ప్రధాన మెనూను తెరువు

అనితా మజుందార్ దేశాయి భారతీయ నవలా రచయిత్రి, విశ్వవిద్యాలయ ఆచార్యులు. 1937జూన్ 24న జన్మించిన అనితా మజుందార్ రచయిత్రిగా మూడు పర్యాయాలు బుకర్ ప్రైజ్కు నామినేట్ అయ్యింది. 1978లో ఫైర్ అన్ ది మౌంటెన్ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది[1]. ద విలేజ్ బై ది సీ రచనకు గానూ ఆమె బ్రిటీష్ గార్డియన్ ప్రైజ్‌ను పొందింది.[2]

అనితా దేశాయి
పుట్టిన తేదీ, స్థలంఅనితా మజుందార్
(1937-06-24) 1937 జూన్ 24 (వయస్సు: 82  సంవత్సరాలు)
ముస్సోరి, భారతదేశం
వృత్తిరచయిత, ఆచార్యులు
జాతీయతభారతీయురాలు
పూర్వవిద్యార్థిఢిల్లీ విశ్వవిద్యాలయం
కాలం1963–వర్తమానం
రచనా రంగంకాల్పానిక
సంతానంకిరణ్ దేశాయి

కుటుంబ నేపథ్యంసవరించు

అనితా మజుందార్ ఉత్తర భారతదేశంలోని నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రడన్ జిల్లాలోని ముస్సూరీలో జన్మించింది. టోనీ నైమ్‌, డి.ఎన్‌.మజుందార్ ఈమె తల్లిదండ్రులు. తల్లి జర్మన్ జాతీయురాలు, తండ్రి బెంగాళీ వ్యాపారవేత్త[3]. ఇంట్లో తల్లిదండ్రుల భాషలు నేర్చుకుంటూ పెరిగింది. ఆమె సాహితీక్షేత్రానికి సాధనమైన ఆంగ్లభాషను పాఠశాల స్థాయిలో నేర్చుకుంది. తరువాత ఉర్దూ, హిందీ భాషలూ అలవడినవి. అనిత తన ఏడవ యేట నుండే రచనలు చేయడం ప్రారంభించింది. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే ఆమె రాసిన కథ అచ్చైంది[3].

ఢిల్లీలోని క్వీన్ మేరీ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1957లో ఆంగ్లసాహిత్యం ఐచ్చికాంశంగా పట్టభద్రురాలైంది. అదే సంవత్సరం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్టర్, రచయిత అయిన అశ్విన్ దేశాయిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు. బుకర్ ప్రైజ్ విజేత నవలా రచయిత అయిన కిరణ్ దేశాయి ఆ నలుగురిలో ఒకరు. అనిత వారాంతాలలో తన పిల్లలను అలీబాగ్ సమీపాన ఉన్న తుల్ కు వెళ్ళేది. అక్కడి అనుభవాలు, సంగతుల ఆధారంగానే ఆమె ది విలేజ్ బై ది సీ పుస్తకాన్ని రచించింది. ఈ పుస్తకం 1983లో గార్డియన్ చిల్డ్రన్స్ ఫిక్షన్ ప్రైజ్‌ను గెలుచుకుంది. బ్రిటీష్ బాల సాహిత్య సృజనకారులు ఈ పుస్తకానికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా ప్రకటించారు.

సాహితీ ప్రస్థానంసవరించు

1963లో అనితా దేశాయి తన మొదటి నవల క్రై ది పికాక్ వెలువరించింది. 1980లో క్లియర్ లైట్ ఆఫ్ డే వెలువరించింది.ఇది ఆమె జీవన స్మృతుల ఆధారంగా రాయబడింది.[4] 1984లో ఇన్ కస్టడీ నవలను ప్రచురించింది. ఇది ఒక ఉర్దూ రచయిత చరమాంక జీవితాన్ని ప్రతిబింబించిన రచన. 1993లో అనితా దేశాయి మసాచుసెట్ సాంకేతిక విద్యాలయంలో క్రియేటివ్ విభాగంలో అధ్యాపకురాలిగా చేరింది[5] ఇటీవల తన కథలను ద ఆర్టిస్ట్ ఆఫ్ డిసప్పీయరెన్స్ పేరుతో కథాసంకలనంగా 2011లో వెలువరించింది.

వృత్తి జీవితంసవరించు

అనితా దేశాయి మౌంట్ హోల్‌యోక్ కళాశాలలో, బార్చ్ కళాశాలలో, స్మిత్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. రాయల్ సొసైటీ (సాహిత్యం) ఫెలోగా గౌరవాన్ని అందుకుంది[6].

