మేఘనా గాంకర్

కన్నడ సినిమా నటి.

మేఘనా గాంకర్ (జననం 8 మే 1986), కన్నడ సినిమా నటి.[1] 2010లో వచ్చిన నామ్ ఏరియల్ ఒండ్ దిన సినిమాలో తొలిసారిగా నటించింది.[2]

మేఘనా గాంకర్
మేఘనా గాంకర్ (2019)
జననం (1986-05-08) 1986 మే 8 (వయసు 38)
వృత్తికన్నడ సినిమా నటి.
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

తొలి జీవితం

మార్చు

మేఘనా గాంకర్ 1986, మే 8న కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా సమీపంలోని కలబుర్గిలో జన్మించింది. కలబుర్గిలోని శరణ్‌బసవేశ్వర రెసిడెన్షియల్ స్కూల్‌లో పాఠశాల విద్యను చదివి, ఆ తర్వాత బెంగళూరులోని శ్రీ భగవాన్ మహావీర్ జైన్ కాలేజ్ నుండి కామర్స్ విభాగంలో డిగ్రీని పూర్తి చేసింది. బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ, బెంగుళూరులోని ఆదర్శ ఫిల్మ్ & టివి ఇన్స్టిట్యూట్ నుండి ఫిల్మ్ యాక్టింగ్ అండ్ మేకింగ్‌లో డిప్లొమా పట్టాలు పొందింది.

సినిమారంగం

మార్చు

టెలివిజన్ నటిగా తన కళా జీవితాన్ని ప్రారంభించిన మేఘనా 2010లో నామ్ ఏరియల్ ఒండ్ దిన తొలిసారిగా నటించింది. ఈ సినిమాలలోని చిన్ను పాత్రకు ప్రశంసలను అందుకుంది.[3] తరువాత, 2011లో వినాయక గేలియరా బలగా అనే మల్టీస్టారర్ సినిమాలో విజయ్ రాఘవేంద్రతో కలిసి నటించింది. అదే సంవత్సరం రక్షిత్ శెట్టితో కలిసి తుగ్లక్ సినిమాలో కూడా నటించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2010 నామ్ ఏరియాల్ ఓండ్ దిన చిన్ను
2011 వినాయక గేలియరా బలగా కావ్య
తుగ్లక్ సానియా
2013 చార్మినార్ రాధే నామినేట్: ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – కన్నడ [4]
2014 భక్త శంకర
2016 సింపల్లాగ్ ఇన్నోండ్ లవ్ స్టోరీ కుషీ
2019 కాళిదాసు కన్నడ మేస్త్రీ సుమా

మూలాలు

మార్చు
  1. "I know what to do - Meghana Gaonkar". indiaglitz.com. Archived from the original on 8 జూలై 2012. Retrieved 9 April 2015.
  2. https://timesofindia.indiatimes.com/entertainment/kannada/movies/news/meghanas-granny-wins-gulbarga-elections/articleshow/18905869.cms
  3. "Nam Areal Ondina Review - Kannada Movie Review by V.S.Rajapur". Archived from the original on 2019-03-31. Retrieved 2022-02-06.
  4. "61st Idea Filmfare Awards (South) Nomination list". filmfare.com. 8 July 2014. Retrieved 9 April 2015.

బయటి లింకులు

మార్చు