మెనిస్కస్ అనగా ఒక ద్రవ పదార్థం యొక్క ఉపరితల ప్రదేశంలో ఏర్పడే వక్రత. అది చూచుటకు నెలవంక వలే ఉండును. గ్రీకు భాషలో నెలవంక అనగా “మెనిసి” అని అర్థం. ఆ మాట నుండి “ మెనిస్కస్ “ పుట్టింది. అది ద్రవం యొక్క “తలతన్యత” వలన ఏర్పడుతుంది. ద్రవం బట్టి లేక ఆ పాత్రను బట్టి అది కుంభాకారం లేక పుటాకారంగా ఉండును. ద్రవ పదార్థపు కణాల మధ్య ఆకర్షణ ఎక్కువ ఉన్నచో కుంభాకారం వచ్చును. ఉదా: పాదరసం, గాజు. అదే ఆ ద్రవం వున్న పాత్రతో ఆకర్షణ ఎక్కువ వుంటే పుటాకారం వచ్చును. ఉదా: నీరు, గాజు.

A: పుటాకార మెనిస్కస్ యొక్క అడుగు
B: కుంభాకార మెనిస్కస్ యొక్క పైభాగం

మెనిస్కస్, దాని కొలత మార్చు

ఏదైనా సాధనంతో ద్రవాన్ని కొలిచేటప్పుడు కచ్చితమైన కొలత కోసం దాని మెనిస్కస్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దృష్టి దోషం నివారించుటకు మెనిస్కస్ యొక్క బిందువు (అనగా కుంభాకారం యొక్క శిఖరం లేకపోతే పుటాకారం యొక్క అడుగు ) దగ్గర వున్న విలువ తీసుకోవాలి. గాజు సాధనాలు తయారుచేసేవాళ్ళు మెనిస్కస్ ను పరిగణనలోకి తీసుకొనే తయారుచేస్తారు. మాములుగా అయితే నీటిని ద్రవముగా పరిగణనలోకి తీసుకుంటారు.

కాపిల్లరి చర్య మార్చు

ఇది మొక్కలలో ట్రాన్స్పిరేషన్ లో కీలక పాత్ర పోషించును. ఒక సన్నటి గొట్టాన్ని నీటిలో పెడితే నీరు గొట్టం లోపల పైకి ఉబికి వచ్చును. పైన పుటాకార మెనిస్కస్ ఏర్పడును. నీటిని 2πrdσ శక్తితో అది పైకి లాగును. ఇక్కడ σ అనగా తలతన్యత. నీటి సంబంధిత ద్రవాలు అన్ని ఇలాగే ఉండును. అదే కుంభాకార మెనిస్కస్ ను ఏర్పరచేవన్నీ కిందికి లాగబడును. ఉదా: పాదరసము మొ||