విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (జననం 9 మే 1989), తెలుగు సినిమా నటుడు.[1] నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన.[2] 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2017 మొదట్లో ద్వారక అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా తో పెద్ద స్టార్ గా మారిపోయాడు. 2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావెతో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చూసాడు. ఆ తర్వాత 2018 నవంబర్ 17న టాక్సీవాలాతో మరొక్క చక్కని విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్.యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.[3]
దేవరకొండ విజయ్ సాయి | |
---|---|
జననం | విజయ్ దేవరకొండ సాయి 1989 మే 9 హైదరాబాద్ భారత్ |
వృత్తి | నటుడు |
తల్లిదండ్రులు |
|
తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం
మార్చుఈయన మే 9, 1989న హైదరాబాద్ లో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధనరావు, మాధవిలు తెలంగాణాలోని నాగర్ కర్నూలు జిల్లా, [తుమాన్పెట్]] గ్రామానికి చెందినవారు. తండ్రికి సినిమాలపై ఉన్న మక్కువతో విజయ్ పుట్టక మునుపే హైదరాబాదుకు వచ్చారు. సినిమాల్లో నటుడు అవ్వాలనుకున్నాడు కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ శాఖలో ప్రవేశించాడు. దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ చానళ్ళలో ఆయన దర్శకత్వం వహించిన సీరియళ్ళు ప్రదర్శింప బడ్డాయి. విజయ్, ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.[4] ఈ పాఠశాలలోనే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్నారు.[5]
టీవీలు, ఫోన్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పాఠశాల ఉండేదనీ, అక్కడే తాను కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నానని వివరించారు విజయ్. ఈ రోజు తన ప్రవర్తన, వ్యక్తిత్వం మొత్తం ఆ పాఠశాలలో పెంపొందించుకున్నవే అని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్కూలు చదువు పూర్తయ్యాకా, హైదరాబాద్ లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశలలో ఇంటర్, బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.[6] .[7]
వ్యక్తిగత జీవితం
మార్చువిజయ్ తమ్ముడు ఆనంద్ అమెరికాలోని డెలాయిట్ లో పని చేస్తున్నారు. తల్లి మాధవి వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. ఆమె హైదరాబాదులో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. విజయ్ తండ్రి టివి సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తుంటారు. నిజానికి ఆయనకు తన తండ్రే స్ఫూర్తి. సినిమాల్లో నటించేందుకు మహబూబ్ నగర్ లోని బల్మూర్, నుంచి హైదరాబాద్ వచ్చారు విజయ్ తండ్రి.[8]
కెరీర్
మార్చుసూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్ షాప్ లో పాల్గొన్న విజయ్, హైదరబాద్ థియేటర్ సర్క్యూట్ లో ఎన్నో నాటకాలు చేశారు. ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించారు విజయ్.[7]
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా చిత్రం, శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పాత్రల్లో కనిపించారు విజయ్.[10] ఆ సమయంలోనే సహాయ దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమయ్యారు. 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలసి నటించారు ఆయన.[11] ఈ సినిమాలో విజయ్ నటన చూసిన నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ లు తమ సంస్థలో రెండు చిత్రాలు చేసేందుకు విజయ్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. [12][13][14]
2016లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతు వర్మ సరసన పెళ్ళి చూపులు సినిమాలో నటించారు విజయ్. ఈ సినమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది.[15]
2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ చిత్రం ద్వార విజయ్ భారత దేశ వ్యాప్తం గా పేరు సంపాదించుకున్నారు. ఇక తర్వాత సంవత్సరంలో వచ్చిన గీత గోవిందం చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాదించింది. ఈ చిత్రం తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పొయ్యింది. విజయ్ దేవరకొండ చిత్రాలకి సంబదించిన బాక్స్ ఆఫీస్ స్టేట్స్ ఇక్కడ పొందు పరిచాము.
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2011 | నువ్విలా | విష్ణువు | [16] | |
2012 | లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | అజయ్ | ||
2015 | ఎవడే సుబ్రహ్మణ్యం | రిషి | ||
2016 | పెళ్లి చూపులు | ప్రశాంత్ | ||
2017 | ద్వారక | ఎర్ర శ్రీను/శ్రీ Krishnananda Swamy | [17] | |
అర్జున్ రెడ్డి | డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ | [18] | ||
2018 | యే మంత్రం వేసవే | నిఖిల్ "నిక్కీ" | [19] | |
మహానటి | విజయ్ ఆంటోనీ | [20] | ||
గీత గోవిందం | విజయ్ గోవింద్ | "వాట్ ది లైఫ్" కోసం గాయకుడు కూడా | [21] | |
నోటా | వరుణ్ సుబ్రమణ్యం | తమిళ సినిమా | [22] | |
ఈ నగరానికి ఏమైంది | అతనే | అతిధి పాత్ర | [23] | |
టాక్సీవాలా | శివ రావాలి | |||
2019 | డియర్ కామ్రేడ్ | చైతన్య "బాబీ" కృష్ణ | [24] | |
మీకు మాత్రమే చెప్తా | అతిధి పాత్ర; నిర్మాత కూడా | [25] | ||
2020 | వరల్డ్ ఫేమస్ లవర్ | గౌతమ్/సీనయ్య "శ్రీను" ప్రజాపత్ | [26] | |
2021 | జాతి రత్నాలు | అతిధి పాత్ర | [27] | |
2022 | లైగర్ | శాశ్వత్ అగర్వాల్ (లైగర్) | ఏకకాలంలో హిందీలో తీశారు | [28] |
2023 | ఖుషి | లెనిన్ విప్లవ్ | [29] | |
TBA | ఫ్యామిలీ స్టార్ | చిత్రీకరణ | [30] | |
TBA | చిత్రీకరణ | [31] |
మూలాలు
మార్చు- ↑ యార్లగడ్డ, మధులత. "నాన్న కలని నేను నిజం చేశా!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 21 సెప్టెంబరు 2017. Retrieved 21 సెప్టెంబరు 2017.
