మూడు పువ్వులు ఆరు కాయలు (2018 సినిమా)
మూడు పువ్వులు ఆరు కాయలు 2018లో విడుదలైన తెలుగు సినిమా.[1] డాక్టర్ మల్లె శ్రీనివాస్ సమర్పణలో స్మైల్ పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్రావు నిర్మించిన ఈ సినిమాకు రామస్వామి దర్శకత్వం వహించాడు.[2] దినేష్, అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 అక్టోబరు 12న విడుదలైంది.
మూడు పువ్వులు ఆరు కాయలు | |
---|---|
దర్శకత్వం | రామస్వామి |
నిర్మాత | వెంకట్రావు |
తారాగణం | దినేష్ అర్జున్ యజత్ సౌమ్య వేణుగోపాల్ |
నిర్మాణ సంస్థ | స్మైల్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 12 అక్టోబరు 2018 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅర్జున్ (అర్జున్ యాగిత్), భరత్ (నాగరాజు), రామస్వామి (కర్పూరం) ముగ్గురు రూమ్మేట్స్. అర్జున్ పోలీస్ 'ఎస్.ఐ’ కావాలని, కర్పూరం మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. నాగరాజు హారిక (పావని) ప్రేమలో పడి తన జీవితంలో ముఖ్యమైనవి కోల్పోతాడు. ఈ ముగ్గురు తమ జీవిత ఆశయాలను సాధించుకున్నే క్రమంలో వారికి ఎలాంటి కష్టాలు, అడ్డంకులు వచ్చాయి ? వాట్ని వాళ్ళు ఎలా ఎదురుకున్నారు ? వాళ్ళు అనుకున్నది సాధించారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- అర్జున్ యజత్
- సౌమ్య వేణుగోపాల్
- తనికెళ్ళ భరణి
- కృష్ణ భగవాన్
- పృథ్వీ
- అజయ్ ఘోష్
- భరత్ బండారు
- పావని
- రామస్వామి
- సీమా చౌదరి
- బాలాజీ
- రాకెట్ రాఘవ
- జబర్దస్త్ రాంప్రసాద్
- జబర్దస్త్ అప్పారావు
- జబర్దస్త్ మహేష్
- జయలక్ష్మి
- ప్రమోదిని
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: స్మైల్ పిక్చర్స్
- నిర్మాత: వబ్బిన వెంకట్రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామస్వామి
- సంగీతం: కృష్ణ సాయి
- సినిమాటోగ్రఫీ: ఎం.మోహన్ చాంద్
- పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల
- ఆర్ట్ డైరెక్టర్: కె.వి.రమణ
మూలాలు
మార్చు- ↑ Vaartha (8 October 2018). "మూడు పువ్వులు ఆరు కాయలు." Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
- ↑ Sakshi (15 October 2018). "అది మా అదృష్టం". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
- ↑ HMTV (15 October 2018). "మూడు పువ్వులు ఆరు కాయలు సినిమా రివ్యూ". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.