మిజోరం ప్రభుత్వం

భారత యూనియన్‌లోని మిజోరం రాష్ట్ర ప్రభుత్వం

మిజో రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని పిలువబడే మిజోరం ప్రభుత్వం (మిజోః మిజోరం సావర్కార్) మిజోరం రాష్ట్ర 11 జిల్లాలకు అత్యున్నత పాలక అధికార సంస్థ. ఇందులో మిజోరం గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసనశాఖ ఉంటాయి.

Government of Mizoram
Seat of GovernmentAizawl
చట్ట వ్యవస్థ
Assembly
Members in Assembly40
కార్యనిర్వహణ వ్యవస్థ
GovernorKambhampati Hari Babu
Chief MinisterLalduhoma
Judiciary
High CourtAizawl Bench, Gauhati High Court
Chief JusticeVijay Bishnoi
మిజోరం సెక్రటేరియట్

భారతదేశం లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, మిజోరాం రాష్ట్ర అధిపతి కేంద్రప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతిచే నియమించబడిన గవర్నరు ఆ పదవిలో కొనసాగుతాడు . ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత. ఐజ్వాల్ మిజోరం రాజధాని. మిజోరాం శాసనసభ, సచివాలయాన్ని ఐజ్వాల్‌లో కలిగి ఉన్నాయి. అస్సాంలోని గౌహతిలో ఉన్న గౌహతి హైకోర్టులో ఐజ్వాల్ బెంచ్ ఉంది.ఇది మిజోరం రాష్ట్రంలో తలెత్తే కేసులకు సంబంధించిన అధికారాలను ఉపయోగిస్తుంది.[1]

మిజోరం ప్రస్తుత శాసనసభ ఏకసభగా ఉంది.ఇందులో 40 మంది శాసనసభ సభ్యులు (ఎం.ఎల్.ఎ.) ఉన్నారు. ఏదేని పరిస్థితులలో గవర్నరు శాసనసభను రద్దు చేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.[2]

మూలాలు

మార్చు
  1. "Jurisdiction and Seats of Indian High Courts". Eastern Book Company. Retrieved 2008-05-12.
  2. "Mizoram Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre, Government of India. Retrieved 2008-05-10.

వెలుపలి లంకెలు

మార్చు