మెస్మరిజం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జర్మనీ దేశానికి చెందిన మెస్మర్ అనే వైద్యుడి పేరు మీద వ్యాపించిన సమ్మోహన విద్య (హిప్నాటిజం). ఆయన పూర్తి పేరు ఫ్రెడరిక్ యాంటన్ మెస్మర్ అని కొన్ని పుస్తకాలలోనూ, ఫ్రాన్సిస్కస్ యాంటోనియస్ మెస్మర్ అని కొన్ని పుస్తకాలలోనూ ఉంది. ఆయన 1734లో జన్మించాడని కొందరు వ్రాస్తే, 1733 అని మరి కొందరు వ్రాశారు. ఆయన 1815 వరకు జీవించారు. నక్షత్రాల నుంచి ఒక దివ్యపదార్థమేదో విశ్వమంతటిలోకీ ప్రవహిస్తున్నదనీ, ఈ పదార్థానికీ, మానవ శరీరానికి మధ్య సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు అనారోగ్యం కలుగుతుందనీ ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.[1] నీటినీ, కొయ్యనీ అయస్కాంతం ప్రభావితం చేయలేదని అందరికీ తెలిసిన విషయం. కానీ, ఆయన ఈ రెండిటికీ అయస్కాంత ప్రభావం కలిగించాడు. తన శరీరంలో నుంచి వ్యాధులను నయం చేసే ఒక దివ్యపదార్థం వెలువడుతూందని ఆయన చెప్పేవారు. ఆశీర్వదిస్తున్నట్లు రోగుల పైగా చేతిని చాస్తూ వారి మధ్య నుంచి ఆయన నడచి వెళుతుంటే వారు సమ్మోహితులవు తుండేవారు. అదే మెస్మరిజంగా స్థిరపడింది. ఆయన సమకాలికులైన డాక్టర్లు మెస్మరిజాన్ని ఒప్పుకోలేదు. పైగా ఆయనను తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ మెస్మరిజం పదం ఇప్పటికీ లోకంలో నిలచి ఉంది.
ఆధారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Wolfart, Karl Christian; Friedrich Anton Mesmer. Mesmerismus: Oder, System der Wechselwirkungen, Theorie und Anwendung des thierischen Magnetismus als die allgemeine Heilkunde zur Erhaltung des Menschen (in German, facsimile of the 1811 edition). Cambridge University Press, 2011. ISBN 9781108072694. Foreword.