ముస్సోరీ

ముస్సోరీ భారతదేశం,ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ నగరానికి సమీపంలో ఉన్న హిల్ స్టేషన్, నగరం.

ముస్సోరీ భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ నగరానికి సమీపంలో ఉన్న హిల్ స్టేషన్, నగరం.[3] ఇది రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుండి 35 కిలోమీటర్లు (22 మైళ్ళు), దేశ రాజధాని న్యూ ఢిల్లీకి ఉత్తరాన 290 కి.మీ (180 మైళ్ళు) దూరంలో ఉంది. ఈ హిల్ స్టేషన్ గర్హ్వాల్ హిమాలయ శ్రేణుల దిగువన ఉంది. బుర్లోగంజ్, జరిబానీ పట్టణాల వలె, సైనిక కంటోన్మెంట్‌తో కూడిన లందూర్ పట్టణం "గ్రేటర్ ముస్సోరీ"లో భాగంగా పరిగణించబడుతుంది.[4] ముస్సోరీ సముద్ర మట్టానికి సగటున 2,005 మీటర్లు (6,578 అడుగులు) ఎత్తులో ఉంది. దీనికి ఈశాన్యంలో హిమాలయ శ్రేణులు, దక్షిణాన డూన్ వ్యాలీ, సివాలిక్ శ్రేణులు ఉన్నాయి. ముస్సోరీని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు.[5][6]

ముస్సోరీ
మన్సూరీ
హిల్ స్టేషన్
గన్ హిల్ పై నుండి ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ దృశ్యం
గన్ హిల్ పై నుండి ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ దృశ్యం
Nickname(s): 
క్వీన్ ఆఫ్ ది మౌంటెన్స్, క్వీన్ ఆఫ్ ది హిల్స్
ముస్సోరీ is located in Uttarakhand
ముస్సోరీ
ముస్సోరీ
భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లో స్థానం
Coordinates: 30°27′N 78°05′E / 30.45°N 78.08°E / 30.45; 78.08
దేశంభారతదేశం ( India)
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాడెహ్రాడూన్
Elevation
2,005 మీ (6,578 అ.)
జనాభా
 (2011)
 • Total30,118
భాషలు
 • అధికారిక భాషలుహిందీ[1]
 • ప్రాంతీయ భాషగర్వాలీ
Time zoneUTC+5:30 (IST)
PIN
248179[2]
Vehicle registrationUK-07, UK-09

చరిత్ర

మార్చు

ముస్సోరీ అనే పేరు మన్సూర్ నుండి ఉద్భవించింది. మన్సూరి అనేది ఈ ప్రాంతంలో కనిపించే పొద. ఈ నగరాన్ని మన్సూరీ అని కూడా పిలుస్తారు.[7] 1803లో ఉమర్ సింగ్ థాపా ఆధ్వర్యంలోని గూర్ఖాలు గర్వాల్, డెహ్రా లను స్వాధీనం చేసుకున్నారు, దీని ద్వారా ముస్సోరీ స్థాపించబడింది. 1 నవంబర్ 1814న గూర్ఖాలు, బ్రిటిష్ వారి మధ్య యుద్ధం జరిగింది. డెహ్రాడూన్, ముస్సోరీలను 1815 నాటికి గూర్ఖాలు ఖాళీ చేయించారు, 1819 నాటికి సహరాన్‌పూర్ జిల్లాలో విలీనం చేశారు.

