ముద్దుల జానకి పెళ్ళికి

ముద్దుల జానకి పెళ్ళికి 1992 లో విడుదలైన పెద్దరికం సినిమాలోని పాట. దీనిని భువనచంద్ర రచించగా రాజ్ కోటి సంగీతాన్నందించాడు. ఈ పాటను కె.ఎస్.చిత్ర గానం చేసింది. సినిమాలో ఈ పాటలో సుకన్య ప్రధాన పాత్రగా నటించింది. [1]

పాట మార్చు

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
మురిపాల తేలించ ముని మాపులో
దివి నుండి రేరాజు దిగి వచ్చులే||

తొలకరిలా వలపంతా కురిసేనులే
తీయని ఉహాలు చిగురు తొడిగెను
నింగిని తాకే పందిరి వేసి
పచని పల్లెను పీటగా జేసి
బంగారు రంగులు వేయించ రారే
మురిపాల పెళ్లి జరిపించ రారే
వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసె
కనివిని ఎరుగని కమ్మని భావన
కధలుగా కనిపించే||

తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే
కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళ
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేల
సరసపు వయసున ఒంపుల సొంపుల
సరిగమ వినిపించి||

మూలాలు మార్చు

  1. ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews :". rajamusicbank.com. Retrieved 2020-09-17.

బాహ్య లంకెలు మార్చు