భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతిప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడి తో లాభదాయక వృత్తి. [1]

ఎవరు మొదలుపెట్టవచ్చు?

  • చిన్న, సన్నకారు రైతులు
  • భూమి లేని రైతుకూలీలు
  • అందరికీ అందుబాటులో ఉండే పచ్చికబయళ్ళు ఉన్న ప్రదేశాలలో

మొదలు పెట్టేందుకు గల కారణాలు

  • ఎక్కువ మొత్తంలో పెట్టుబడి, త్వరగా వచ్చే లాభాలు
  • చిన్న, సాధారణ పాక సరిపోతుంది
  • పాకలో ఉంచి పెంచే పద్ధతి లాభదాయకము
  • అధికఫలవంతమైన మేకల ఉత్పాదకత
  • ఏడాది పొడవునా పని/ఉపాధి వుంటుంది
  • పలుచని మాంసం, తక్కువ క్రొవ్వుపదార్ధాలు వుండటంతో అందరూ ఇష్టపడతారు.
  • ఎప్పుడైనా వెంటనే అమ్మి సొమ్ముచేసుకొనవచ్చు.

మేలు జాతులు మార్చు

జమునాపరి

  • సాధారణంగా కాస్తా ఎత్తుగా ఉంటుంది.
  • బలమైన, వంపుదిరిగిన ముక్కు, సుమారు 12 అంగుళాల పొడవుండే ఊగులాడే చెవులు బాగా ఎదిగిన జమునాపరి మేకలకు ఉంటాయి.
  • మేకపోతు 65 నుండి 85 కిలోగ్రాములు, ఆడ మేక 45 నుండి 60 కిలోగ్రాములు బరువుంటాయి
  • ప్రతి ఈతకూ ఒక మేక ఆరు నెలలవయసున్న మేకపిల్ల సుమారు 15 కిలోగ్రాముల బరువుంటుంది.
  • రోజుకి 2 నుండగి 2.5 లీటర్ల పాలనిస్తాయి

తెల్లిచెరి

  • మేకలు గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి
  • ప్రతి ఈతకూ 2 నుండి 3 పిల్లలు
  • మగమేక 40 నుండి 50 కిలోగ్రాములు, ఆడగొర్రె 30 కిలోగ్రాములు బరువుంటాయి

బోయర్

  • మాంసం కోసం ఈజాతిని ప్రపంచమంతా పెంచుతున్నారు
  • అత్యంతశీఘ్రంగా ఎదుగుతాయి
  • మగమేక 110 నుండి 135 కిలోగ్రాములు, ఆడమేక 90 నుండి100 కిలోగ్రాములు బరువుంటాయి
  • మేకపిల్లలు 90 రోజుల్లో 20 నుండి 30 కిలోగ్రాములు బరువుంటాయి

పెంపకం కోసం మేకల ఎంపిక మార్చు

ఆడమేక

  • ప్రతి ఈతకు 2 నుండి 3 పిల్లలు కలగాలి
  • 6 నుండి 9 నెలలకు ఎదకు వచ్చి ఉండాలి

మేకపోతు
ఎత్తుగా, విశాలమైన ఎదురురొమ్ముతో నాజూకయిన శరీరం తొమ్మిది నుంచి పన్నెండు నెలల్లో తోడుకోసం తయారవుతాయి. ఆరునెలల వయసున్న పిల్లలను శరీరం బరువు చూసి ఎంపికచేసుకోవాలి. ప్రతి ఈతకు 2 నుండి 3 పిల్లల నిచ్చే తల్లిమేక నుంచి ఎంపికచేసుకోవాలి.

ఆహారపు నిర్వహణ మార్చు

  • పచ్చికబయళ్లలో మేతతోపాటుగా శ్రద్ధగా పెట్టే దాణావల్ల ముమ్మరమైన ఎదుగుదల మాంసకృత్తులు సమ్మృద్ధిగా లభించే తుమ్మ, కస్సవె, లెకుయర్ని లాంటి ఆకుపచ్చటి దాణావల్ల ఆహారరూపములో నత్రజని బాగా లభిస్తుంది.
  • రైతులు పొలం గట్లవెంబడి అగతి, సుబాబుల్, గ్లారిసిదియ చెట్లను పెంచి ఆకుపచ్చటి దాణాగా వాడవచ్చు.
  • ఒక్క ఎకరం చేలో పండించే చెట్లు, ఇతరదాణా మొక్కలు 15 నుండి 30 మేకలకు ఆహారంగా సరిపోతాయి

