ముసలమ్మ మరణము
ముసలమ్మ మరణం కట్టమంచి రామలింగారెడ్డి రచించిన పద్యకావ్యం. కందుకూరి వీరేశలింగం పంతులు లాగానే, కట్టమంచి రామలింగారెడ్డి ఆంగ్ల సాహిత్యం వలన ప్రభావితుడై చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం) నుండి కథాంశాన్ని తీసుకొని, ఈ కావ్యాన్ని వ్రాశాడు. ఇది ముసలమ్మ అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ గాథ. ఆమె తమ ఊరి చెరువు కట్ట చిన్నగా తెగిపోతూ ఉండడం చూసి ఊరి వారిని ఆపద నుంచి తప్పించడం కోసం, తనకు తానే అడ్డుపడి, తన ప్రాణాలను అర్పిస్తుంది.
నేపథ్యం
మార్చుఇందులో కథ ఎవరో తెలుగువారి రాసి, బ్రౌన్ దొరచే ప్రచురింపబడిన అనంతపుర చరిత్ర అనే గ్రంథం నుండి స్వీకరించబడినది. అనంతపురానికి సమీపంలో బుక్కరాయ సముద్రమని ఒక ఊరున్నది. ఆఊరి చెరువుకట్టకు ముసలమ్మ కట్ట యని పేరు. అక్కడ ప్రతి యేటా ముసలమ్మను గ్రామదేవతగా పూజించుచు పొంగళ్ళు పెడుతారు. ఇదే విషయమై ఆ పల్లెలో శిలాశాసనమున్నట్లు రామలింగారెడ్డి గ్రంథ పీఠికలో రాశాడు. అనంతపురంలో నివసించిన ఆయన స్నేహితుడు నారాయణ స్వామి నాయని ద్వారా ఆ పుస్తకం చదివాడు.
ప్రచురణ
మార్చుసమర్థి రంగయ్య సెట్టి చెన్నపట్టణంలోని క్రైస్తవ కళాశాలకు అనుబంధంగా శ్రీమదాంధ్రభాషాభిరంజని అనే సంస్థ స్థాపించాడు. ఈ సంస్థ నిర్వహించిన పోటీలో ఇది బహుమాన కావ్యంగా ఎంపికైంది. మొదటిసారిగా 1900 లో అచ్చయ్యింది. మరల 1940లో రామలింగారెడ్డి షష్టిపూర్తి సందర్భంగా ఆంధ్ర గ్రంథాల సంఘంలో సభ్యుడైన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరికొంతమంది దాతల సహకారంతో ప్రచురించాడు.
బహుమతులు
మార్చు- 1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.