ముస్సోరీని 1825లో బ్రిటీష్ సైనిక అధికారి కెప్టెన్ యంగ్ ఒక రిసార్ట్‌గా చేసాడు. డెహ్రాడూన్‌లో రెవెన్యూ సూపరింటెండెంట్ నివాసి అయిన షోర్‌తో కలిసి షూటింగ్ లాడ్జిని నిర్మించాడు.[8] ఈస్టిండియా కంపెనీకి చెందిన లెఫ్టినెంట్ ఫ్రెడరిక్ యంగ్ ముస్సోరీకి గన్ షూటింగ్ కోసం వచ్చాడు. మగల్ బాగ్ రోడ్డులో వేట వసతి గృహాన్ని నిర్మించాడు. అతను 1823లో డూన్ మేజిస్ట్రేట్ అయ్యాడు. తరువాత మొదటి గూర్ఖా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశాడు, లోయలో మొదటిసారి బంగాళదుంపలను కూడా పండించాడు. ముస్సోరీలో అతని పదవీకాలం 1844లో ముగిసింది, ఆ తర్వాత అతను జనరల్‌గా పదవీ విరమణ చేసి ఐర్లాండ్‌కు వెళ్ళడానికి ముందు దిమాపూర్, డార్జిలింగ్‌లలో పనిచేశాడు.[9]

1832లో, సర్ హెన్రీ పోల్ "ది ఓల్డ్ బ్రూవరీ" పేరుతో ముస్సోరీలో మొట్టమొదటి బీర్ డిస్టిలరీని స్థాపించాడు. 1901 నాటికి, ముస్సోరీ జనాభా 6,461కి పెరిగింది. వేసవిలో 15,000 జనాభా ఉండేది. ముస్సోరీకి 58 మైళ్ల (93 కి.మీ) దూరంలో ఉన్న సహరాన్‌పూర్ నుండి రోడ్డు మార్గంలో వెళ్లేవారు. కానీ 1900లో డెహ్రాడూన్‌కి రైలు ఏర్పాటు చేయడంతో ప్రయాణం సులభమైంది. ఇది రహదారి ప్రయాణాన్ని 21 మైళ్లకు (34 కి.మీ) తగ్గించింది.

నెహ్రూ కుటుంబం 1920 నుండి 1940లలో తరచుగా ముస్సోరీని సందర్శించి సావోయ్ హోటల్‌లో బస చేసేవారు. వారు సమీపంలోని తోరతున్‌లో గడిపేవారు. నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మి పండిట్ అక్కడే శాశ్వతంగా స్థిరపడింది.[10][11]

1959 టిబెటన్ తిరుగుబాటు సమయంలో, 14వ దలైలామా 1959 ఏప్రిల్ 20న ముస్సోరీలో ఉన్నాడు. అతను 1960 ఏప్రిల్ వరకు ఉండి, తరువాత హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్ళాడు.[12] ఇది ప్రస్తుతం సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. మొదటి టిబెటన్ పాఠశాల 1960లో ముస్సోరీలో స్థాపించబడింది. టిబెటన్లు ప్రధానంగా హ్యాపీనెస్ లోయలో స్థిరపడ్డారు. నేడు, ముస్సోరీలో సుమారు 5,000 మంది టిబెటన్లు నివసిస్తున్నారు.[13]

భౌగోళికం

మార్చు

ముస్సోరీ భౌగోళిక స్థానం 30.45° ఉత్తర అక్షాంశం, 78.08° తూర్పు రేఖాంశంలో ఉంది. ఇది సగటున 1,826 మీటర్లు (5,991 అడుగులు) ఎత్తులో ఉంది.

వాతావరణం

మార్చు

ముస్సోరీ ఉపఉష్ణమండల ఎత్తైన వాతావరణాన్ని కలిగి ఉంది, ఇది మధ్య ఎత్తులో ఉన్న హిమాలయాల (కొప్పెన్) కంటే విలక్షణమైనది. ఇక్కడ వేసవికాలం వేడిగా, చాలా తేమగా ఉంటుంది, జూలై, ఆగస్టులలో సగటున 660 మిల్లీమీటర్ల (26 అంగుళాలు) వర్షం కురుస్తుంది. ఋతుపవనాలకు ముందు ఏప్రిల్, మే నెలలు సాధారణంగా వేడిగా, పొడిగా ఉంటాయి. జూన్ మధ్య నుండి భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో ఋతుపవనాల అనంతర కాలం కూడా పొడిగా ఉంటుంది. చలికాలంలో చాల చల్లగా, పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అటవీ నిర్మూలన, కొత్త నిర్మాణాలు, గ్లోబల్ వార్మింగ్ వంటి స్థానిక, ప్రపంచ కారకాల కలయిక కారణంగా హిమపాతం ఉన్న రోజుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో తగ్గినప్పటికీ, ముస్సోరీలో సాధారణంగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలలో ఎక్కువ హిమపాతం ఉంటుంది.[14]

