ముఖ్యమంత్రి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భారతదేశంలో రాష్ట్రాల ప్రభుత్వాధినేతను ముఖ్యమంత్రి అంటారు. శాసనసభలో కనీస ఆధిక్యత కలిగిన పార్టీ లేదా కూటమికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడై ఉండాలి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకున్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు, కానీ 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాలి.ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనకు బాధ్యుడు. గవర్నరు పేరిట పరిపాలన జరిగినప్పటికీ, అధికారం యావత్తూ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. పరిపాలనలో తనకు సహాయంగా ఉండేందుకు మంత్రివర్గాన్ని నియమించుకుంటారు.
భారతదేశం |
![]() ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
ఎంపిక విధానం మార్చు
భారత రాజ్యాంగం, ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థికి అర్హతా నియమావళిని నిర్దేశించింది.
● అభ్యర్థి భారత పౌరుడు అయ్యి ఉండాలి.
● 25 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
● రాష్ట్ర శాసనసభలో సభ్యుడు అయ్యి ఉండాలి. సభ్యత్వం లేని యెడల, అభ్యర్థి గవర్నర్ ఆమోదం కలిగి ఉండాలి.
అట్టి పరిస్థితిలో అభ్యర్థి ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించిన నాటి నుండి ఆరు మాసాల కాల వ్యవధిలోపు శాసనసభా సభ్యత్వాన్ని పొందాలి. లేని పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి నుండి అభ్యర్థి తొలగించబడతారు.