- ↑ https://www.youtube.com/watch?v=_pqngUO_pP4
- ↑ Boy, Zupp (2020-08-22). "Vijay Devarakonda ranks third in The Most Desirable Men 2019 after Shahid Kapoor, Ranveer Singh". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-04.
- ↑ "Vijay Devarakonda Biodata, Family & Movies".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-19. Retrieved 2016-11-05.
- ↑ http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/this-film-came-at-the-right-time/article6902995.ece
- ↑ 7.0 7.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-23. Retrieved 2021-01-18.
- ↑ http://www.idlebrain.com/celeb/interview/lib-vijaydevarakonda.html
- ↑ http://www.idlebrain.com/news/today/yevadesubramanyam-vijaydeverakondaasrishi.html
- ↑ "విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో నటించిన 'Life is beautiful ' సినిమా". Telugu Action. 2023-12-26.
- ↑ http://www.thehindu.com/features/metroplus/an-eye-for-story/article6874716.ece
- ↑ https://www.youtube.com/watch?v=oSstKbH8NQg
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-30. Retrieved 2016-11-05.
- ↑ http://www.greatandhra.com/movies/reviews/yevade-subramanyam-review-yes-he-is-worth-the-find-64844.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-27. Retrieved 2016-11-05.
- ↑ "5 Telegu movies starring Vijay Deverakonda you can watch now on Prime Video, Zee5 and more". Vogue India (in Indian English). 25 March 2020. Retrieved 24 November 2020.
- ↑ "Never thought I could dance: Vijay Deverakonda". Deccan Chronicle (in ఇంగ్లీష్). 26 August 2016. Retrieved 24 November 2020.
- ↑ "Complete Winners List of BGM 2018". 17 June 2018. Archived from the original on 26 June 2019. Retrieved 24 June 2018.
- ↑ Dundoo, Sangeetha Devi (9 March 2018). "'Ye Mantram Vesave' review: Backlog best forgotten". The Hindu (in Indian English). Retrieved 24 November 2020.
- ↑ "Nag Ashwin on Mahanati: The film is very honest". The Indian Express (in ఇంగ్లీష్). 8 May 2018. Archived from the original on 19 May 2018. Retrieved 2 September 2020.
- ↑ Dundoo, Sangeetha Devi (15 August 2018). "'Geetha Govindam' review: The good guy takes over". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 26 December 2021.
- ↑ "NOTA trailer: Vijay Devarakonda's Tamil debut sees him as a reluctant politician fighting a corrupt system-Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 6 September 2018. Retrieved 26 December 2021.
- ↑ Pecheti, Prakash (29 June 2018). "Ee Nagaraniki Emaindi: Tharun Bhascker is back with yet another thorough entertainer". Telangana Today. Retrieved 24 November 2020.
- ↑ "Dear Comrade will not see Hindi version". New Indian Express. 13 July 2019. Archived from the original on 14 July 2019. Retrieved 15 July 2019.
- ↑ "Vijay Deverakonda's debut production venture titled 'Meeku Maathrame Cheptha'". The News Minute. 29 August 2019. Archived from the original on 16 October 2019. Retrieved 16 October 2019.
- ↑ "Vijay Devarakonda's World Famous Lover". Telugu 360 Indian. 17 September 2019. Archived from the original on 2 November 2019. Retrieved 17 September 2019.
- ↑ "Keerthy Suresh opens up about her cameo in Naveen Polishetty starrer Jathi Ratnalu". The Times of India. Retrieved 14 March 2021.
- ↑ "Vijay Deverakonda-Ananya Panday's film titled 'Liger', Karan Johar shares 'punching' first look". Daily News & Analysis. 18 January 2021. Retrieved 18 January 2021.
- ↑ "Kushi : విజయ్ అండ్ సమంత బ్యాక్ టు 'ఖుషి' సెట్స్.. శివ నిర్వాణ ట్వీట్! - 10TV Telugu". web.archive.org. 2023-01-30. Archived from the original on 2023-01-30. Retrieved 2023-01-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Mrunal Thakur, Vijay Deverakonda launch their Telugu film VD13; share glimpse from puja: 'Can't wait for shoot to begin'". Hindustan Times. 14 June 2023. Retrieved 16 July 2023.
- ↑ Bureau, The Hindu (3 May 2023). "'VD12': Vijay Deverakonda's next with Gowtam Tinnanuri launched". The Hindu. ISSN 0971-751X. Retrieved 4 May 2023.