రచనలుసవరించు

 1. ది ఆర్టిస్ట్ ఆఫ్ డిసప్పీయరెన్స్ (2011)
 2. ది జిగ్‌జాగ్ వే (2004)
 3. డైమండ్ డస్ట్ అండ్ అదర్ స్టోరీస్ (2000)
 4. ఫాస్టింగ్, ఫీస్టింగ్ (1999)
 5. జర్నీ టూ ఇథాకా (1995)
 6. బామ్‌గార్నర్స్ బాంబే (1988)
 7. ఇన్ కస్టడీ (1984)
 8. ద విలేజ్ బై ది సీ (1982)
 9. క్లియర్ లైట్ ఆఫ్ డే (1980)
 10. గేమ్స్ ఎట్ ట్విలైట్ (1978)
 11. వేర్ షల్ వి గో దిస్ సమ్మర్? (1975)
 12. ద పికాక్ గార్డెన్ (1974)
 13. బై బై బ్లాక్ బర్డ్ (1971)
 14. వాయిసెస్ ఇన్ ది సిటీ (1965)
 15. క్రై, ది పికాక్ (1963)

చలన చిత్రంగా నవలసవరించు

అనితా దేశాయి రచించిన ఇన్ కస్టడీ నవల ఆధారంగా 1993లో అదే పేరుతో ఆంగ్లంలో చలనచిత్రం వచ్చింది. దీనిని మర్చంట్ ఐవరీ ప్రోడక్షన్స్ నిర్మించింది. షారుక్ హుస్సేన్ చిత్రానువాదం చేయగా, ఇస్మాయిల్ మర్చంట్ దర్శకత్వం వహించాడు[7] ఈ చిత్రానికి భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది. ఈ చిత్రంలో శశి కపూర్, షబనా అజ్మీ, ఓంపురి తదితరులు నటించారు.

అవార్డులుసవరించు

 • 1978 –ఫైర్ ఆన్ ది మౌంటెన్ రచనకు వినిఫ్రెడ్ హోల్ట్‌బై స్మారక పురస్కారం.
 • 1978 – ఫైర్ ఆన్ ది మౌంటెన్ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు.
 • 1980 – కాల్పనికా సాహిత్యంలో (క్లియర్ లైట్ ఆఫ్ డే రచన) బుకర్ ప్రైజుకు నామినేట్
 • 1983 – ద విలేజ్ బై ది సీ రచనకు గార్డియన్ చిల్డ్రన్స్ ఫిక్షన్ పురస్కారం [2]
 • 1984 – కాల్పనికా సాహిత్యంలో (ఇన్ కస్టడీ రచన) బుకర్ ప్రైజుకు నామినేట్
 • 1993 – నైల్ గన్ పురస్కారం
 • 1999 – కాల్పనికా సాహిత్యంలో (ఫాస్టింగ్, ఫీస్టింగ్ రచన) బుకర్ ప్రైజుకు నామినేట్
 • 2000 – అల్బెర్టో మొరావియా సాహిత్య పురస్కారం (ఇటలీ)
 • 2003 – రాయల్ సొసైటీ సాహిత్య విభాగం నుండి బెన్సన్ పతకం[8]
 • 2007 - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు [9]
 • 2014 - పద్మభూషణ్

మూలాలుసవరించు

 1. "Sahitya Akademi Award – English (Official listings)". Sahitya Akademi. Cite web requires |website= (help)[dead link]
 2. 2.0 2.1 "Guardian children's fiction prize relaunched: Entry details and list of past winners". guardian.co.uk 12 March 2001. Retrieved 2012-08-05.
 3. 3.0 3.1 "Anita Desai". Kirjasto.sci.fi. Retrieved 2012-06-21.
 4. "Notes on the Biography of Anita Desai". Elizabeth Ostberg. 12 February 2000. Haverford.edu. Retrieved 2012-06-21.
 5. [1]. LitWeb.net[page needed]
 6. Baumgartner's Bombay, Penguin 1989.
 7. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Anita Desai పేజీ
 8. "Desai, Anita (1937–)". Retrieved 10 August 2010. Cite web requires |website= (help)[page needed]
 9. "Conferment of Sahitya Akademi Fellowship". Official listings, Sahitya Akademi website. Cite web requires |website= (help)

మూలంసవరించు

 • Abrams, M. H. and Stephen Greenblatt. "Anita Desai." The Norton Anthology of English Literature, Vol. 2C, 7th Edition. New York: W.W. Norton, 2000: 2768 – 2785.
 • Alter, Stephen and Wimal Dissanayake. "A Devoted Son by Anita Desai." The Penguin Book of Modern Indian Short Stories. New Delhi, Middlesex, New York: Penguin Books, 1991: 92–101.
 • Gupta, Indra. India’s 50 Most Illustrious Women. (ISBN 81-88086-19-3)
 • Selvadurai, Shyam (ed.). "Anita Desai:Winterscape." Story-Wallah: A Celebration of South Asian Fiction. New York: Houghton Mifflin, 2005:69–90.
 • Nawale, Arvind M. (ed.). “Anita Desai’s Fiction: Themes and Techniques”. New Delhi: B. R. Publishing Corporation, 2011.

వెలుపలి లంకెలుసవరించు