మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్

మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ - ఇది ఒక పురాతన అంతర్జాతీయ అందాల పోటీలు నిర్వహించే సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఉంది. మహిళలు తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించడానికి ఇది చక్కని వేదికగా చెప్తారు. ఇది స్త్రీ తన విశ్వాసాన్ని ప్రదర్శించగలగడమే కాక ఇతరుల అభిప్రాయాలను స్వాగతించి మెరుగైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది.[1]

మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్
దస్త్రం:Missasiapacificintl-newlogo.png
స్థాపన1965
రకంఅందాల పోటీ
ప్రధాన
కార్యాలయాలు
మనీలా, ఫిలిప్పీన్స్
అధికారిక భాషఆంగ్లం
అధ్యక్షుడుజాక్వెలిన్ టాన్-సైన్జ్
జాలగూడుOfficial website

అందమే కాదు తమ అభిప్రాయాల్ని వెల్లడించాలనుకునే మహిళలకు ఇది చక్కని మార్గం. సంస్కృతి, జాతి, నమ్మకం.. ఇలా అన్నింటినీ ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యకరమైన ఈ పోటీ నిర్వహకులు ప్రతీ స్త్రీ అందంగానే ఉంటుందని విశ్వసిస్తారు. పోటీలో పాల్గొనే యువతుల ఆకాంక్షలు, అవగాహన, మేధస్సులను బట్టి బ్యూటీ క్వీన్స్ గా నిర్ణయించబడుతారు.

మిషన్ — మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ మహిళలు తమ సొంత చర్మంలో సౌకర్యవంతంగా ఉండడమేకాక వారి వ్యక్తిత్వమే తమ అందం అని నమ్ముతారు. అంతేకాకుండా, ఇది వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహకరిస్తుంది. వారి సామర్థ్యాన్ని స్వతహాగా గుర్తించడానికి, సాధికారతకు ప్రతిరూపంగా ఉండటానికి తద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్త్రీ నమ్మకంగా ఎదగడానికి దొహదపడుతుంది.

విజన్ — మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ అనేది మహిళలు తమలో తమనేకాక గ్లోబల్ కమ్యూనిటీలో సానుకూల దృక్పదాన్ని పెంపొందిచుకోవడానికి ఇది సరియైన ఒక వేదిక.

భారతదేశం ఇప్పటి వరకు 3 సార్లు మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ టైటిల్ ని కైవసం చేసుకుంది.

మూలాలు

మార్చు
  1. "About". Miss Asia Pacific International (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
  2. "My whole world changed: Dia Mirza on completing 20 years of winning Miss Asia Pacific title". The Indian Express (in ఇంగ్లీష్). 2020-12-03. Retrieved 2021-11-18.