దియా మీర్జా, (జనన నామం దియా హండ్రిచ్, జననం.డిసెంబర్ 9 1981) భారతీయ మోడల్,సినిమా నటి, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ విజేత. ఈమె బాలీవుడ్ సినిమా నటి. ఈమె తన సమాజ సేవ పరంగా ప్రముఖురాలు. ఆమె సాహిల్ సంఘ అంరియు జయాద్ ఖాన్ లతో కలసి ఒక ప్రొడక్షన్ సంస్థను యేర్పాటుచేశారు.[1] వారి మొదటి సినిమా "లవ్ బ్రేక్‌అప్స్ జిందగీ". ఇది అక్టోబరు 7, 2011 న విడుదలైంది.

దియా మీర్జా
అందాల పోటీల విజేత
జూలై 2012 లో దియా మీర్జా NDTV మార్క్స్ ఫర్ స్పోర్ట్స్ ఈవెంట్ లో చిత్రం.
జననముదియా హండ్రిచ్
(1981-12-09) 1981 డిసెంబరు 9 (వయసు 42)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
నివాసంముంబయి, మహారాష్ట్ర, భారతదేశము
వృత్తినటి, మోదల్,చిత్ర నిర్మాత
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇందియా ఆసియా పసిఫిక్ 2000
మిసి ఆసియా పసిఫిక్ 2000
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇందియా ఆసియా పసిఫిక్ 2000
(విజేత)
(మిస్ బ్యూటిఫుల్ స్మైల్)
మిస్ ఆసియా పసిఫిక్ 2000
(విజేత)
(మిస్ అవన్)
(మిస్-క్లోజప్ స్మైల్)

వ్యక్తిగత జీవితం, విద్య

మార్చు
 
జనవరి, 2014 గ్రేస్ కల్లిస్టా స్పా ప్రారంభోత్సవంలో దియా మీర్జా

దియా మీర్జా తెలంగాణ లోని హైదరాబాదులో జన్మించారు. ఆమె తండ్రి ఫ్రాంక్ హండ్రిచ్. ఆయన జర్మ గ్రాఫిక్, ఇండస్ట్రియల్ ఫైర్ డిసైనర్, ఆర్కిటెక్ట్, కళాకారుడు, ఇంటీరియర్ డిసైనర్. ఆమె తల్లి దీపా బెంగాలీ హిందువులకు చెందినవారు. ఆమె ఇంటీరియల్ డిసైనర్, మద్యపాన బానిసలకు స్వచ్ఛందంగా సేవచేయు సామాజిక సేవా కార్యకర్త. దియా మిర్జా ఆరు సంవత్సరాల ప్రాయంలో ఉన్నపుడు తల్లిదండ్రులు విడిపోయారు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఆమె తండ్రి మరణించాడు. ఆ తర్వాత ఆమె తల్లి అహ్మద్ మిర్జాను వివాహమాడారు., ఆయన కూడా 2004 లో మరణించాడు. ఆమె తన పెంపుడు తండ్రి ఇంటిపేరును దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన కన్నతండ్రి ఇంటిపేరును కూడా చివరకు చేర్చుకుని "దియా మిర్జా హండ్రిచ్"గా తన పేరును మార్చుకున్నారు.

ఆమె హైదరాబాదు జిల్లా లోని ఖైరతాబాదులో నివసిస్తున్నప్పుడు విద్యారణ్య హైస్కూల్ లో చదివారు. ఆ పాఠశాల జిడ్దు కృష్ణమూర్తి బోధనలపై ఆధారపడేవి. ఆ తర్వాత ఆమె ఖైరతాబాదులోని నాసర్ పాఠశాలలో చేరారు. ఆమె స్టాన్లీ జూనియర్ కాలేజీలో చేరి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొందారు.[2]

కెరీర్

మార్చు

దియా మిర్జా కాలేజీలో ఉన్నప్పుడు మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు. అదే సమయంలో ప్రచార, టి.వి వాణిజ్య సంస్థల లలో "లిప్టన్","ఇమామి" మరికొన్ని యడ్స్ లో నటించారు. ఆమె 2000 లో "మిస్ ఆసియా పసిఫిక్" అవార్డును పొందారు. ఆ తర్వాత ఆమె వివిధ సినిమాలలో "డమ్" (2003), దీవానపన్, తుమ్‌కోనా భూల్ పాయెగా, తుమ్‌సా నాహిన్ దేఖా - ఎ లవ్ స్టోరీ, పరినీత, దస్, లగె రహో మున్నాభాయి మొదలగు వాటిలో నటించారు. ఆమె నటిగా గుర్తింపు పొందలేకపోయారు. కానీ సమాజ సేవకురాలిగా అధిక గుర్తింపు పొందారు. ఆమెకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్ం అకాడామీ 2012 గ్రీన్ అవార్డు ఆమె చేసిన హరిత పరిసరాలకోసం సేవలకు గాను లభించింది. ఆమె "భ్రూణ హత్యలు", "హెచ్.ఐ.వి", వంటి ప్రజలను జాగృతిపరచే కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె నర్మదా బచాత్ అందోలన్ లోకూడా పాల్గొన్నారు. ఆమె "హిందూస్థాన్ టైమ్స్", ఇతర ప్రచురణ సంస్థలలో అనేక ఆర్టికల్స్ ను వ్రాసారు.

