ముంబై - ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్

ఇండియన్ రైల్వేలలో ఎక్స్ప్రెస్ రైలు

ముంబై - ఇండోర్ దురంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలుకు చెందిన ముంబయి సెంట్రల్ (బి.సి.టి) నుంచి ఇండోర్ (ఐ.ఎన్.డి.బి.) వరకు ప్రయాణించే ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది 12227/12228 నంబర్లతో ప్రస్తుతం ఈ రైలు కార్యకలాపాలు సాగుతున్నాయి.[2]

ముంబై - ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్
Indore Duronto Express
సారాంశం
రైలు వర్గంDuronto Express
తొలి సేవ28 January 2011
ప్రస్తుతం నడిపేవారుWestern Railway
మార్గం
మొదలుMumbai Central
ఆగే స్టేషనులు2
గమ్యంIndore Junction BG
ప్రయాణ దూరం829 కి.మీ. (515 మై.)
సగటు ప్రయాణ సమయం12h 37m
రైలు నడిచే విధం2 days a week. 12227 – Thursday & Saturday, 12228 – Friday & Sunday
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 tier, AC 3 tier
కూర్చునేందుకు సదుపాయాలుNo
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes, Pantry Car attached
చూడదగ్గ సదుపాయాలుLHB Rake. Rake sharing with 12239/40 Jaipur Duronto Express
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్Broad - 1,676 mm (5 ft 6 in)
వేగం65.66 km/h (Average)

బోగీల విభజన

మార్చు
  • ఈ రైలులో 8 ఏసీ 3 టైర్ బోగీలు
  • 2 ఏసీ 2 టైర్ బోగీలు
  • 1 మొదటి శ్రేణి బోగి
  • 1 పాంటీ కారు,
  • 2 ఇ.ఒ.జి.

కారుతో సహా మొత్తం 14 బోగీలు ఉంటాయి. భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకుల అవసరాలను, రద్దీ ఆధారంగా అదనంగా బోగీలు చేర్చడం, ఉన్నవాటిని తొలగించడం చేయవచ్చు.[3]

సేవలు

మార్చు
 
ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు నామఫలకం

ముంబయి-ఇండోర్ మార్గంలో నడిచే రైళ్లలో అతి వేగంగా నడిచే రైలు ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్.[4] 12227 నెంబరుతో నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ గంటకు 65.88 కిలోమీటర్ల సగటు వేగంతో నడుస్తూ 829 కిలో మీటర్ల ప్రయాణాన్ని12 గంటల 35 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. అదేవిధంగా 12228 నెంబరు గల దురంతో ఎక్స్‌ప్రెస్ గంటకు 65.66 కిలో మీటర్ల సగటు వేగంతో 829 కిలోమీటర్ల ప్రయాణాన్ని 12 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. 12961/62 నెంబర్లతో ముంబయి, ఇండోర్ మధ్య నడిచే అవంతి ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్‌కు జతపరుస్తారు.[5]

రైలు వివరాలు

మార్చు

ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్ తన ఆరంభ పరుగును 2011 జనవరి 28 లో మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారానికి రెండు రోజులు నిరంతరాయంగా తన సేవలనందిస్తోంది. ఎల్.హెచ్.బి. రేక్ లను ఊపయోగిస్తూ పూర్తి స్థాయి ఎ.సి. రైలుగా ఇది గుర్తింపు పొందింది.

రేక్ షేరింగ్ షెడ్యూలు ఈ క్రింది విధంగా ఉంది.

