మృదులా సిన్హా (27 నవంబర్ 1942 - 18 నవంబరు 2020) ఒక భారతీయ రచయిత్రి. రాజకీయవేత్త, ఆమె 2014 ఆగస్టు 26 నుండి 2019 నవంబరు 2 వరకు గోవా గవర్నర్‌గా పనిచేశారు. ఆమె గోవాకు పనిచేసిన మొదటి మహిళా గవర్నరు.[1][2][3]

మృదుల సిన్హా
17వ గోవా గవర్నర్
In office
2014 ఆగస్టు 26 – 2019 అక్టోబరు23
ముఖ్యమంత్రిమనోహర్ పారికర్
లక్ష్మీకాంత్ పర్సేకర్
ప్రమోద్ సావంత్
అంతకు ముందు వారుఓం ప్రకాష్ కోహ్లీ
తరువాత వారుసత్యపాల్ మాలిక్
వ్యక్తిగత వివరాలు
జననం(1942-11-27)1942 నవంబరు 27
ముజఫర్‌పూర్, బీహార్, బ్రిటిష్ ఇండియా
మరణం2020 నవంబరు 18(2020-11-18) (వయసు 77)
ఢిల్లీ, భారతదేశం
జీవిత భాగస్వామిరాం కృపాల్ సిన్హా

మృదులా సిన్హా బిజెపి మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది.[4] ఆమెకు 2021లో మరణానంతరం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.[5][6]

తొలినాళ్ళ జీవితం

మార్చు

మృదులా సిన్హా బీహార్ రాష్ట్రం, మిథిలా ప్రాంతానికి చెందిన ముజఫర్‌పూర్ జిల్లాలోని చప్ర ధరంపూర్ గ్రామంలో నవంబర్ 27, 1942న జన్మించింది. ఆమె తండ్రి  బాబుచబిలే సింగ్, తల్లి అనుపా దేవి. ఆమె గ్రామం లోనే  ఉన్న స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసింది. ఆ తరువాత లఖిసరై జిల్లాలోని బాలికా విద్యాపీఠ్ అనే రెసిడెన్షియల్ పాఠశాలలో చదువు కొనసాగించింది.[7] చిన్నప్పటినుంచే హిందీ సాహిత్యంపట్ల ఇష్టం  పెంచుకున్న ఆమె, తరువాత  హిందీభాషలో  గద్య  సాహిత్యం రాయడం  ప్రారంభించింది. ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేయుటానికి ముందు ఆమె తల్లిదండ్రులు రాం కృపాల్ సిన్హాతో వివాహం చేయాలని నిశ్చయించారు. అతడు బీహార్ లోని ముజఫర్‌పూర్ లో కళాశాల అధ్యాపకునిగా పనిచేసేవాడు. వివాహం తరువాత ఆమె తన విద్యభ్యాసాన్ని కొనసాగించి మనోవిజ్ఞాన శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె మోతీహరి లోని డా. ఎస్.కె.నిన్హా మహిళా కళాశాలలో అధ్యాపకురానిగా చేరింది. కొంత కాలం తరువాత ఆమె భర్త డాక్టరేట్ డిగ్రీని పొందాడు. ఆమె తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ముజఫర్‌పూర్ లో పాఠశాలను ప్రారంభించింది. అక్కడ ఆమె భర్త కళాశాలలో పనిచేస్తుండేవాడు. ఆమె స్థాపించిన పాఠశాల ఆదర్శవంతంగా ఉండటం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులను పొందింది.

