ముగ్గురు వీరులు 1960, మే 12న విడుదలైన డబ్బింగ్ సినిమా. అలెక్జాండర్ డ్యూమాస్ రచించిన ఫ్రెంచి నవల త్రీ మస్కటీర్స్ ఈ సినిమాకు ఆధారం. ఇది తమిళ భాషలో నిర్మించబడిన విజయపురి వీరన్ (விஜயபுரி வீரன்) సినిమా నుండి తెలుగులోనికి డబ్ చేయబడింది[1].

ముగ్గురు వీరులు
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం జోసెఫ్ తలియాత్
తారాగణం ఆనంద్, అశోకన్, ఎం.హేమలత, చంద్రకాంత
నిర్మాణ సంస్థ సిటడెల్ ఫిల్మ్ కార్పొరేషన్
భాష తెలుగు

నటీనటులుసవరించు

 • సి.ఎల్.ఆనంద్
 • ఎం.హేమలత
 • అశోకన్
 • ఎస్.వి.రామదాస్
 • పొంది సెల్వరాజు
 • తిరుచ్చి గణేశన్
 • ఎస్.రామారావ్
 • కామిని
 • చంద్రకాంత
 • షణ్ముగ సుందరి

సాంకేతిక వర్గంసవరించు

సంక్షిప్త కథసవరించు

ఆనంద్ అలకాపురి చేరతాడు. అక్కడ వీరసింహుడు, కవి స్నేహితులవుతారు. ఆనంద్ అలకాపురి మహారాజు అంగరక్షకుడు అవుతాడు. రాజును చంపించి, రాకుమార్తె కాంచనాదేవిని సర్వాధికారికి ఇచ్చి పెళ్ళి చేసి, అతనిని తన చేతిలోని కీలుబొమ్మగా చేసుకుని, రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని మాయాదేవి కుట్ర పన్నుతూ వుంటుంది. ఈ ఆలోచనలను అరికట్టడానికి ముగ్గురు వీరులు అడుగడుగున అడ్డుపడుతూ వుంటారు. చివరకు సర్వాధికారి రాజకుమారి కాంచనను ఎత్తుకుపోతాడు. మహారాజును బందీ చేస్తాడు. చివరకు మహారాజు ప్రాణానికే ముప్పుగొని రావడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆనంద్ అడ్డుకుని సర్వాధికారిని దండించి మహారాజును కాపాడి రాకుమారి కాంచనను వివాహం చేసుకుంటాడు[1].

మూలాలుసవరించు

 1. 1.0 1.1 జె.వి.ఆర్. (22 May 1960). "రూపవాణి - చిత్రసమీక్ష - ముగ్గురు వీరులు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 13 December 2019.