మీరా కొసాంబి
మీరా కొసాంబి (मीरा कोसंबी) (1939 ఏప్రిల్ 24 – 2015 ఫిబ్రవరి 26) భారతీయ సామాజిక శాస్త్రవేత్త, రచయిత్రి.
జననం, విద్యాభ్యాసం
మార్చుమీరా 1939 ఏప్రిల్ 24న జన్మించింది. ఈమె గణిత శాస్త్రవేత్త, చరిత్రకారుడు డి.డి. కోసాంబి, నళిని కోసాంబిల [1] చిన్న కుమార్తె.[2] ఆమె బౌద్ధ పండితుడు, పాళీ నిపుణుడు ధర్మానంద దామోదర్ కోసాంబి మనవరాలు.[3] 1981లో స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం నుంచి సామాజిక శాస్త్రంలో పీహెచ్. డి. పొందింది.[4][5]
సామాజిక శాస్త్రవేత్తగా, రచయిత్రిగా
మార్చుమీరా ప్రొఫెసర్ గా, ఎస్ ఎన్ డీటీ యూనివర్సిటీలోని రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ (Research Centre for Women’s Studies) డైరెక్టర్ గా పనిచేశింది. ఆమె మహిళా అధ్యయన రంగంలో ప్రముఖురాలు, సామాజిక శాస్త్రవేత్త, పట్టణ అధ్యయన పండితురాలు, స్త్రీవాద చరిత్రకారురాలు. ఆమె అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు, పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదించింది.[6] ఆమె పండిత రమాబాయి రచనలను సంకలనం, సవరించింది, మరాఠీ నుండి ఆంగ్లంలోకి అనువదించింది.[7] ఆమె తన తాత ధర్మానంద దామోదర్ స్వీయచరిత్ర, పండిత రచనలను ఆంగ్లంలోకి అనువదించింది.[2]
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మీరా 2015 ఫిబ్రవరి 26న పూణేలో కన్నుమూశింది.[8]
మూలాలు
మార్చు- ↑ "विदुषी मीरा कोसंबी कालवश". Lokmat (in మరాఠీ). 2015-02-27. Retrieved 2024-02-21.
- ↑ 2.0 2.1 डॉ. मो.गो., धडफळे (2021-04-27). "कोसंबी, मीरा दामोदर". महाराष्ट्र नायक (in మరాఠీ). Retrieved 2024-02-20.
- ↑ Sachin, Fulpagare (28 February 2015). "डॉ. मीरा कोसंबी". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2024-02-20.
- ↑ "डॉ. मीरा कोसंबी". Loksatta (in మరాఠీ). 2015-03-02. Retrieved 2024-02-20.
- ↑ "Doktorsavhandlingar vid Sociologiska institutionen 1951 – juni 2021/Dissertations at the Department of Sociology 1951 – June 2021" (PDF). Stockholm University (pdf).
- ↑ Navprabha (2015-02-27). "मीरा कोसंबी यांचे निधन" (in మరాఠీ). Retrieved 2024-02-21.
- ↑ "विदूषी मीरा कोसंबी कालवश". Lokmat (in మరాఠీ). 2015-02-27. Retrieved 2024-02-20.
- ↑ Kulkarni, Mangesh (June 2015). "Reclaiming feminism: The legacy of Meera Kosambi". Contributions to Indian Sociology (in ఇంగ్లీష్). 49 (2): 250–254. doi:10.1177/0069966715585653. ISSN 0069-9667.