మిశ్రమదాణాన్ని ఇలా తయారు చెయ్యవచ్చు

దినుసులు పిల్లల దాణా ఎదుగుదలకు దాణా పాలిస్తున్న మేకకు దాణా సూడిమేకకు దాణా
మొక్కజొన్న 37 15 52 35
కాయధాన్యాలు 15 37 --- ---
తెలకచెక్క 25 10 8 20
గోధుమ తవుడు 20 35 37 42
ఖనిజ మిశ్రమం 2.5 2 2 2
ఉప్పు 0.5 1 1 1
మొత్తం 100 100 100 100

పిల్లలకు మొదటి పది వారాలు 50 నుండి100 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. ఎదుగుతున్న వాటికి 100 నుండి 150 ద్రావణాన్ని ప్రతిరోజూ 3 నుండి 10 నెలలపాటు ఇవ్వాలి. సూడి మేకలకు రోజూ 200 గ్రాముల ద్రావణాలను ఇవ్వాలి. ఒక కిలోగ్రాము పాలిస్తున్న మేకలకు 300 గ్రాముల ద్రావణాన్ని ఇవ్వాలి. మేకలపాకల్లో ఖనిజాలదిమ్మలను మంచిరాగితో ( 950 నుండి 1250 పిపియం) ఏర్పాటు చెయ్యాలి.

సంతతివృద్ధి నిర్వహణ
లాభదాయకమైన సంతతివృద్ధికి రెండేళ్ళకు మూడు ఈతలుండాలి. శీఘ్రంగా ఎదిగే, భారీపరిమాణములోని మేకలను సంతతివృద్ధికి వాడుకోవాలి. ఏడాది ఈడున్న ఆడమేకలను సంతతివృద్ధికి వాడాలి. గర్భందాల్చాక ఆడమేక మూడు నెలలలోగా ఈనాలి. అలాగయితేనే రెండేళ్ళకు మూడుసార్లు ఈనుతాయి మేకలు రమారమి ప్రతి 18 నుండి 21 రోజుల కొకసారి ఎదకొస్తాయి ఇది 24 నుండి 72 గంటలపాటు ఉంటుంది ఎదకొచ్చిన మేకలు ఎక్కువగా అరుస్తుంటాయి, కొన్ని బాధతోకూడిన కూతలు పెడుతుంటాయి. తోకను ఒక వైపు నుంచి మరొక వైపుకు ఆపకుండా ఊపుతూ ఉండటం ఎదకొచ్చిన వాటి లక్షణాలలొ మరొకటి. అదనంగా యోని రంధ్రం వాచినట్టు, ఎర్రగా కనిపిస్తుంది, యోనిస్రావాల వల్ల, తోకచుట్టూ తడిగా, మురిగ్గా కనిపిస్తుంది. దాణామీద యావ తగ్గి తరచూ మూత్రవిసర్జన చేస్తుంటాయి. ఎదకొచ్చిన ఆడమేక మరొక ఆడమేక, మగమేకలాగా మీద ఎక్కటమో, లేదా మరొక ఆడమేక ను తనమీద ఎక్కనివ్వటమో చేస్తుంటాయి.

  • ఎదకొచ్చిన 12 నుండి 18 గంటలలో ఆడమేకను జతకట్టించవచ్చు.
  • కొన్ని ఆడమేకలలో ఎద లక్షణాలు 2 నుండి 3 రోజులపాటు కొనసాగుతాయు. కాబట్టి వాటిని ఆ మరుసటి రోజు జతకట్టించవచ్చు.
  • గర్భధారణ సమయం సూమారు 145 నుండి 150 రోజులు కానీ ఒకవారము అటూ ఇటూ కావడము సహజం. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.

పొట్టలోని పురుగుల నిర్మూలన
చూలుకు ముందు ఆడమేకల పొట్టలోని పురుగుల నిర్మూలనం చెయ్యాలి. పిల్లలకు ఒకనెల వయసులో పొట్టలోని పురుగుల నిర్మూలనం చెయ్యాలి. పురుగుల జీవితచక్రం మూడువారాలు కావున, రెండో నెలప్పుడు పొట్టలోని పురుగుల నిర్మూలన చేయించటం శ్రేయస్కరం. ఈనేందుకు 2 నుండి 3వారాల ముందు పొట్టలోని పురుగుల నిర్మూలన చేయించాలి. గర్భస్రావం జరక్కుండా ఉండేందుకు చూలుతొలినాళ్ళలో (రెండు మాసాలలోపు)ని ఆడమేకలకు పొట్టలోని పురుగుల నిర్మూలన చేయించరాదు.

