మునీర్ మాలిక్
మునీర్ మాలిక్ (1934, జూలై 10 - 2012, నవంబరు 30) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1959 - 1962 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. టెస్ట్ క్రికెట్‌లో 39.77 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు, ఇందులో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది.[1][2] ఇతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో, 21.75 సగటుతో 197 వికెట్లు తీశాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లియా, బ్రిటిష్ ఇండియా | 1934 జూలై 10|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2012 నవంబరు 30 కరాచీ, పాకిస్తాన్ | (వయసు 78)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 35) | 1959 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 జూలై 26 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2012 ఆగస్టు 29 |
ఫస్ట్ క్లాస్ కెరీర్
మార్చుమాలిక్ 1956-66 సమయంలో కరాచీ, పంజాబ్, రావల్పిండి, సర్వీసెస్ జట్ల తరపున 49 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[3] ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో, పద్నాలుగు సందర్భాలలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. ఒక మ్యాచ్‌లో నాలుగుసార్లు పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు.[1]
మాలిక్ 1956-57లో బహవల్‌పూర్‌తో జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ సమయంలో పంజాబ్ బి తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4] అందులో 8.30 సగటుతో 13 వికెట్లు తీసుకున్నాడు.[5] పంజాబ్‌పై పంజాబ్ బి తరపున 19 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం ఈ సీజన్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన.[6] మాలిక్ 1957-58 సమయంలో మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు పంజాబ్‌పై 66 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు.[7][8] తరువాతి రెండు దేశీయ సీజన్లలో, బంతితో మరింత ప్రభావవంతంగా 23, 28 వికెట్లు తీశాడు.[5] 1960 ఏప్రిల్ లో సర్గోధాలో ఇండియన్ స్టార్‌లెట్స్‌తో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 135 పరుగులకు 12 వికెట్లు పడగొట్టాడు.[9] ఇతని తదుపరి మ్యాచ్ సిలోన్ క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన పాకిస్తాన్ ఈగల్‌ల కోసం: మొదటి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 25 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు.[10]
1961–62 దేశవాళీ సీజన్‌లో మాలిక్ 38 వికెట్లు తీశాడు.[5] 1962లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన పాకిస్తాన్ జట్టులో ఒక సభ్యుడిగా ఉన్నాడు. అక్కడ మూడు టెస్టులు సహా పదహారు మ్యాచ్‌లు ఆడాడు, 39.93 సగటుతో 43 వికెట్లు తీశాడు.[5][7] అదే సంవత్సరం కంబైన్డ్ సర్వీసెస్ కొరకు 72 పరుగులు చేసాడు.[11] తర్వాతి మూడు దేశవాళీ సీజన్లలో, కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 28 వికెట్లు తీశాడు. ఇందులో కరాచీ వైట్స్ తరపున పంజాబ్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా 154 పరుగులకు 8 వికెట్లు తీశాడు.[5][7][12] 1965-66లో అయూబ్ ట్రోఫీ సమయంలో తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[12]
అంతర్జాతీయ కెరీర్
మార్చు1959లో కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 100 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.[13][14] 1962, జూలైలోలీడ్స్‌లోని హెడ్డింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో తదుపరి టెస్టును ఆడాడు. మ్యాచ్‌లో 128 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు, ఇది టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.[2] తన చివరి టెస్టును నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఆడాడు, జట్ల మధ్య అదే సిరీస్‌లో అతను ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.[15]
జననం
మార్చుమాలిక్ 1934, జూలై 10న బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్తాన్ )లోని లియాలో జన్మించాడు. ఇతనికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
మరణం
మార్చుఇతను తన 78 సంవత్సరాల వయస్సులో 2012, నవంబరు 30న సుదీర్ఘ అనారోగ్యంతో మరణించాడు. పిఈసిహెచ్ఎస్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.[3] [16]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Munir Malik". ESPNcricinfo. Retrieved 2023-09-25.
- ↑ 2.0 2.1 "Pakistan in England Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 2023-09-25.
- ↑ 3.0 3.1 Staff Report (2023-09-25). "Ex-Test pacer Munir Malik passes away". Daily Times. Retrieved 2023-09-25.
- ↑ "Punjab B v Bahawalpur – Quaid-e-Azam Trophy 1956/57 (North Zone)". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 "First-class bowling in each season by Munir Malik". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ "Punjab v Punjab B – Quaid-e-Azam Trophy 1956/57 (North Zone)". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ 7.0 7.1 7.2 "First-class matches played by Munir Malik (49)". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ "Punjab v Punjab B – Quaid-e-Azam Trophy 1957/58 (North Zone)". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ "Rawalpindi v Indian Starlets – Indian Starlets in Pakistan 1959/60". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ "Ceylon Cricket Association v Pakistan Eaglets – Pakistan Eaglets in Malayan and Ceylon 1960/61". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ "Combined Services v Sargodha – Quaid-e-Azam Trophy 1962/63 (Group A)". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ 12.0 12.1 "Punjab University v Karachi Whites – Ayub Trophy 1965/66". CricketArchive. Retrieved 2023-09-25.
- ↑ "Australia in Pakistan Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 2023-09-25.
- ↑ "Former Test paceman Munir Malik passes away". Dawn. Pakistan Herald Publications. 2023-09-25. Retrieved 2023-09-25.
- ↑ "Pakistan in England Test Series – 4th Test". ESPNcricinfo. Retrieved 2023-09-25.
- ↑ "Former Test paceman Munir Malik passes away". Dawn (newspaper). Pakistan Herald Publications. 2023-09-25. Retrieved 2023-09-25.