ముంజులూరి కృష్ణారావు

ముంజులూరి కృష్ణారావు ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. నాటకరంగానికి తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి. బందరు రాయల్ థియేటర్ లో చేరి ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు, వేణీ సంహారంలో అశ్వత్థామ, రసపుత్రవిజయంలో దుర్గాదాసు, పండవొద్యోగం, గయోపాఖ్యానం లలో శ్రీ కృష్ణుడు, ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు, పిచ్చివాడు, మృఛ్ఛకటికంలో శర్విలకుడుగా నటించారు. 1925లో ఏలూరు మోతే నారాయణరావు కంపెనీలో చిన్న చిన్న పాత్రలు ధరించి, వృద్ధాప్యం వల్ల పాత్రపోషణ చేయలేక, బందా వారి నాట్య పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఒంటరి జీవితం గడిపి అస్తమించారు.

ముంజులూరి కృష్ణారావు
ముంజులూరి కృష్ణారావు
జననంముంజులూరి కృష్ణారావు
ప్రసిద్ధిరంగస్థల, సినిమా నటుడు
మతంహిందూ మతము

కృష్ణారావు జీవితచరిత్ర ఆధారంగా విశ్వనాథ సత్యనారాయణ ‘తెఱచిరాజు’ నవల వ్రాశాడు.[1]

మూలాలు మార్చు

  1. శ్రీరమణ. "ఒక్కడు విశ్వనాథ". సాక్షి. No. September 07, 2014. Retrieved 3 December 2014.