మేలుకొలుపు (1978 సినిమా)

మేలుకొలుపు నందమూరి తారకరామారావు కథానాయకుడిగా 1978లో విడుదలైన తెలుగు సినిమా.శ్రీ భాస్కర చిత్ర వారు నిర్మించిన ఈ సినిమాకి బి. వి. ప్రసాద్ దర్శకుడు కాగా, మాస్టర్ వేణు సంగీతం అందించారు. ఇంకా ఈ చిత్రంలో జయప్రద, కె. ఆర్. విజయ ముఖ్య పాత్రలు పోషించారు.

మేలుకొలుపు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం నందమూరి తారక రామారావు ,
కె.ఆర్.విజయ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ భాస్కర చిత్ర
భాష తెలుగు

సంక్షిప్త కథ

మార్చు

రాము అనే బాలుడు తన అక్కను బ్రతికించుకోవడానికి పెద్ద డాక్టరు వద్దకు వెళతాడు. డబ్బు లేనిదే వైద్యం చేయనంటాడు ఆ డాక్టర్. నిరాశతో ఇంటికి తిరిగివచ్చిన రాముకు అక్క శవం ఎదురౌతుంది. దానితో రాము సమాజంపై తిరగబడతాడు. పైకి మహాత్ముని అనుచరుడినని చెప్పుకుంటూ రహస్యంగా చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేసే దయానిధి రామును చేరదీస్తాడు. దొంగతనాలకు అలవాటు పడిపోయిన రామును ఇన్‌స్పెక్టర్ శేఖర్ అరెస్ట్ చేస్తాడు. అతడిని బాల నేరస్థుల శిక్షణ సంస్థకు పంంపిస్తాడు. అక్కడ ప్రిన్సిపాల్ శాంతి రాములో మానసిక పరివర్తన తేవడానికి ప్రయత్నిస్తుంది.[1]

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం : బి.వి.ప్రసాద్
  • పాటలు : సి.నారాయణరెడ్డి, దాశరథి
  • సంగీతం : మాస్టర్ వేణు
  • ఛాయాగ్రహణం: ఎం.ఎ.రహ్మాన్

పాటలు

మార్చు
  1. ఎందరో మహానుభావులు అందరికి వందానాలు - పి. సుశీల - రచన: డా. సినారె
  2. కనరాని నీవే కనిపించి నావే అనురాగ వీణ పలికించి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి
  3. చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు - ఎస్. జానకి బృందం - డా. సినారె
  4. చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు - ఎస్. జానకి, వసంత బృందం - డా. సినారె
  5. డియ్యాలో డియ్యాలో డియ్యాలో అహ పంతులు - వసంత బృందం - రచన: దాశరధి
  6. పలికే మువ్వలలో తెలుపలేని కధలెన్నోతీయని నవ్వులలో - పి. సుశీల - డా. సినారె

మూలాలు

మార్చు
  1. వెంకట్రావ్ (19 January 1978). "చిత్రసమీక్ష మేలుకొలుపు" (PDF). ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 64, సంచిక 285. Archived from the original (PDF) on 2 సెప్టెంబరు 2022. Retrieved 2 సెప్టెంబరు 2022.