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [15] ముస్సోరీలో 30,118 జనాభా ఉంది. జనాభాలో పురుషుల నిష్పత్తి 55%. కాగా మహిళల నిష్పత్తి 45%. ముస్సోరీలో సగటు అక్షరాస్యత రేటు 89%, ఇది జాతీయ సగటు 75% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 94%, స్త్రీల అక్షరాస్యత 84%. ముస్సోరీ జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

రవాణా

మార్చు

ముస్సోరీ, ఢిల్లీ, ఇతర నగరాలకు రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. దీనిని గంగోత్రి, యమనోత్రికి ప్రవేశ ద్వారం అంటారు. దీనికి సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. అక్కడి నుండి ముస్సోరీకి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సందర్శించడానికి మార్చి నుండి నవంబరు వరకు అనువైన సమయం.

ప్రముఖ వ్యక్తులు

మార్చు
 • రస్కిన్ బాండ్
 • టామ్ ఆల్టర్
 • అనితా దేశాయ్
 • సైరా బాను
 • జమీలా గావిన్
 • స్టీఫెన్ ఆల్టర్
 • నయనతార సహగల్
 • మార్తా చెన్
 • విక్టర్ బెనర్జీ
 • సయీద్ జాఫ్రీ

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 • భద్రజ్ ఆలయం
 • ధనౌల్తి
 • లాల్ టిబ్బా
 • గన్ హిల్
 • కెంప్టీ ఫాల్స్
 • సర్ జార్జ్ ఎవరెస్ట్ హౌస్
 • హ్యాపీ వ్యాలీ
 • నాగ్ దేవతా ఆలయం

మూలాలు

మార్చు
 1. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. p. 47. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 16 January 2019.
 2. "Mussoorie Pin code". citypincode.in. Archived from the original on 2 April 2015. Retrieved 3 March 2015.
 3. "Mussoorie - Queen of the Hills | Uttarakhand Tourism". uttarakhandtourism.gov.in. Retrieved 2023-07-15.
 4. "Mussoorie, India". WorldAtlas. 2 February 2022. Retrieved 3 February 2022.
 5. Dhir, Laruna (16 March 2018). "Who stripped my Dehradun off its charm?". DailyO. Retrieved 6 April 2018.
 6. Joshi, Nidhi (23 May 2017). "Mussoorie: The original Queen of Hills". Moneycontrol.com. Retrieved 1 March 2018.
 7. "Mussoorie | Uttarakhand Tourism Development Board". Department of Tourism, Government Of Uttarakhand, India. Retrieved 18 December 2019.
 8. "Mussoorie Tourism :- History of Mussoorie | Mussoorie History | British Rule Mussoorie | About Mussoorie". www.mussoorietourism.in. Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 25 సెప్టెంబరు 2021 suggested (help)
 9. "Search for services or information". www.gov.ie. Retrieved 2022-05-31.
 10. Pioneer, The. "Murder at Savoy". The Pioneer. Retrieved 9 April 2020.
 11. "Mussoorie: Pandit Nehru's second home". The Times of India. 2015-05-26. ISSN 0971-8257. Retrieved 2023-07-15.
 12. Lama, The 14th Dalai (9 April 2020). "Chronology of Events". The 14th Dalai Lama. Retrieved 9 April 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 13. "50 Years of Central Tibetan Schools Administration". pib.gov.in. Retrieved 10 May 2020.
 14. "What causes 'winterline' and why is it visible only in a few places in the world? - Times of India". The Times of India. 15 November 2009. Retrieved 6 April 2020.
 15. "Mussoorie Population Census 2011". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 19 September 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ముస్సోరీ&oldid=4108157" నుండి వెలికితీశారు