మెన్ ఆర్ ఫ్రం మార్స్, వుమెన్ ఆర్ ఫ్రం వీనస్

Men are from Mars, Women are from Venus (ముద్రణ: మే 1992) జాన్ గ్రే చే రచించబడ్డ ఒక ఆంగ్ల పుస్తకం. స్త్రీ పురుష సంబంధాలను మెరుగు పరచుకోవటానికి, దంపతుల మధ్య భావవ్యక్తీకరణ శైలిని, మానసిక అవసరాలను అర్థం చేసుకోవటమే కీలకం అని ఈ పుస్తకంలో సూచించబడ్డది. ఈ పుస్తకానికి కొనసాగింపుగా తర్వాత చాలా పుస్తకాలు వచ్చాయి.

పేరుకు తగ్గట్టుగా పురుషులు అంగారక గ్రహం నుండి, స్త్రీలు శుక్ర గ్రహం నుండి భూమికి వచ్చి చేరిన వేర్వేరు జాతుల వాళ్ళు అని ఈ పుస్తకం ధ్రువీకరిస్తుంది. ఈ అలంకారాన్నే ముఖ్య ప్రస్తావనగా రచయిత తన అన్నీ రచనలలోనూ, ఉపన్యాసాలలోనూ స్త్రీ పురుషులను రోమను దేవుడు మార్స్ తోనూ, దేవత వీనస్ తోనూ పోలుస్తాడు.

ఇతర మానసిక శాస్త్ర నిపుణులు, స్త్రీవాదులు స్త్రీ పురుషుల మధ్య సామ్యములను ప్రస్తావిస్తే వారికి భిన్నంగా గ్రే వారి మధ్య తేడాల గురించి ప్రస్తావిస్తాడు.

ఉదా: స్త్రీలు వారి సమస్యలను గుర్తింపు కోసమే ఫిర్యాదు చేస్తే పురుషులు పరిష్కారాల కోసం సమస్యల గురించి ఫిర్యాదు చేస్తారు. ఒత్తిడి లో స్త్రీ పురుషుల స్పందన ఎలా ఉంటుంది వంటివి ఈ పుస్తకంలో గ్రే ప్రస్తావించిన ఇతర విషయాలు