Myr అనేది "మిలియన్ ఇయర్స్" అనే ఇంగ్లీషు పదానికి సంక్షిప్తీకరణ. దీనికి అర్థం 1,000,000 సంవత్సరాలు లేదా 31.556926 టెరాసెకండ్లు.

వాడుక

మార్చు

Myr (మిలియన్ సంవత్సరాలు) అనేది భూశాస్త్రం, కాస్మోలజీ వంటి రంగాలలో సాధారణ ఉపయోగంలో ఉంది. Myr ను mya (మిలియన్ సంవత్సరాల క్రితం) తో పాటు ఉపయోగిస్తారు. ఈ రెండు కలిసి ఒక రిఫరెన్స్ వ్యవస్థ అవుతుంది. మొదటిది పరిమాణానికి, రెండవది వర్తమానానికి ముందున్న సమయాన్ని సూచిస్తాయి.

Myr భూగర్భ శాస్త్రంలో వాడడం లేదు గానీ ఖగోళ శాస్త్రంలో myr అనేది ప్రామాణికంగానే ఉంది. భూగర్భ శాస్త్రంలో "Myr" సాధారణంగా మెగా-సంవత్సరాల ప్రమాణం. ఖగోళ శాస్త్రంలో "Myr" అంటే మిలియన్ సంవత్సరాలు.

భూగర్భ శాస్త్రంలో Myr (వ్యవధి) ప్లస్ Ma (మిలియన్ సంవత్సరాల క్రితం) స్థానే Ma అనే పదాన్ని మాత్రమే ఉపయోగించడం గురించి చర్చ జరుగుతూనే ఉంది. [1] [2] ఈ రెండు సందర్భాల్లోనూ Ma అనే పదాన్ని భూగర్భ శాస్త్ర సాహిత్యంలో ISO 31-1 (ఇప్పుడది ISO 80000-3 ), NIST 811 సిఫార్సు చేసిన అభ్యాసాలకు అనుగుణంగానే ఉపయోగిస్తారు. భూగర్భ శాస్త్ర సాహిత్యంలో సాంప్రదాయ శైలిలో ఇలా రాస్తారు:

క్రెటేషస్ 145 Ma మొదలై, 66 Ma ముగిసింది. మొత్తం 79 Myr పాటు ఉంది.

"క్రితం" అనే పదం ఉన్నట్లుగానే భావిస్తారు. అంచేత, 66, 145 మధ్య ఉన్న ఏ "ఫలానా Ma" సంవత్సర సంఖ్య అయినా "క్రెటేషియస్" అనే అర్థం. కానీ దీనికి ప్రతివాదం ఏమిటంటే, myr ను ఒక కాలానికీ, Mya ను ఒక వయస్సుకీ సూచించడం వలన కొలమానాలు గందరగోళమౌతాయి. మొదటి అక్షరాన్ని క్యాపిటలైజు చెయ్యడం/చెయ్యకపోవడం వంటి లోపాలు ఏర్పడవచ్చు: "million" ను క్యాపిటలైజ్ చేయనవసరం లేదు, కానీ "mega" ను తప్పనిసరిగా చెయ్యాలి; "ma" అనేది సాంకేతికంగా మిల్లీ ఇయర్‌ని సూచిస్తుంది (సంవత్సరంలో వెయ్యి వంతు లేదా 8 గంటలు). ఈ వాదనను అనుసరించేవారు, myr అని రాయకుండా, చివర ago అని జోడిస్తారు (లేదా BP (బిఫోర్ ప్రజెంట్) అని జోడిస్తారు).

క్రెటేషస్ 145 Ma క్రితం మొదలై 66 Ma క్రితం ముగిసింది. మొత్తం 79 Ma ల పాటు ఉంది.

ఈ సందర్భంలో, "79 Ma" అంటే "79 మిలియన్ సంవత్సరాలు" అనే అర్థం. అంతేగానీ 79 మిలియన్ సంవత్సరాల క్రితం అని కాదు.

మూలాలు

మార్చు
  1. Mozley, Peter. "Discussion of GSA Time Unit Conventions". web page. Geological Society of America. Archived from the original on 2016-03-03.
  2. Biever, Celeste. "Push to define year sparks time war".
"https://te.wikipedia.org/w/index.php?title=మి.సం&oldid=3592923" నుండి వెలికితీశారు