మృణాల్ దుసానిస్

మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి

మృణాల్ దుసానిస్ మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి.[3] మరాఠీ టెలివిజన్ కార్యక్రమాలలో ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[4][5]

మృణాల్ దుసానిస్
మృణాల్ దుసానిస్ (2014 ఫిల్మ్ ఫేర్ అవార్డు)
జననం (1988-06-20) 1988 జూన్ 20 (వయసు 35)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మజియా ప్రియాలా ప్రీత్ కలేనా
టు తిథే మీ
సుఖాచ్యా సారిని హే మన్ బవారే
జీవిత భాగస్వామి
నీరజ్ మోర్‌
(m. 2016)
[2]
పిల్లలు1

జననం, విద్య మార్చు

మృణాల్ 1988, జూన్ 20న మహారాష్ట్రలోని నాసిక్‌ పట్టణంలో జన్మించింది. మరాఠా ఉన్నత పాఠశాల నుండి పాఠశాల విద్యను, నాసిక్‌లోని హెచ్.పి.టి. కళాశాల కళాశాలలో కళాశాల విద్యను చదివింది. జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది.

వ్యక్తిగత జీవితం మార్చు

2016లో మృణాల్ కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీరజ్ మోర్‌తో వివాహం జరిగింది.[6][7][8] వారికి 2020 మార్చిలో ఒక పాప జన్మించింది.[9]

నటనారంగం మార్చు

ఏక్తా కపూర్ నిర్మించిన మజియా ప్రియాలా ప్రీత్ కలేనా సీరియల్ ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది.[10] తర్వాత జీ మరాఠీలో వచ్చిన టు తిథే మీ సీరియల్, 2015లో కలర్స్ మరాఠీలో ప్రసారమైన అస్సా ససర్ సురేఖ్ బాయి సీరియల్‌లో,[11] 2018లో సుఖాచ్యా సారిని హే మన్ బవారే సీరియల్‌లో అనుశ్రీగా నటించింది.[12]

నటించినవి మార్చు

టెలివిజన్
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ మూలాలు
2010–2011 మజియా ప్రియల ప్రీత్ కలేనా షమిక పెండ్సే జీ మరాఠీ
2011 ఏక పేక్ష ఏక్ – అప్సర ఆలీ పోటీదారు జీ మరాఠీ [13]
2011–2012 ఆమ్హి సారే ఖవయ్యే హోస్ట్ జీ మరాఠీ [14]
2012–2014 తూ తిథే నాకు మంజీరి ముధోల్కర్ జీ మరాఠీ [15]
2012 హప్తా బ్యాండ్ అతిథి పాత్ర జీ మరాఠీ [16]
2014 రిమోట్ మజా హోస్ట్ ఏబిపి మజా [17]
2015–2017 అస్సా ససర్ సురేఖ్ బాయి! జుయ్ కలర్స్ మరాఠీ [18]
2018–2020 సుఖాచ్యా సారిని హే మాన్ బవారే అనుశ్రీ తత్వవాడి కలర్స్ మరాఠీ [19]
సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2013 శ్రీమంత్ దామోదర్ పంత్ సుమన్ [20]

అవార్డులు, నామినేషన్లు మార్చు

సంవత్సరాలు అవార్డులు విభాగం సీరియల్ ఫలితం
2010 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ నటి మజియా ప్రియల ప్రీత్ కలేనా ప్రతిపాదించబడింది
ఉత్తమ జంట (షమిక-అభిజీత్‌గా) గెలుపు
ఉత్తమ మహిళా అరంగేట్రం
2012 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ నటి తూ తిథే నాకు
ఉత్తమ కోడలు
ఉత్తమ జంట (మంజిరి-సత్యజీత్‌గా) ప్రతిపాదించబడింది
2013 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ కోడలు గెలుపు
ఉత్తమ నటి ప్రతిపాదించబడింది
ఉత్తమ జంట (మంజిరి-సత్యజీత్‌గా)
2019 కలర్స్ మరాఠీ అవార్డులు ఉత్తమ కోడలు సుఖాచ్యా సారిని హే మన్ బవారే
ఉత్తమ నటి గెలుపు
ఉత్తమ జంట (అను-సిద్ధార్థ్‌గా)

మూలాలు మార్చు

  1. "Mrunal Dusanis's birthday on 20 June". Divya Marathi. 2017-06-20. Retrieved 2022-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Mrunal Dusanis enjoying married life". Divya Marathi. 2018-06-24. Retrieved 2022-12-17.
  3. "Mrunal Dusanis has discovered many new things in lockdown – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
  4. "फोटोत दिसणाऱ्या 'या' चिमुरडीला ओळखले का ? आज आहे सर्वात लोकप्रिय अभिनेत्री". Lokmat. Retrieved 2022-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Here's why Mrunal Dusanis is on cloud 9 – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.
  6. "Mrunal Dusanis - Take a look at the real-life partners of Marathi TV actresses". The Times of India. Retrieved 2021-02-16.
  7. "अभिनेत्री मृणाल दुसानिस लग्नाच्या बेडीत". 24taas.com. 2016-02-28. Retrieved 2022-12-17.
  8. "Mrunal Dusanis and Neeraj More Tied In Nuptial Knot". MegaMarathi.Com. Archived from the original on 2021-08-05. Retrieved 2022-12-17.
  9. "Mrunal Dusanis blessed with a baby girl - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-07.
  10. "Maziya Priyala Preet Kalena". balajitelefilms.com. Retrieved 2022-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Mrunal Dusanis exit from tha Assa Sasar Surekh Bai". Divya Marathi. 2017-08-12. Retrieved 2022-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "'ही' अभिनेत्री करतेय छोट्या पडद्यावर 'कमबॅक'!". Maharashtra Times. Retrieved 2022-12-17.
  13. "Eka Peksha Ek Apsara Aali March 03 '11 - Mrunal Dusanis", YouTube (in ఇంగ్లీష్), retrieved 2022-12-17
  14. "Aamhi Saare Khavayye | Marathi Food Show | Dec. 06 '11 | Part - 1 | Zee Marathi TV Serials", YouTube (in ఇంగ్లీష్), retrieved 2022-12-17
  15. "Mrunal Dusanis's Tu Tithe Mee to go off air – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "Hapta Bandh | Marathi Game Show | Full Episode 25 – 17th October 2012 | Zee Marathi TV Serials – YouTube". YouTube. Retrieved 2022-12-17.
  17. "Remote Majha News: Latest News and Updates on Remote Majha at News18". News18 (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-30. Retrieved 2022-12-17.
  18. "५०० भाग सुरेख बाई..." Loksatta. 2017-02-09. Retrieved 2022-12-17.
  19. "'सुखाच्या सरींनी हे मन बावरे'... अनु देणार सिध्दार्थला खास सरप्राइज!". [Maharashtra Times. Retrieved 2022-12-17.
  20. "Shrimant Damodar Pant Marathi Movie Cast,Story,Photos,Official Promo". Marathi Stars. Retrieved 2022-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)

బాహ్య లింకులు మార్చు