వృత్తి

మార్చు

ఆమె తన భర్త ప్రోత్సాహంతో, రచనా నైపుణ్యాలను పెంపొందించుకొంది. ఆమె లఘు కథతో ప్రయోగాత్మకంగా రచనను ప్రారంభించింది. ఆమెకు గ్రామీణ సంప్రదాయాలు, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి ఉండేది. ఆమె ఈ అంశాలపై అనేక లఘు కథలను వ్రాసింది. ఆమె భర్త పనిచేసే ప్రాంతంలో గల గ్రామీణ ప్రజల నుండి అనేక జానపద కథలను సేకరించింది. వాటిలోని అనేక కథలు హిందీ భాషా పత్రికలలో ప్రచురితమయ్యాయి. తరువాత వాటిని రెండు సంపుటాలుగా "భీహార్ కి లోక్ కథాయేం" (బీహార్ జానపథ కథలు) వెలువరించింది. ఆమె అనేక నవలలు, "రాజమాత విజయరాజె సింధియా" జీవిత చరిత్ర "ఏక్ థీ రానీ ఐసే భీ"ని రచిందింది. ఈ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఒక సినిమా నిర్మాణం జరిగింది.

సమాజ సంక్షేమం కోసం రాం కృపాల్ సిన్హా యొక్క నిబద్ధత కారణంగా ఆయన జిల్లాస్థాయిలో రాజకీయ రంగం వైపు దృష్టి సారించాడు. ప్రారంభంలో మృదులా భర్తకు సహాయ సహకారాలనందించేది. జిల్లా కమిటీ ఎన్నికల కోసం ప్రచార సమయంలో నియోజక వర్గంలోని మహిళలకు చేరుకోవడంలో తన భర్తకు సహాయపడింది.

ఆమెకు స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని తన జ్ఞానంతో గుర్తించి, స్థానిక ప్రజలతో (ప్రత్యేకంగా స్త్రీలతో) బలమైన అనుబంధం ఏర్పరచుకుంది. ఆమె సాంఘిక సంక్షేమం కొరకు బలమైన ఆసక్తి, నిబద్ధతను అభివృద్ధి చేసుకుంది. కానీ ఆమెకు ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదు. ఆమె ఎప్పుడూ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆమె సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు చైర్ పర్సన్ గా ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు

ప్రస్తుతం ఆమె భర్త భీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు.[8] ఆమె 2014 ఆగస్టు వరకు భారతీయ జనతా పార్టీకి జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఉండేది.[9] 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆమె భారతీయ జనతా పార్టీ కోసం ప్రచారాన్ని చేసింది. ఆమె బి.జె.పి మహిళా మోర్చా (స్త్రీ విభాగం) కు ఇన్-ఛార్జిగా ఉంది. 2014 ఆగస్టు 25 న ఆమె గోవాకు గవర్నర్ బాధ్యతలు స్వీకరించింది. ఆమె భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చే ప్రారంభించబడిన స్వచ్ఛ భారత్ అభియాన్కు అంబాసిడర్ గా నియమితురాలయింది.[10][11] గోవా గవర్నర్ గా సేవలందిస్తున్న కాలంలో ఆమె రాజ్ భవన్ లో ప్రతిదినం పూజ చేయుటకు ఒక ఆవు, దూడలను స్వీకరించింది.[12][13]

సాహితీ సేవలు

మార్చు
  • ఏక్ థీ రానీ ఐసీ భీ (లఘు జీవిత చరిత్ర)
  • నయీ దేవయానీ (నవల)
  • ఘర్‌వాస్ (నవల)
  • జో మెహందీ కో రంగ్ (నవల)
  • దేఖా మై చోటే లగే (కథలు)
  • సీతా పూనీ బోలీ (నవల)
  • యయవారి ఆంఖోం సె (ఇంటర్వ్యూలు)
  • బీహార్ కి లోక్ కథాయేం -I (కథలు)
  • బీహార్ కీ లోక్ కథాయేం -II (కథలు)
  • దై బీగా జమీన్ (కథలు)
  • మాత్ర్ దే నహీ హై ఔరత్ (మహిళా స్వేచ్ఛ)
  • నారీ న కథ్‌పుటిల్ న ఉదన్‌పరి - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • అపనా జీవన్ - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • అంతిమ్‌ ఇచ్చా - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • పరితప్త్ లంకేశ్వరి (2015) [14]
  • ముఝే కుచ్ కహనా హై ( 2015 కవిత) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • ఔరత్ ఆవిక్షిత్ పురుష్ నహీ హై - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • చంతా ఔర్ చింతాకె ఇంద్రధనుషాయేం రంగ్ (2016) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • ఇండియన్ వుమెన్ న్యూ ఇమేజస్ ఆన్ ఏన్సియెంట్ ఫౌండేషన్ (2016) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • యా నారీ సర్వ్‌భూతేషు (2016) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • రెల్ఫికేషన్స్ (2017) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
  • ఏక్ సాహిత్య తీర్థ్ స్వ లౌత్కర్ - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ

సినిమాలు & టెలివిజన్ : మృదులా సిన్హా రచించిన "జో మెహందీ కో రంగ్" నవల టెలివిజన్ సీరియల్ కొరకు స్వీకరించారు. ఆమె రాసిన లఘు కథ "దత్తక్ పీఠ", విజయరాజ సింధియా రాజపథ్ సె లోక్ పథ్ పార్ యొక్క జీవిత చరిత్రలు సినిమాలుగా నిర్మించబడినవి. ఆమె రాసిన ప్రధాన సాహిత్య పనులు జాతీయ పురస్కార విజేత అయిన సినిమా నిర్మాత గుల్‌బహర్ సింగ్ స్వీకరించాడు.[15][16]

ఆంగ్లంలోనికి అనువాదాలు

మార్చు
  • ప్లేమ్స్ ఆఫ్ డిసైర్

మరాఠీ లోనికి అనువాదాలు

మార్చు
  • అనుతప్త్ లంకేశ్వరి, రాజశ్రీ ఖండేపర్కార్ చే అనువదింపబడింది.

గుర్తింపులు

మార్చు

ఆమె ముజఫర్‌బాద్, బీహార్ లోణి బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందింది.[17][18]

మూలాలు

మార్చు
  1. "PRESS COMMUNIQUE". Press Information Bureau. 26 August 2014. Archived from the original on 2014-08-27. Retrieved 26 August 2014.
  2. "Sheila Dikshit resigns; Kalyan Singh is new Governor of Rajasthan". Indian Express. PTI. 26 August 2014. Archived from the original on 2014-08-27. Retrieved 26 August 2014.
  3. "Mridula Sinha appointed Goa Governor". Goa News. Goa News Desk. 26 August 2014. Archived from the original on 2014-08-27. Retrieved 26 August 2014.
  4. "Mridula Sinha, first woman Governor of Goa, passes away at 77". 19 November 2020.
  5. "Padma Awards 2021 announced". Ministry of Home Affairs. Retrieved 26 January 2021.
  6. "Ram Vilas Paswan, Mridula Sinha among five Padma awardees from Bihar". Piyush Tripathi. The Times of India. 25 January 2021. Retrieved 25 January 2021.
  7. "Balika Vidyapeeth".
  8. "Want to Serve People: New Goa Governor Mridula Sinha". The New Indian Express. IANS. 26 August 2014. Archived from the original on 30 ఆగస్టు 2014. Retrieved 26 August 2014.
  9. "National Executive - Bharatiya Janata Party". Archived from the original on 3 July 2014. Retrieved 26 August 2014.
  10. http://timesofindia.indiatimes.com/india/Swachh-Bharat-PM-Modi-ropes-in-nine-people-including-Tendulkar-Salman-Khan-Baba-Ramdev/articleshow/44085909.cms
  11. http://www.narendramodi.in/pm-launches-swachh-bharat-abhiyaan/
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-03-24. Retrieved 2018-04-01.
  13. "Goa Governor adopts cow for daily worship". 19 November 2014 – via www.thehindu.com.
  14. "Amazon.in".
  15. "Books by Mridula Sinha". flipkart.com. Archived from the original on 27 ఆగస్టు 2014. Retrieved 26 August 2014.
  16. "Books by Mridula Sinha". books.google.com. Google Books. Retrieved 26 August 2014.
  17. http://www.telegraphindia.com/1150715/jsp/bihar/story_31540.jsp#.VgWD1dLzrIU
  18. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-26. Retrieved 2018-04-01.