  • రేక్-ఎ: బి.సి.టి నుంచి గురువారం బయలుదేరి ఐ.ఎన్.డి.బికి వెళుతుంది.
  • రేక్-ఎ: శనివారం ఐ.ఎన్.డి.బి. నుంచి బి.సి.టి చేరుకుంటుంది.
  • రేక్-ఎ: శనివారం బి.సి.టి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.
  • రేక్-బి: బి.సి.టి నుంచి శనివారం బయలుదేరి ఐ.ఎన్.డి.బికి వెళుతుంది.
  • రేక్-ఎ: బి.సి.టి నుంచి ఆదివారం బయలుదేరి జె.పి.కి వెళుతుంది.
  • రేక్-బి: సోమవారం ఐ.ఎన్.డి.బి. నుంచి బి.సి.టి చేరుకుంటుంది.
  • రేక్-బి: సోమవారం బి.సి.టి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.
  • రేక్-ఎ: సోమవారం జె.పి. వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.
  • రేక్-ఎ: బుధవారం జె.పి. నుంచి బి.సి.టికి చేరుకుంటుంది.
  • రేక్-బి: బి.సి.టి. నుంచి బయలుదేరి జె.పి.కి వెళుతుంది.
  • రేక్-బి: శుక్రవారం జె.పి. నుంచి బి.సి.టికి చేరుకుంటుంది.
  • రేక్-బి: శుక్రవారం బి.సి.టి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది.

చక్రాలు

మార్చు

ముంబయి సెంట్రల్ & వడోదర జంక్షన్ల మధ్య ఈ రైలును.. రెండు భాగాలు గల చక్రాలతో డబ్ల్యుసిఎం 2/2పి లోకోస్ ఇంజిన్ లాక్కేళ్లుతుంది. ఆ తర్వాత వడోదర ఆధారంగా డబ్ల్యుఎపి 4 లోకోమోటివ్ ఇంజిన్ ఈ రైలును రత్లాం జంక్షన్ దాకా తీసుకెళుతుంది. దీనికి కొనసాగింపుగా రత్లామ్ ఆధారంగా డబ్ల్యుడిఎం 2 లేదా డబ్ల్యుడిఎం 3ఎ ఇంజన్ చివరి గమ్యస్థానం వరకు తీసుకెళ్తుంది.

ఇండోర్ –ఉజ్జైన్ సెక్టార్ లో పశ్చిమ రైల్వే సంస్థ రైల్వే లైన్ విద్యుదీకరణలో భాగంగా 2012 ఫిబ్రవరి 5 నుంచి డి.సి. విద్యుత్ ను ఎసీకి మార్చడం పూర్తి చేసింది.దీంతో ఇది వడోదర ఆధారంగా డబ్ల్యుఎపి 4ఈ లేదా డబ్ల్యుఎపి 5 ఇంజిన్ తో నిరంతరాయంగా ముంబయి సెంట్ర ల్ నుంచి ఇండోర్ వరకు నడుస్తోంది.సాంకేతిక అవసరాల కోసం ఆగు స్థలాలు: వడోదర జంక్షన్, రత్లాం జంక్షన్, ఉజ్జయినీ జంక్షన్ [6]

సమయ సారిణి

మార్చు
స్టేషను స్టేషను పేరు రాక బయలుదేరుట దూరం వారం ఫ్రీక్వెన్సీ
బి.సి.టి. ముంబయి సెంట్రల్ మొదలు 0 1 గురువారం, శనివారం
ఐ.ఎన్.డి.బి. ఇండోర్ ముగింపు 829కి.మీ (515 ని.) 2
ఐ.ఎన్.డి.బి. ఇండోర్ మొదలు 0 1 శుక్రవారం&ఆదివారం
బి.సి.టి.

గ్యాలరీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=21&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
  2. "రైలు ప్రారంభిస్తోంది". Indianrailways.
  3. "దురంతో రైలు జాబితా".
  4. "ఇండోర్ దురంతో కు ముంబై సెంట్రల్". Indiarailinfo. Archived from the original on 2014-03-02. Retrieved 2015-01-22.
  5. "ముంబై దురంతో 12228". Cleartrip.com. Archived from the original on 2014-10-10. Retrieved 2015-01-22.
  6. "రైలు సమయపట్టిక". Archived from the original on 2014-12-11. Retrieved 2015-01-22.

బయటి లింకులు

మార్చు