ముంగేలి

ఛత్తీస్‌గఢ్‌లోని నగరం

ముంగేలి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ముంగేలి జిల్లాలోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపాలిటీ నిర్వహిస్తుంది. ముంగెలి పిన్ కోడ్ 495334.

భౌగోళికం

మార్చు

ముంగేలి సముద్రమట్టం నుండి సగటున 288 మీటర్ల ఎత్తున ఉంది. ముంగేలి 'బిలాస్‌పూర్' నుండి 50 కిలోమీటర్ల దూరంలోను, ఛత్తీస్‌గఢ్ రాజధాని నగరం రాయ్‌పూర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ముంగేలి అగర్ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం. దీనికి ఉత్తరాన పీఠభూమి, దక్షిణాన మహానది బేసిన్ ఉన్నాయి.

జనాభా

మార్చు

As of 2013జనగణన ప్రకారం,[1] ముంగేలి జనాభా 55,756. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. సగటు అక్షరాస్యత 69%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 59%. ముంగేలి జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు

మార్చు
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

 

"https://te.wikipedia.org/w/index.php?title=ముంగేలి&oldid=3849769" నుండి వెలికితీశారు