మీనాక్షి పాటిల్
మీనాక్షి పాటిల్ (1947 - 29 మార్చి 2024) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అలీబాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఓడరేవులు & మత్స్య శాఖ సహాయ మంత్రిగా పని చేసింది.
మీనాక్షి పాటిల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 | |||
ముందు | మధుకర్ ఠాకూర్ | ||
---|---|---|---|
తరువాత | సుభాష్ పాటిల్ | ||
నియోజకవర్గం | అలీబాగ్ | ||
పదవీ కాలం 1995 – 2004 | |||
ముందు | దత్తాత్రయ్ పాటిల్ | ||
తరువాత | మధుకర్ ఠాకూర్ | ||
నియోజకవర్గం | అలీబాగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1947 మహారాష్ట్ర , భారతదేశం | ||
మరణం | 2024 మార్చి 29 | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మీనాక్షి పాటిల్ మహారాష్ట్ర మాజీ ప్రతిపక్ష నాయకుడు దత్తా నారాయణ్ పాటిల్ మేనకోడలు.
రాజకీయ జీవితం
మార్చుమీనాక్షి పాటిల్ ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీల వివిధ హోదాల్లో పని చేసి 1995 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అలీబాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మంత్రివర్గంలో సాంస్కృతిక వ్యవహారాలు & ఓడరేవులు, మత్స్య శాఖ సహాయ మంత్రిగా పని చేసింది.[1] మీనాక్షి పాటిల్ 2004 ఎన్నికలలో ఓడిపోయి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అలీబాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి తిరిగి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3]
మరణం
మార్చుమీనాక్షి పాటిల్ 76 సంవత్సరాల వయస్సులో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం క్షిణించడంతో 2024 మార్చి 29న మరణించింది.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ "The Maharashtra Council of Ministers". Rediff News. 31 October 1999. Retrieved 21 April 2021.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Former State Minister Meenakshi Patil passes away at the age of 76" (in ఇంగ్లీష్). Mumbai Live. 29 March 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ "Former Maharashtra minister and PWP leader Meenakshi Patil dies at 77" (in ఇంగ్లీష్). Deccan Herald. 29 March 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ "कोकणातील जनतेचं मन जाणणाऱ्या नेत्याचा अंत; नीलम गोऱ्हेंनी घेतली मीनाक्षी पाटील यांच्या कुटुंबाची भेट". Lokmat. 31 March 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.