శుక్ర 2021లో విడుదలైన తెలుగు సినిమా. అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ హీరో,హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సుకు పూర్వజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 ఏప్రిల్ 23న విడుదలైంది.[1] ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది.[2][3]

శుక్ర
దర్శకత్వంసుకు పూర్వజ్
నిర్మాతఅయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె
నటులుఅరవింద్ కృష్ణ, శ్రీజిత గోష్, విశాల్ రాజ్
సంగీతంఆశీర్వాద్
ఛాయాగ్రహణంజగదీష్ బొమ్మిశెట్టి
విడుదల
23 మే 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

వైజాగ్ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటారు. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విల్లి. విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ) ఒక బిజినెస్ మెన్. సొంత కంపెనీ నడుపుతుంటాడు. అతని అందమైన వైఫ్ రియా (శ్రీజిత ఘోష్). విల్లి బిజీ లైఫ్ వల్ల వైజాగ్ వచ్చాకే ఈ జంటకు ప్రైవసీ దొరుకుతుంది. భర్త తనతో ఎక్కు టైమ్ స్పెండ్ చేయాలని రియా కోరిక. తన బర్త్ డేకు హౌస్ పార్టీ కావాలని విల్లిని కోరుతుంది రియా. అలా తన క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి విల్లీ రియా ఇంట్లో పార్టీ చేసుకుంటారు. ఈ పార్టీ జరిగిన రాత్రి అనూహ్యంగా రియా, మరో ఇద్దరి హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేసిందెవరు, హత్యలకు కారణం ఏంటి, తన భార్యను, స్నేహితులను చంపిన ఆ నేరస్తుడిని విల్లి ఎలా పట్టుకున్నాడు అనేది సినిమా కథ.[4]

నటీనటులుసవరించు

 • అరవింద్ కృష్ణ - విల్లి
 • శ్రీజిత - రియా
 • విశాల్ భార్గవ్ రాజ్
 • సంజీవ్ రాయ్
 • మిలన్ రాఠీ
 • పూజ చౌరాసియా
 • జాస్ ప్రీత్ కౌర్
 • ఈషా శెట్టి

సాంకేతిక నిపుణులుసవరించు

 • నిర్మాతలు - అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె
 • రచన దర్శకత్వం - సుకు పుర్వజ్ [5]
 • సంగీతం - ఆశీర్వాద్
 • కాస్ట్యూమ్ డిజైనర్ - రియా పూర్వజ్
 • సినిమాటోగ్రఫీ - జగదీశ్ బొమ్మిశెట్టి

మూలాలుసవరించు

 1. 10TV (17 April 2021). "శుక్ర కొత్త కాన్సెప్ట్ మూవీ, ఖచ్చితంగా ఆడియెన్స్‌కు నచ్చుతుంది | Shukra" (in telugu). Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.CS1 maint: unrecognized language (link)
 2. Andhrajyothy (8 May 2021). "అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోన్న 'శుక్ర'". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
 3. Sakshi (21 April 2021). "ఏది ఏమైనా మా సినిమా రిలీజవుతుంది". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
 4. NTV Telugu (23 April 2021). "శుక్ర : రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
 5. TV9 Telugu (20 April 2021). "ఇటు సినిమా ఓకే అవడం, అటు నాన్నగారు చనిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి: సుకు పూర్వజ్ - 'Shukra' to release on April 23". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=శుక్ర&oldid=3188647" నుండి వెలికితీశారు