మూడవ శాయాజీరావ్ గైక్వాడ్
శాయాజీరావ్ గైక్వాడ్ - III (మార్చి 11, 1863 - ఫిబ్రవరి 6, 1939) 1875 నుంచి 1939 వరకు బరోడా సంస్థానాన్ని పాలించిన మహారాజా. ఈయన హయాంలో బరోడా రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టాడు.[1] ఈయన ప్రస్తుతం గుజరాత్ లో భాగంగా ఉన్న ప్రాంతాలను పరిపాలించిన మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందినవాడు.
బాల్యం
మార్చుశాయాజీ రావు నాసిక్ జిల్లా, మాలెగావ్ తాలూకాలోని కావ్లానా గ్రామంలో ఒక మరాఠా కుటుంబంలో కాశీరావ్ భికాజీరావ్ గైక్వాడ్, ఉమ్మాబాయి దంపతులకు మార్చి 11, 1863న రెండో కొడుకుగా జన్మించాడు. ఇతని జన్మనామం గోపాల్ రావ్ గైక్వాడ్.[2] ఈయన బరోడా మొదటి మహారాజా ప్రధాన రాణి కాకుండా, ఆమె సవతి సంతతికి చెందిన వాడు. సాధారణంగా రాజవంశాలలో మహరాణుల మొదటి సంతానానికి సింహాసనార్హత ఉంటుంది. కానీ శాయాజీరావుకు అనుకోని పరిస్థితుల్లో ఈ అవకాశం లభించింది.
వారసత్వ సంక్రమణ
మార్చు1870 లో అప్పటి బరోడా మహారాజా సర్ ఖండేరావ్ గైక్వాడ్ మరణించాడు. అతని సోదరుడు మలహర్ రావ్ కి సింహాసనం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ మలహర్ రావు అప్పటికే నీతిమంతుడూ కాదనీ పేరు పడ్డాడు. అంతేకాక ఒకసారి సోదరుని హత్యాయత్నంలో జైలు శిక్ష కూడా ఎదుర్కొన్నాడు. ఖండేరావు భార్య మహారాణి జమ్నాబాయి అప్పటికీ గర్భంతో ఉంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ లింగ నిర్ధారణ జరిగే వరకు అధికార మార్పిడి నిలిపి ఉంచారు. ఆమె కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తేలింది. జులై 5, 1871 లో ఆమె పుట్టిన తర్వాత మలహర్ రావు సింహాసనాన్ని అలంకరించాడు.
మలహర్ రావు ఖజానాలో ధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టి దాన్ని దాదాపు ఖాళీ చేశాడు. ఉదాహరణకు పూర్తి బంగారంతో కూడిన రెండు క్యానన్లు, ముత్యాలతో కూడిన తివాచీ లాంటివి కొనుగోలు చేశాడు. మలహర్ రావు క్రూరమైన, బాధ్యతా రహిత పాలన, అప్పటి ఆంగ్ల సైన్యాధికారి రాబర్ట్ ఫేర్ చెవిన పడ్డాయి. మలహర్ రావ్ దానితో ఆగక తాను చేసిన తప్పులు కప్పిపుచ్చేందుకు రాబర్ట్ ఫేర్ కి ఆర్సెనిక్ విషం కలిపిన ఆహారాన్ని ఇచ్చి చంపాలని చూశాడు. అప్పటి భారతదేశపు సెక్రటరీ లార్డ్ సేలిస్బరీ ఆజ్ఞలు అనుసరించి ఏప్రిల్ 10, 1875 న ఆయన్ను అధికారం నుంచి దించివేసి మద్రాసుకు బహిష్కరించారు. అతను 1882 లో అక్కడే అనామకంగా మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Calcutta, Bombay & Simla : Bourne & Shepherd (active 1864-1900s) - Sayajirao Gaekwad III, Maharaja of Baroda (1863-1939)". www.rct.uk (in ఇంగ్లీష్). Retrieved 2024-12-11.
- ↑ Center, Computer. "The Maharaja Sayajirao University of Baroda". msubaroda.ac.in (in ఇంగ్లీష్). Retrieved 2024-12-11.