మీరా కుమార్ భారత పార్లమెంటు సభ్యురాలు, లోక్‌సభకు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.

మీరా కుమార్
మీరా కుమార్

మూడవ ప్రపంచ దేశాక సభాపతుల సదస్సు లో ప్రసంగిస్తున్న మీరా కుమార్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2009
ముందు సోమనాధ్ ఛటర్జీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004

వ్యక్తిగత వివరాలు

జననం (1945-03-31) 1945 మార్చి 31 (వయసు 79)
ససారం, రోహ్‌తాస్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మంజుల్ కుమార్
సంతానం 1 కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
నివాసం ఢిల్లీ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయము
మతం హిందూ
జూన్ 3, 2009నాటికి

నేపధ్యం

మార్చు

బీహార్ లోని పట్నా జిల్లాలో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్‌ రామ్, ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని ఇంద్రప్రస్థ కళాశాల, మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది.

జీవన పధం

మార్చు

విదేశీ జీవితం

మార్చు

ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ఇండియన్ ఫారిన్ సర్వీసుకు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.

రాజకీయ జీవితం

మార్చు

1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, మాయావతి లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. ఢిల్లీ లోని కరోల్ బాగ్ నియోజకవర్గానికి 8వ, 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004, 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన బీహార్ లోని ససారం నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.

2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ, సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే లోక్‌సభ సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత లోక్‌సభకు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.

2014 ఎన్నికలు

మార్చు

2014 పార్లమెంటు ఎన్నికలలో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

2017 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి

మార్చు

ఎన్.డి.ఎ. కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాం నాధ్ కోవింద్ కి పోటిగా ప్రతిపక్షాల తరుపున ఎన్నికోబడిన అభ్యర్థి మీరా కుమార్.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమె వివాహము సుప్రీం కోర్టు న్యాయవాది అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్, కుమార్తెలు స్వాతి, దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక కుమార్తె అనాహిత. కుమార్తె స్వాతి వివాహము రంజీత్ తోనూ, దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి, రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత, కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని, అమిత్ లకు ఒక కుమారుడు ఫర్జాన్ సంతానము.

మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక 04-07-2017

బయటి లంకెలు

మార్చు