మూలాపేట
మూలాపేట నెల్లూరు లోని ఒక ప్రాంతం. ఇది నెల్లూరు ఏర్పాటుకాకముందు పాత నెల్లూరుగా పేరొందింది.
చరిత్ర
మార్చుమూలస్థానేశ్వర స్వామి పేరుతోనే నెల్లూరులో మూలాపేట రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దేవాలయం కూడా 1400 సంవత్సరం కిందట వెలసిందని ప్రతీతి. పదో శతాబ్దం నుంచి ఇక్కడ శూద్రులు నివాసం ఉండేవారు. కాకతీయ గణపతి దేవుడు నెల్లూరు చెరువు (స్వర్ణాల చెరువు)ను పదో శతాబ్దంలో తవ్వించారు. ఇలా నీటి వనరులను ఆధారంగా చేసుకొని నివాస కేంద్రాలు ఏర్పడ్డాయని పెద్దల మాట. దీంతోపాటు నగరానికే ఒక మూలగా ఈ ప్రాంతం ఉండటం వల్ల దీన్ని మూలప్రాంతమని అనేవారని.. క్రమేపి మూలాపేటగా పిలిచేవారనే మరో కథ వినిపిస్తోంది.
నామవివరణ
మార్చుమూలాస్థానేశ్వరస్వామి ఆలయం ఉండడం వల్ల మూలాపేట అనే పేరు ఏర్పడింది.[1]
పొట్టి శ్రీరాములు నిరసన దీక్ష
మార్చు1945వ సంవత్సరంలో మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానం వెనుక ఉన్న కోనేరు ఒడ్డు నుంచే అమరజీవి పొట్టి శ్రీరాములు హరిజన దేవాలయ ప్రవేశం కోసం దీక్షలు చేపట్టారు. ఇవి నెల్లూరు చరిత్రలో మరిచిపోలేని రోజులుగా చెప్పబడ్డాయి.
పురాణ ప్రశస్థి
మార్చుఈ ప్రాంతము పురాతనమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో ప్రధానంగా నీలకంఠేశ్వర అన్నపూర్ణమ్మవారి ఆలయం.. ధర్మరాజ స్వామి దేవాలయం.. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం.. వీరభద్రస్వామి ఆలయం పేరొందినవి. వీటితోపాటుగా అనేక ఆలయాలు ఇక్కడున్నాయి. స్థానిక దేవాలయాలకు.. ఒక్కొక్క దేవాలయానికి విశిష్టత, మహిమలతో కూడిన సాక్ష్యాలు విశేషంగా చెబుతారు. ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువ ఉండటం వల్ల బ్రాహ్మణవీధి ఏర్పడింది. కంచికామకోటి జయేంద్ర సరస్వతి స్వామిజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శంకరమఠం కూడ ఇక్కడే ఉంది.
తిరుపతి వెంకట కవుల ఆవాసం
మార్చుఇక్కడ తిరుపతి వెంకటకవులు సైతం నివసించేవారని పూర్వికులు చెబుతున్నారు. ఎందరో వేదపండితులకు మూలాపేట పుట్టినిల్లుగా విలసిల్లింది. సాహితీకోవిదులు తమ కళను ప్రదర్శించేవారని చెబుతారు.. శివాలయం వద్ద నాలుగు కాళ్ల మండపాలు.. రాష్ట్రంలోనే అతిపెద్ద బొజ్జగణపతి దేవాలయం ఇక్కడ ఉండడం విశేషం. మూలాపేట ప్రాంతానికి ఎప్పుడు ఏనుగు వచ్చినా.. రాత్రిపూట మాత్రం ఇక్కడ ఉండదని.. స్థానికులు రకరకాల కథలు చెప్పుకుంటారు.
సరస్వతి సమాజం
మార్చుసరస్వతి సమాజం పలువురి మేధావులకు, పదవీ విరమణ చేసిన పెద్దలకు నిలయంగా భాసిల్లుతూ.. ఎన్నో దైవపరమైన కార్యక్రమాలకు ఈ సరస్వతి సమాజం వేదికగా కొనసాగుతోంది. నెల్లూరులోని ఎక్కడ లేనివిధంగా పురాతనమైన సంస్కృత పాఠశాల, కళాశాల ఇక్కడే ఉండటం గర్వకారణం.. పురాతనమైన దివ్యజ్ఞాన సమాజం.. గ్రంథాలయం.. ఒకప్పుడు విశేషంగా చెప్పుకున్నారు. ప్రస్తుతం వీరి సేవలు కనుమరుగయ్యాయి. ఎందరో రాజకీయ వేత్తలను తయారు చేసి విశేషంగా మేధావులను తీర్చిదిద్ది.. వేదపండితులకు నిలయంగా మారి.. మూలాపేట నెల్లూరు చరిత్రలో తన ప్రత్యేక స్థానాన్ని కాపాడుకుంటున్నది.
మూలాలు
మార్చు- ↑ నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 200