Archived 2014-07-14 at the Wayback Machine. Uk.reuters.com. Retrieved on 10 October 2015.
  25. "Labor Migration in the United Arab Emirates: Challenges and Responses". Migration Policy Institute. 18 September 2013.
  26. 26.0 26.1 Andy Sambidge (7 October 2009). "UAE population hits 6m, Emiratis make up 16.5%". ArabianBusiness.com.
  27. "Indians, Pakistanis make up 37% of Dubai, Sharjah, Ajman population". gulfnews.com. Retrieved 7 August 2015.
  28. "Expat numbers rise rapidly as UAE population touches 6m". Uaeinteract.com. Archived from the original on 2009-10-09. Retrieved 2016-11-24.
  29. Mcintosh, Lindsay (16 June 2008). "Terror red alert for 100,000 British expats in Dubai". The Scotsman. Archived from the original on 21 ఆగస్టు 2018. Retrieved 24 నవంబరు 2016.
  30. Giles Whittell (15 March 2010). "British pair face jail for kissing in Dubai restaurant". The Times. Archived from the original on 25 May 2010.
  31. "Editorial: The Ideal Prince". Arabnews.com. 3 November 2004. Archived from the original on 9 July 2012.
  32. "Table 3.10 Urbanization" (PDF). World Development Indicators. Archived from the original (PDF) on 25 మార్చి 2009. Retrieved 24 నవంబరు 2016.
  33. "Life expectancy at birth". The World Factbook. Archived from the original on 2016-03-06. Retrieved 2016-11-24.
  34. "Average life expectancy in UAE rises to 75 years". Uaeinteract.com. Archived from the original on 2013-06-22. Retrieved 2016-11-24.
  35. "Sex ratio". The World Factbook. Archived from the original on 2013-11-30. Retrieved 24 నవంబరు 2016.
  36. Pew Research Center's Religion & Public Life Project: United Arab Emirates Archived 2018-08-14 at the Wayback Machine. Pew Research Center. 2010.
  37. United Arab Emirates. International Religious Freedom Report 2007. State.gov. Retrieved 27 September 2013.
  38. "International Religious Freedom Report for 2012 – United Arab Emirates". Bureau of Democracy, Human Rights, and Labor.
  39. Bassma Al Jandaly (5 April 2008). "Churches and temples in the UAE". Gulf News.
  40. 40.0 40.1 40.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; religiousfreedom అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  41. "Islam: Sunnis and Shiites" (PDF). investigativeproject.org. 23 February 2004.
  42. Christensen, Shane (2010). Frommer's Dubai. p. 174. ISBN 978-0-470-71178-1. {{cite book}}: |work= ignored (help)