వ్యాధినిరోధకటీకాలు వేయించటం
పిల్లలకు ఎనిమిదివారాల వయసులో, మరలా పన్నెండువారాలకు ఎంటెరోటాక్సేమియా, టెట్నస్ వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. ఆడమేకలకు చూలుకు 4 నుండి 6 వారాల ముందు, ఈనిన తర్వాత 4 నుండి 6 వారాలకు ఎంటెరోటాక్సేమియా, టెట్నస్ వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. మేకపొతులకు ఏడాదికి ఒకసారి ఎంటెరోటాక్సేమియా, టెట్నస్ వ్యాధినిరోధక టీకాలు వేయించాలి.

మేకలకు ఆవాసాలు మార్చు

డీప్ లిట్టర్ పద్ధతి

  • ఒక చిన్న మేకలమందకు ఎదురెదురుగా గాలిప్రసారం జరిగేలా ఉండే ఒక చిన్నపాక సరిపోతుంది.
  • లిట్టర్ఎత్తు కనీసం ఆరు సెంటీమీటర్లు ఉండాలి.
  • రంపపుపొట్టు, వరి ఊక, వేరుశెనగతొక్కలతో లిట్టర్ ఉండవచ్చు.
  • పశువులపాకలోని ఘాటువాసనను పోగొట్టేందుకు తరచూ ముడిసరకును త్రిప్పుతుండాలి
  • లిట్టర్ ముడిసరకును రెండు వారాలకొకసారి మారుస్తుండాలి.
  • ఒక్కొక మేకకు 15చదరపు అడుగుల స్థలం కావాలి.
  • బయటనుంచి పరాన్నజీవులతో వ్యాధులు సంక్రమించకుండా తగు శ్రద్ధతీసుకోవాలి
  • ఎదిగిన ఒక్కొక్క మేక ఏడాదికి ఒక టన్ను ఎరువును ఉత్పత్తిచేస్తుంది.

ఎత్తైన అరుగు విధానము

  • నేలమట్టానికి 3 నుండి 4 అడుగుల ఎత్తున చెక్కపలకను గాని, తీగఉట్టిని ఉంచాలి.
  • ఈ పద్ధతివల్ల బాహ్యపరాన్నజీవుల తాకిడి తక్కువగా ఉంటుంది.

పెంపకం పద్ధతులు

  1. అర్ధ సాంద్ర పద్ధతి
  • పచ్చిక బయళ్ళు తక్కువగా ఉన్నచోట, మేకలకు మేతతర్వాత, ముమ్మరంగా ఆకుపచ్చదాణా, ద్రావణాలనివ్వాలి
  1. సాంద్ర పద్ధతి
  • పాకలోని మేకలకుఆకుపచ్చదాణా,ద్రావణాలనివ్వాలి
  • బయళ్ళలో తిప్పకూడదు
  • పాక డీప్ లిట్టర్ పద్ధతిలో గాని,ఎత్తైన అరుగు పద్ధతిలో గాని ఉండొచ్చు

మేకలభీమా

  • నాలుగవనెలవయసు నుంచి సాధారణభీమా కంపీనీలచే మేకలను భీమా చేయించవచ్చు.
  • వ్యాధులతోగానీ, ప్రమాదవశాత్తు గాని చనిపోతే భీమా సొమ్మును కోరవచ్చు.

భారతదేశములో మేకల పెంపక కేంద్రాలు

  • నాడుర్ మేకల పెంపకకేంద్రం
  • శివాజీపార్క్ మేకల పెంపకకేంద్రం

వ్యాధులు మార్చు

వర్షాకాలంలో నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యాధి) వస్తుంది. వ్యాధి సోకితేనోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.[2][3]

వనరులు మార్చు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]
  2. ఈనాడు, రైతేరాజు (22 March 2020). "పశువులకు గాలికుంటు టీకాలు!". www.eenadu.net. Archived from the original on 30 మార్చి 2020. Retrieved 1 April 2020.
  3. ప్రజాశక్తి, ఫీచర్స్ (22 February 2018). "గాలికుంటు లఎంతో చేటు". డాక్టర్‌. జి. రాంబాబు,. Retrieved 1 April 2020.{{cite news}}: CS1 maint: extra punctuation (link)[permanent dead link]