మున్షీ నవాల్ కిశోర్
మున్షీ నవాల్ కిశోర్ (3 జనవరి 1836 – 19 ఫిబ్రవరి 1895) భారతదేశానికి చెందిన పుస్తక ప్రచురణకర్త. అతను కాక్స్టన్ ఆఫ్ ఇండియా అని పిలువబడ్డాడు. 1858లో తన 22వ ఏట లక్నోలో నవాల్ కిశోర్ ప్రెస్ ను స్థాపించాడు. ఈ సంస్థ నేడు ఆసియాలో పురాతన ముద్రణ, ప్రచురణగా ఉంది. [1] మీర్జా గాలిబ్ అతని ఆరాధకులలో ఒకరు.
మున్షీ నవాల్ కిశోర్ | |
---|---|
జననం | 1836 జనవరి 3 |
మరణం | 1895 ఫిబ్రవరి 19 | (వయసు 59)
జాతీయత | బ్రిటిష్ ఇండియన్ |
వృత్తి | పుస్తక ప్రచురణకర్త, పత్రిక సంపాదకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నవాల్ కిశోర్ ప్రెస్ |
జీవిత చరిత్ర
మార్చుమున్షీ నవాల్ కిశోర్ అలీఘర్ కు చెందిన జమీందారు అయిన మున్షీ జమునా ప్రసాద్ భార్గవ రెండవ కుమారుడు, అతను 3 జనవరి 1836న జన్మించాడు. ఆరేళ్ల వయసులో అరబిక్, పర్షియన్ భాష నేర్చుకోవడానికి స్థానిక పాఠశాలలో (మక్తాబ్)లో చేరారు. అతను పాత్రికేయ రచనలో తన ఆసక్తిని పెంచుకున్నాడు, సఫీర్-ఎ-ఆగ్రా అనే ఒక స్వల్పకాలిక వారపత్రికను విడుదల చేశాడు. మున్షీ హర్ సుఖ్ రాయ్ యాజమాన్యంలోని కోహ్-ఇ-నూర్ ప్రెస్ పత్రిక కోహ్-ఇ-నూర్ కు అసిస్టెంట్ ఎడిటర్ గా, ఎడిటర్ గా కొంతకాలం పనిచేశారు. [2]
1858 నవంబరు 23న మున్షీ నవాల్ కిశోర్ ప్రెస్ అనే ప్రింటింగ్ ప్రెస్ ను స్థాపించాడు. 1859 నుండి అతను ఔద్ అఖ్బర్ అని కూడా పిలువబడే వారపత్రిక అవధ్ అఖ్బర్ ను ప్రచురించడం ప్రారంభించాడు.
మున్షీ నవాల్ కిశోర్ 1858-1885 కాలంలో అరబిక్, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, పంజాబీ, పష్తో, పర్షియన్, సంస్కృతం, ఉర్దూలో 5000 కు పైగా పుస్తకాలను ప్రచురించారు. [3]
మున్షీ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. [4]
మరణం
మార్చుఆయన 19 ఫిబ్రవరి 1895 ఢిల్లీలో మరణించాడు. అతని మృతదేహాన్ని ఖననం చేశారు. భారత ప్రభుత్వం 1970లో ఆయన గౌరవార్థం అతనిపై తపాలా ముద్ర ను జారీ చేసింది. [5]
మూలాలు
మార్చు- ↑ "Munshi Nawal Kishore, India's Amazing Publisher – Mridula Tandon" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 జనవరి 2022.
- ↑ Haider, Syed Jalaluddin (1 జనవరి 1981). "Munshi Nawal Kishore (1836—1895) Mirror of Urdu Printing in British India". Libri (in ఇంగ్లీష్). 31 (Jahresband): 227–237. doi:10.1515/libr.1981.31.1.227. ISSN 1865-8423.
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 30 జనవరి 2015. Retrieved 15 జనవరి 2022.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 30 జనవరి 2015. Retrieved 15 జనవరి 2022.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Ainy (26 జనవరి 2015). "Munshi Newal Kishore" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 జనవరి 2022.