దియా కాలేజి విద్యనభ్యసించేటపుడు 16 సంవత్సరాల వయసులో ఈ పనిని ప్రారంభించారు. ఆమె మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మల్టీ మీడియా సంస్థలో పనిచేశారు. ఆమె పనిచేసిన సంస్థ పేరు డా.నీరజా మల్టీ మీడియా స్టుడియో. ఆమె వివిధ వాణిజ్య ప్రకటనలలో అనగా వాల్స్, లిప్టన్, ఇమామి వంటి వాటిలో నటించారు.[3]

మిస్ ఆసియా పసిఫిక్

మార్చు

దియా మిర్జా 2000 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియాలో రెండవ రన్నరప్ గా నిలిచారు. తర్వాత మిస్ ఆసియా పసిఫిక్ పంపబడింది. అచట విజయం సాధించారు. ఫిలిప్పీన్స్ లోని మనీలాలో డిసెంబర్ 3, 2000 లో జరిగిన మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ ను గెలుచుకున్నారు.[4] ఆమె 2000 లో ఇందియా విన్నింగ్ ఇంటర్నేషనల్ పీజియంట్స్ లో హ్యాట్రిక్ సాధించారు. అదే సంవత్సరంలో లారాదత్తా మిస్ యూనివర్స్ టైటిల్ నూ, ప్రియాంకా ఛోప్రా మిస్ వరల్డ్ టైటిల్ నూ గెలుచుకున్నారు.[5]

సినిమా జీవితం

మార్చు

దియా మీర్జా "రహ్నా హై తేరే దిల్ మే" సినిమాలో అరంగేట్రం చేశారు. కానీ ఆ చిత్రం బాక్సాపీసు విజయం సాషించలేకపోయింది. ఆమె విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ చిత్రం "పరిణిత"లో కనిపించారు. ఆమె మ్యూజిక్ వీడియో "కజర మొహబ్బత్ వాలా"లో నటించారు.[6] ఆమె "దస్", "ఫైట్ క్లబ్" వంటి సినిమాలలో కూడా నటించారు. ఆమె "ఆసిడ్ ఫ్యాక్టరీ" అనే చిత్రంలో ఆమె ఆరు ప్రముఖ పాత్రలలో నటించే ఏకైక మహిళా పాత్రలో నటించింది.[7]

వివాహ జీవితం

మార్చు

దియా మీర్జా 2019లో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకుంది, ఐదేళ్ల తర్వాత అతడికి విడాకులు ఇచ్చింది. ఫిబ్రవరి 15, 2021లో వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.[8][9]

అవార్డులు

మార్చు

దియా మిర్జా 2012 లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్ం అకాడమీ అవార్డు అయిన "గ్రీన్ అవార్డు"ను గెలుచుకున్నారు. ఆమె పచ్చని పరిసరాలకోసం చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.[10]

నటించిన చిత్రాలు

మార్చు
Year Film Role Notes
2001 Rehna Hai Tere Dil Mein Reena Malhotra
Deewaanapan Kiran Choudhary
2002 Tumko Na Bhool Paayenge Muskaan
2003 Tehzeeb Nazneen Jamal
Pran Jaye Par Shaan Na Jaye Saundarya
Dum Kaveri
2004 Stop! Shama
Tumsa Nahin Dekha Jia Khan
Kyun...! Ho Gaya Na Preeti Special appearance
2005 Naam Gum Jaayega Natasha/Gitanjali
My Brother… Nikhil Special appearance
Blackmail Mrs. Rathod
Parineeta Gayatri
Dus Anu Dheer
Koi Mere Dil Mein Hai Simran
2006 Fight Club - Members Only Anu Chopra
Phir Hera Pheri Item number (song)
Alag Purva Rana
Lage Raho Munna Bhai Simran
Prateeksha Reena Brown TV release
2007 Honeymoon Travels Pvt. Ltd. Shilpa
Shootout at Lokhandwala Mita Matu
Cash Aditi
Heyy Babyy Herself Special appearance in a song
Om Shanti Om Herself Special appearance
Dus Kahaniyaan Sia
2008 Krazzy 4 Shikha
2009 Kissan Priya
Jai Veeru Anna
Acid Factory Max
Fruit and Nut Monica Gokhale
Kurbaan Rehana (WIACB reporter) Special Appearance
Luck By Chance Herself Special Appearance
2010 Hum Tum Aur Ghost Gehna
Shoebite
2011 Love Breakups Zindagi Naina
2012 Paanch Adhyay Ishita Dia's 1st Bengali Film
2013 Hungame pe Hungama Gia
20 తప్పాడ్

మూలాలు

మార్చు
  1. Parasara, Noyon Jyoti. "Production is not a joke: Dia Mirza". Ticket Please News Desk. Archived from the original on 17 జూలై 2011. Retrieved 14 February 2011. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Dia Mirza - 2000-1991! - Miss India Winners 2009-1964 - Archives - Femina Miss India". Indiatimes. Archived from the original on 2011-09-27. Retrieved 2011-06-02. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Dia Mirza Biography". Archived from the original on 2010-11-29. Retrieved 2014-03-19.
  4. "ENDURING BEAUTIES". The Times Of India. Archived from the original on 2010-04-25. Retrieved 2014-03-19. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "Miss India Winners 2000 - 1991 - Indiatimes.com". Feminamissindia.indiatimes.com. Archived from the original on 2013-03-29. Retrieved 2011-11-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "Dia Mirza in Sonu Nigam's latest album". indiafm.com. Retrieved 11 October 2006.
  7. "I am a femme fatale who is also a gangster". Archived from the original on 2009-10-12. Retrieved 2014-03-19.
  8. Hindustan Times, Home / Entertainment / Bollywood (8 April 2021). "Dia Mirza celebrates birthday of stepdaughter Samaira". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
  9. The Hindu, ENTERTAINMENT (16 February 2021). "Dia Mirza, businessman Vaibhav Rekhi get married". The Hindu (in Indian English). Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
  10. "Dia Mirza honoured with Green Award". businessofcinema.com/. Archived from the original on 7 జూలై 2012. Retrieved 4 July 2012.

ఇతర లింకులు

మార్చు