మినుములు
మినుములు (ఆంగ్లం Black gram) నవధాన్యాలలో ఒకటి. ఇవి భారతీయుల ఆహారంలో ముఖ్యమైనది.
మినుములు | |
---|---|
![]() | |
మినుములు | |
Scientific classification | |
Kingdom
|
|
Division
|
|
Class
|
|
Order
|
|
Family
|
|
Subfamily
|
|
Tribe
|
|
Genus
|
|
Species
|
వి. ముంగో
|
Binomial name | |
విగ్నా ముంగో (L.) Hepper
|
గింజల జాతికి చెందిన అపరాలలో మినుములు ముఖ్యమైనవి. వీటికి ఉద్దులు అనే పేరు కూడా ఉంది. కందులతో పాడు విరివిగా వాడుకలో వున్న అపరాలలో ఇది ఒకటి. ఇది అతితక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా పండిస్తారు. అన్ని పప్పుదాన్యాలలో కన్నా ఈమినుములు అత్యంత భలవర్థకము. మినుములను యదాతదంగాను వాడుతారు. లేదా పొట్టుతీసి పప్పును ఉపయోగిస్తారు. మినుములను పొట్టుతీసి మినప గుళ్ళుగాను వినియోగిస్తారు.
మినుములతో తయారయ్యే పదార్థాలుసవరించు
మినుములను పొట్టు తీసి గాని పొట్టుతో బాటు కూడా వంటలలో వాడుతారు. 1. మినప వడలు. 2. మినపట్టు, 3. ఇడ్లీలు, దోసెలలో మినపప్పు వాడకం తప్పని సరి. 4. సున్నుండలు మినప్పప్పు తోనే చేస్తారు. 5. మినప్పప్పును నూనెలో వేయించి దానికి కొంచెంకారం కలిపి తింటే చాల రుచిగా వుంటాయి. వీటిని పాకెట్లలో విరివిగా అమ్ముతున్నారు.