మెనింగోకాకల్ టీకా

మెనింగోకాకల్ టీకా, నీసేరియా మెనింగిటిడిస్ ద్వారా సంక్రమణను నివారించడానికి ఉపయోగించే టీకాలలో దేనినైనా సూచిస్తుంది.[1] ఈ క్రింది కొన్ని లేదా అన్ని రకాల మెనింగోకాకస్‌లకు అంటే A, C, W135, Yలను నిరోధించటానికి వేర్వేరు రకాలు ప్రభావవంతంగా ఉంటాయి. 85 శాతం నుండి 100 శాతం వరకు టీకాలు ప్రభావవంతంగా ఉంటాయి.[1] దీన్ని విస్తృతంగా ఉపయోగించే జనాభాలో మెనింజైటిస్, సెప్సిస్ ఫలితాలలో తగ్గుదల ఉంది.[2][3] ఇది కండరానికి లేదా చర్మం కింద ఇంజక్షన్ ద్వారా ఇవ్వబడతాయి.[1]

ఓ మాదిరి లేదా అధిక రేటు ఉన్న దేశాలలో లేదా తరచూ విజృంభణ చెందుతున్న దేశాలలో మామూలుగా టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తుంది.[1][4] వ్యాధి వచ్చే తక్కువ ప్రమాదవకాశం ఉన్న దేశాలలో, అధిక ప్రమాదం గల ప్రజలకు వ్యాధుల నుండి రోగ నిరోధక శక్తిని కలిగించాలని వారు సిఫార్సు చేస్తున్నారు.[1] ఆఫ్రికన్ మెనింజైటిస్ బెల్ట్‌లో ఒకటి నుండి ముప్పై ఏళ్ళ మధ్య ఉన్న వారికి మెనింగోకాకల్ ఎ కాంజుగేట్ వ్యాక్సిన్‌తో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.[4] కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, టీనేజర్లు, అధిక ప్రమాదం ఉన్న ఇతరులకు మామూలుగా నాలుగు రకాల నిరోధానికి  టీకాలను  సిఫార్సు చేస్తారు.[1] హజ్ కోసం మక్కాకు ప్రయాణించే ప్రజలకు కూడా ఇవి అవసరం.[1]


భద్రత అనేది సాధారణంగా మంచిది. ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో కొందరికి నొప్పి, ఎర్రబడటం జరుగుతుంది.[1] గర్భధారణ స్లమయంలో దీని వాడకం సురక్షితంగా కనిపిస్తుంది.[4] మిలియన్ మోతాదులలో ఒకటి కన్నా తక్కువ కేసులలో అనేక రకాల తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలు సంభవిస్తాయి.[1]

మొదటి మెనింగోకాకల్ వ్యాక్సిన్ 1970 లో అందుబాటులోకి వచ్చింది.[5] ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన అతి ముఖ్యమైన మందు.[6] 2014 నాటికి ఒక మోతాదుకు మొత్తం ఖర్చు 3.23 నుండి 10.77 అమెరికా డాలర్లు ఉంది.[7] అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దీని ధర 100 నుండి 200 డాలర్ల మధ్య ఉంది.[8]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Meningococcal vaccines: WHO position paper" (PDF). Weekly epidemiological record. 47 (86): 521-540. Nov 2011. PMID 22128384.
  2. Patel, M; Lee, CK (25 January 2005). "Polysaccharide vaccines for preventing serogroup A meningococcal meningitis". The Cochrane Database of Systematic Reviews (1): CD001093. PMID 15674874.
  3. Conterno, LO; Silva Filho, CR; Rüggeberg, JU; Heath, PT (19 July 2006). "Conjugate vaccines for preventing meningococcal C meningitis and septicaemia". The Cochrane Database of Systematic Reviews (3): CD001834. PMID 16855979.
  4. 4.0 4.1 4.2 "Meningococcal A conjugate vaccine: updated guidance, February 2015" (PDF). Weekly epidemiological record. 8 (90): 57-68. 20 Feb 2015. PMID 25702330.
  5. Barrett, Alan D.T. (2015). Vaccinology : an essential guide. p. 168. ISBN 9780470656167.
  6. "WHO Model List of EssentialMedicines" (PDF). World Health Organization. October 2013. Retrieved 22 April 2014.
  7. "Vaccine, Meningococcal Archived 2017-05-10 at the Wayback Machine". International Drug Price Indicator Guide. Retrieved 6 December 2015.
  8. Hamilton, Richart (2015). Tarascon Pocket Pharmacopoeia 2015 Deluxe Lab-Coat Edition. Jones & Bartlett Learning. p. 315. ISBN 9781284057560.