మిఠాయి (2019 సినిమా)

మిఠాయి 2019 లో విడుదలైన సినిమా. ప్రశాంత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో నటించారు .

మిఠాయి
దర్శకత్వంప్రశాంత్ కుమార్
రచనప్రశాంత్ కుమార్
నిర్మాతప్రశాంత్ కుమార్
తారాగణంరాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి
ఛాయాగ్రహణంరవివర్మన్ నీలమేఘం
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంవివేక్ సాగర్
నిర్మాణ
సంస్థ
రెడ్ యాంట్స్ సినిమా
విడుదల తేదీ
22 ఫిబ్రవరి 2019 (2019-02-22)
సినిమా నిడివి
136 minutes
దేశంభారతదేశం
భాషతెలుగు

ఇది హైదరాబాద్‌లో నేపథ్యంలో నడిచే కథ. సాయి ( రాహుల్ రామకృష్ణ ) తన ఇరవైల మధ్యలో ఒక టెక్కీ. కానీ మామూలు కంప్యూటర్ నిపుణుడి లాగా కాకుండా, అతను తన ఉద్యోగానికి వేలాడుతున్నాడు. అతని ఏకైక విజయం, ఉద్యోగం కోల్పోకుండా ఉండడమే.

తన పెళ్ళికి నాలుగు రోజుల ముందు అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తారు. తన బెస్ట్ ఫ్రెండ్ జానీ ( ప్రియదర్శి పుల్లికొండ ) తో కలిసి తాగుతాడు. అతడు ఒక నిరుద్యోగి, తెలివైనవాడు. ఆశయాలంటూ ఏమీ లేనివాడు. తాగాక, సాయి ఇంటికి చేరుకుని, అనుకోకుండా తన తలుపు తెరిచే ఉంచేస్తాడు. ఒక దొంగ ఇతర ఆస్తులతో పాటు ఒక హారాన్ని కూడా దొంగిలిస్తాడు. ఇది అనేక వరిస సంఘటనలకు దారితీస్తుంది. .

తన ఎన్‌ఆర్‌ఐ స్నేహితుడు కృష్ణ ( రవివర్మ ) ఓడిపోయినందుకు సాయిని మందలిస్తాడు. అతడు విసిరిన సవాలును స్వీకరించిన ఇద్దరు మిత్రులూ పెళ్ళికి ముందే దొంగను పట్టుకోవడం ద్వారా కృష్ణ తప్పని నిరూపిస్తారు.ఈ క్రమంలో వాళ్ళిద్దరు వెళ్ళే దారి వాళ్ళు ఎదుర్కొనే సంఘటనలు, వ్యక్తులూ మిగతా కథలో భాగం

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

మిఠాయి రెడ్ యాంట్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా 2018 జనవరి 14 న ప్రారంభించారు. [1]


2018 ఫిబ్రవరి 17 న షూటింగ్ ప్రారంభమైంది. [2] ఈ ట్రైలర్ 2018 అక్టోబరు 15 న విడుదలైంది. [3] 2019 ఫిబ్రవరి 22 న విడుదలైంది

మూలాలు

మార్చు
  1. "Mithai movie launch- idlebrain.com news".
  2. "First schedule of Prashant Kumar's 'Mithai' wrapped up". The Times of India. 13 March 2018. Retrieved 26 March 2019.
  3. Staff, Scroll. "'Mithai' trailer: Rahul Ramakrishna and Priyadarshi on a madcap adventure". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-10-27.